Share News

Price Hikes: బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు..!

ABN , Publish Date - Jul 06 , 2024 | 04:58 PM

New Delhi: కరోనా తరువాత చాలా మంది ప్రజల సొంత వాహనాలు కొనుగోలు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. ప్రజా రవాణాలో ప్రయాణించడం కారణంగా ఏమైనా వ్యాధులు సోకే ప్రమాదం ఉందని భావించి.. చాలా మంది కార్లను కొనుగోలు చేస్తున్నారు.

Price Hikes: బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు..!
Kia Cars

New Delhi: కరోనా తరువాత చాలా మంది ప్రజల సొంత వాహనాలు కొనుగోలు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. ప్రజా రవాణాలో ప్రయాణించడం కారణంగా ఏమైనా వ్యాధులు సోకే ప్రమాదం ఉందని భావించి.. చాలా మంది కార్లను కొనుగోలు చేస్తున్నారు. తద్వారా దేశంలో కార్ల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఇక ప్రజల నుంచి డిమాండ్ పెరుగుతుండటం.. ముడి సరుకు ధరలు సైతం పెరుగుతుండటంతో ఆటోమొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తుల రేట్లు భారీగా పెంచేస్తున్నాయి.


కియా కారు కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి ఇది బ్యాడ్ న్యూస్. కియా కారు ధరలు భారీగా పెరిగిపోయాయి. కియా సోనెట్, కియా సెల్టోస్, కియా కారెన్స్ మోడళ్లను భారీగా పెంచింది కంపెనీ. ఈ వాహనాల ధరలు రూ. 8 వేల నుంచి 27 వేల వరకు పెంచింది. మరి ఈ మూడు వాహనాల ధరలు పెంచిన తరువాత ఎంత ఉన్నాయి.. వాటి ఫీచర్స్ ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..


కియా సెల్టోస్..

కియా సెల్టోస్ హెచ్‌టిఇ, హెచ్‌టికె ప్లస్ సివిటి వేరియంట్‌ల ధరలో ఎటువంటి మార్పు లేదు. అయితే, హెచ్‌టికె ప్లస్ వేరియంట్ ధర రూ. 5 వేలు పెరిగింది. హెచ్‌టిఎక్స్, హెచ్‌టిఎక్స్ సివిటి వేరియంట్‌ల ధర రూ.15 వేలు పెరిగింది. 1.5 లీటర్ టర్బో పెట్రోల్ వేరియంట్ హెచ్‌టికె ప్లస్ వేరియంట్ iMT ట్రాన్స్‌మిషన్ వేరియంట్ ధర రూ. 17 వేలు పెరిగింది. ఇక 1.5 లీటర్ టర్బో డీజిల్ వేరియంట్‌ విషయానికి వస్తే.. హెచ్‌టిఇ, హెచ్‌టిఎక్స్ ప్లస్ వేరియంట్‌ ధర రూ. 6 వేలు, హెచ్‌టికె వేరియంట్ రూ. 12 వేలు, హెచ్‌టిఎక్స్ ఐఎమ్‌టి వేరియంట్ రూ. 19 వేలు, హెచ్‌టిఎక్స్ ఎటి వేరియంట్ రూ. 17,000 చొప్పున పెరిగింది.


కియా కారెన్స్..

ఈ MPV ప్రీమియం (O) వేరియంట్ ధర రూ. 14 వేలు, ప్రెస్టీజ్ ప్లస్ iMT వేరియంట్ ధర 18 వేలు, ప్రెస్టీజ్ ప్లస్ (O) DCT వేరియంట్ రూ. 19 వేలు, లగ్జరీ ప్లస్ DCT, X-లైన్ వేరియంట్‌ ధర రూ. 22 వేలు చొప్పున పెరిగాయి. 1.5 లీటర్ డీజిల్ వేరియంట్ల ధర రూ.8 వేల (లగ్జరీ వేరియంట్) నుంచి రూ.27 వేలకు (ఎక్స్-లైన్ 6 సీటర్ ఆటోమేటిక్ వేరియంట్) పెరిగింది.


కియా సోనెట్..

1.0 లీటర్ టర్బో పెట్రోల్ వేరియంట్ ధర రూ.17 వేలు, హెచ్‌టికె ప్లస్ వేరియంట్ ధర రూ.16 వేలు, హెచ్‌టిఎక్స్ వేరియంట్ ధర రూ.13,000 వేలు పెరిగాయి. హెచ్‌టిఎక్స్ ఎటి వేరియంట్లు రూ.13 వేలు, జిటిఎక్స్ ప్లస్ వేరియంట్‌ రూ.16 వేలు, ఎక్స్-లైన్ వేరియంట్‌ రూ.17 వేలు పెరిగాయి. అలాగే, 1.5 లీటర్ టర్బో డీజిల్ వేరియంట్ల విషయానికి వస్తే.. హెచ్‌టికె ప్లస్, హెచ్‌టిఎక్స్ ఎటి వేరియంట్‌ రూ. 17,000, హెచ్‌టిఎక్స్ ఎమ్‌టి వేరియంట్‌ ధర రూ. 27 వేలు, జిటిఎక్స్, ఎక్స్-లైన్ వేరియంట్‌ వరుసగా రూ. 11 వేలు, రూ. 2 వేలు పెరిగాయి. HTX iMT, HTX Plus iMT వేరియంట్‌ ధర రూ. 15,000, రూ. 10,000 చొప్పున పెరిగాయి.

For More Business News and Telugu news..

Updated Date - Jul 06 , 2024 | 04:58 PM