Alert: రాఖీ గిప్టుల పేరుతో మోసాలు.. డబ్బులు పోకుండా ఉండాలంటే ఇలా చేయండి
ABN , Publish Date - Aug 19 , 2024 | 12:34 PM
రక్షా బంధన్(rakhi festival) సందర్భంగా అనేక మంది ఆన్‌లైన్‌లో రాఖీలు, మిఠాయిలు, బహుమతులు వంటి వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదునుగా భావించిన కేటుగాళ్లు అమాయక ప్రజలను తప్పుదారి పట్టించి వారి నుంచి డబ్బులు లూటీ చేస్తున్నారు. అయితే ఇలాంటి మోసాలను ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రక్షా బంధన్(rakhi festival) సందర్భంగా అనేక మంది ఆన్‌లైన్‌లో రాఖీలు, మిఠాయిలు, బహుమతులు వంటి వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదునుగా భావించిన కేటుగాళ్లు అమాయక ప్రజలను తప్పుదారి పట్టించి వారి నుంచి డబ్బులు లూటీ చేస్తున్నారు. సైబర్ మోసగాళ్లు(cyber frauds) రోజుకో విధంగా ప్రజలను మభ్యపెడుతున్నారు. తాజాగా యూజర్ల పేరుతోనే రాఖీ పార్సిళ్లు పంపిస్తున్నారని వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో మీ సోదరుడు లేదా సోదరి నుంచి మీకు పార్శిల్ వచ్చినట్లుగా ఏదైనా మెసేజ్ వస్తే జాగ్రత్తగా ఉండండి. దానిని మీ సోదరి పంపించిందా లేదా అని మరోసారి క్రాస్ చెక్ చేసుకోండి. మెసేజ్‌తో పాటు పార్శిల్‌ను ట్రాక్ చేయడానికి లింక్ కూడా పంపబడుతోంది. మీరు దానిని నిజమని లింక్‌పై క్లిక్ చేసే చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంటుంది.
సమాచారం ఇస్తే
ఈ నేపథ్యంలో హ్యాకర్లు ఎప్పటికప్పుడు రకరకాల సాకులతో ప్రజల ఖాతాల్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇలాంటి ఉదంతాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఈ హ్యాకర్లు ఒక్కోసారి మీ అడ్రస్ దొరకడం లేదని, ఇంకోసారి మీ నంబర్ కు ఓటీపీ వస్తుందని చెబుతుంటారు. ఆ క్రమంలో మీరు వారిని నమ్మి సమాచారం ఇస్తే ఇక అంతే సంగతులు. మీ ఖాతా నుంచి డబ్బును దోచేస్తారు. మీకు కూడా ఇలాంటి కాల్స్ లేదా మెసేజ్‌లు వస్తే జాగ్రత్తగా ఉండండి. అయితే ఇలాంటి మోసాలను ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మోసం ఇలా
మోసగాళ్లు మీకు వివిధ సాకులతో లింక్‌లను పంపుతారు. మీరు ఈ లింక్‌పై క్లిక్ చేసిన వెంటనే, వారు మీ ఫోన్‌ను హ్యాక్ చేస్తారు. డెలివరీ కోసం చాలాసార్లు రూ.20 నుంచి 25 అడుతుంటారు. ఆ చిన్న మొత్తం కారణంగా ప్రజలు తరచుగా తమ డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని ఆలోచించకుండా ఇస్తారు. ఈ ప్రక్రియలో మోసగాళ్లు మీ కార్డు వివరాలను పొందుతారు. తర్వాత వారు మిమ్మల్ని మోసం చేయడానికి ఈ సమాచారం సులభంగా ఉపయోగపడుతుంది.
ఇలా దూరం
డెలివరీ బాయ్ లేదా కంపెనీ నుంచి వచ్చే ఎలాంటి లింక్‌పై క్లిక్ చేయకండి
డెలివరీ పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే కొరియర్ కంపెనీకి ఫిర్యాదు చేయండి
Googleలో సెర్చ్ చేసి ఏ కొరియర్ కంపెనీ నంబర్‌ను పొందకండి
ఆ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను ఎల్లప్పుడూ సందర్శించి వివరాలను తెలుసుకోవచ్చు
వెబ్‌సైట్‌లో కంపెనీ పేరు స్పెల్లింగ్‌ను ఇక్కడ ఒకే విధంగా ఉన్నాయో జాగ్రత్తగా తనిఖీ చేయండి
ఏదైనా సమస్య ఉంటే మీరు కంపెనీకి వ్రాతపూర్వక ఫిర్యాదు చేయవచ్చు
ఈ క్రమంలో ఆన్‌లైన్ ఆర్డర్ల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి
ఇవి కూడా చదవండి:
Multibagger Stock: ఒకప్పుడు ఈ స్టాక్ ధర రూ.1.80.. ఇప్పుడు రూ.357.. ఇన్వెస్టర్లకు కోట్లలో లాభం
Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్
Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..
Read More Business News and Latest Telugu News