Crypto Currency: క్రిప్టో కరెన్సీ ఏ దేశాల్లో అమల్లో ఉంది.. ఇండియాలో పరిస్థితి ఏంటి?
ABN , Publish Date - Aug 08 , 2024 | 06:39 PM
ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ(Crypto Currency)తో ప్రపంచవ్యాప్తంగా(wrold wide) అనేక చోట్ల చాలా కార్యకలాపాలు జరుగుతున్నాయి. దీనిని పలు ప్రాంతాల్లో అధికారికంగా గుర్తించగా, మరికొన్ని చోట్ల మాత్రం నిషేధించారు. ఇక ఇండియా విషయానికి వస్తే ఇక్కడ మాత్రం అధికారికంగా అనుతించలేదు. అయినప్పటికీ ఇటీవల సంవత్సరాలలో క్రిప్టోకరెన్సీకి సంబంధించి పెట్టుబడిదారులలో భారీగా ప్రజాదరణ పెరిగింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ(Crypto Currency)తో ప్రపంచవ్యాప్తంగా(wrold wide) అనేక చోట్ల చాలా కార్యకలాపాలు జరుగుతున్నాయి. దీనిని పలు ప్రాంతాల్లో అధికారికంగా గుర్తించగా, మరికొన్ని చోట్ల మాత్రం నిషేధించారు. ఇక ఇండియా విషయానికి వస్తే ఇక్కడ మాత్రం అధికారికంగా అనుతించలేదు. అయినప్పటికీ ఇటీవల సంవత్సరాలలో క్రిప్టోకరెన్సీకి సంబంధించి పెట్టుబడిదారులలో భారీగా ప్రజాదరణ పెరిగింది. తక్కువ సమయంలో పెట్టుబడులు పెట్టి కోటీశ్వరులు కావాలని అనేక మంది వీటిలో పెట్టుబడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ(telangana), ఆంధ్రప్రదేశ్(AP) సహా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కోట్ల రూపాయల్లో క్రిప్టో వ్యాపారం చేస్తున్నారు. దీని ద్వారా అనేక మంది లాభపడుతుండగా, నష్టపోతున్న వారు సైతం ఉన్నారు.
నియంత్రించే దిశగా
అయితే 2021లో క్రిప్టోకరెన్సీ బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వం అధికారికంగా క్రిప్టోకరెన్సీని నియంత్రించే దిశగా అడుగు వేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేసిన అధికారిక డిజిటల్ కరెన్సీని రూపొందించడానికి ఓ బిల్లును ప్రవేశపెట్టారు. ఇది అన్ని ఇతర ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను కూడా నిషేధిస్తుందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే 2022 యూనియన్ బడ్జెట్‌లో వర్చువల్ డిజిటల్ ఆస్తులు లేదా క్రిప్టోకరెన్సీల నుంచి వచ్చే లాభాలపై ప్రభుత్వం 30% పన్ను, 1% TDS విధించింది.
ఈ నేపథ్యంలో క్రిప్టోకరెన్సీని బహుమతిగా స్వీకరించినా లేదా బదిలీ చేసినా బహుమతి పొందిన వ్యక్తికి పన్ను విధించబడుతుంది. అయితే వర్చువల్ కరెన్సీపై పన్ను విధించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం స్వీకరించినప్పటికీ బిట్‌కాయిన్ వంటి కరెన్సీలు భారతదేశంలో చట్టబద్ధమైనవా కాదా అనే దానిపై మాత్రం ప్రభుత్వం ఇంకా అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు. అయితే క్రిప్టోకరెన్సీ నిబంధనలు ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉన్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
అమెరికాలో
USలో పన్ను ప్రయోజనాల కోసం క్రిప్టోకరెన్సీలను ఆస్తులుగా పరిగణిస్తారు. క్రిప్టోకరెన్సీలకు సంబంధించి ఏవైనా లావాదేవీ జరిగితే తప్పనిసరిగా పన్ను రిటర్న్‌లో నమోదు చేయాలి. యూఎస్‌లో, ఫియట్, టోకెన్ ఎయిర్‌డ్రాప్‌లు, మైనింగ్ లేదా స్టాకింగ్ క్రిప్టో కోసం క్రిప్టోను విక్రయించడం, ఒక టోకెన్‌ను మరొకదానికి కొనుగోలు చేయడంపై పన్నులు వర్తిస్తాయి. మూలధన లాభాలు, ఆదాయపు పన్నుల రేట్లు 0 నుంచి 37 శాతం మధ్య ఉంటాయి.
యునైటెడ్ కింగ్‌డమ్
యునైటెడ్ కింగ్‌డమ్‌లో క్రిప్టో లేదా క్యాపిటల్ గెయిన్స్‌లో ఆదాయంపై పన్నులు అమల్లో ఉంటాయి. దీనిపై వర్తించే పన్ను రేట్లు 10 శాతం నుంచి 20 శాతం మధ్య ఉన్నాయి. ఫియట్‌ను ఉపసంహరించుకోవడానికి క్రిప్టోను విక్రయించడం, మరొక టోకెన్ కోసం టోకెన్‌లను వర్తకం చేయడం, నిజమైన ఆస్తులకు చెల్లించడానికి క్రిప్టోను ఉపయోగించడం, క్రిప్టోలో లాభాలు ఆర్జించడం అన్నింటికీ ఇక్కడ పన్నులు వర్తిస్తాయి.
ఇటలీ
ఇటలీలో క్రిప్టోకరెన్సీలు ఆర్థిక సాధనంగా పరిగణించబడతాయి. ఇవి మూలధన లాభాల పన్నుకు లోబడి ఉంటాయి. పోర్ట్‌ఫోలియో విలువ 2000 యూరోలు దాటితే 26 శాతం మూలధన లాభాల పన్ను ఉంటుంది.
జర్మనీ
జర్మనీలో క్రిప్టోకరెన్సీలు వ్యక్తిగత ఆస్తిగా పరిగణించబడతాయి. ఇవి ఆదాయపు పన్నుకు లోబడి ఉంటాయి. మూలధన లాభాల పన్ను సాధారణంగా వ్యక్తులకు కాదు వ్యాపారాలకు వర్తిస్తుంది. ఒక వ్యక్తి సంపాదించిన లాభం 600€ కంటే తక్కువగా ఉంటే అది పన్ను రహితం. జర్మన్ పన్ను చట్టం ప్రకారం వ్యక్తిగత ఆస్తిపై ఆదాయపు పన్ను వర్తిస్తుంది. పన్ను రేటు 0 నుంచి 45 శాతం.
పోర్చుగల్
పోర్చుగల్లో క్రిప్టోకరెన్సీలను మూలధన ఆదాయం లేదా స్వయం ఉపాధి ఆదాయంగా పరిగణిస్తారు. క్రిప్టో నుంచి వచ్చిన ఆదాయంపై 28 శాతం చొప్పున పన్ను విధించబడుతుంది. క్రిప్టో మైనింగ్, వెరిఫికేషన్, టోకెన్ జారీపై 14.5 శాతం నుంచి 53 శాతం మధ్య పన్నులు విధించబడతాయి.
క్రిప్టోకరెన్సీని నిషేధించబడిన దేశాలు
ఆఫ్ఘానిస్తాన్
అల్జీరియా
బంగ్లాదేశ్
బొలీవియా
చైనా
ఈజిప్ట్
ఘనా
ఇరాక్
కువైట్
లెసోతో
లిబియా
మొరాకో
మయన్మార్
నేపాల్
ఉత్తర మాసిడోనియా
రిపబ్లిక్ ఆఫ్ కాంగో
సౌదీ అరేబియా
సియెర్రా లియోన్
ట్యునీషియా
ఇవి కూడా చదవండి:
Business Idea: పెట్టుబడి లేకుండా వ్యాపారం.. ఏటా 50 లక్షలకుపైగా సంపాదించే ఛాన్స్!
Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్
Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..
Read More Business News and Latest Telugu News