Share News

Dhanteras: రూ. 10 లకే బంగారం.. రిలయన్స్ జియో బంపర్ ఆఫర్..

ABN , Publish Date - Oct 29 , 2024 | 05:37 PM

Jio Finance Smart Gold Scheme: ధన్‌తేరస్ సందర్భంగా ముఖేష్ అంబానీకి చెందిన జియో ఫైనాన్స్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. కేవలం 10 రూపాయలకే బంగారాన్ని అందిస్తోంది. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే..

Dhanteras: రూ. 10 లకే బంగారం.. రిలయన్స్ జియో బంపర్ ఆఫర్..
Gold

Jio Finance Smart Gold Scheme: ధన్‌తేరస్ సందర్భంగా ముఖేష్ అంబానీకి చెందిన జియో ఫైనాన్స్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. కేవలం 10 రూపాయలకే బంగారాన్ని అందిస్తోంది. అయితే, ఇది ఫిజికల్ గోల్డ్ కాదండోయ్.. డిజిటల్ గోల్డ్. ధన్‌తేరాస్‌ సందర్భంగా జియో ఫైనాన్స్ ప్రకటించిన ఈ ఆఫర్‌ను ఎలా అందిపుచ్చుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.. ధన్‌తేరాస్‌ సందర్భంగా మీరు బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. ఈ ఆఫర్‌‌లో కేవలం రూ. 10 లకే బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు. దీని కోసం మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొనే బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు.


స్మార్ట్ గోల్డ్‌తో ధన్‌తేరస్‌ సెలబ్రేషన్స్..

ధన్‌తేరస్ సందర్భంగా ముఖేష్ అంబానీ కంపెనీ జియో ఫైనాన్స్ సర్వీసెస్ లిమిటెడ్ కొత్త స్కీమ్‌ ప్రకటించింది. స్మార్ట్ గోల్డ్‌ స్కీమ్‌ను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా బంగారాన్ని డిజిటల్ రూపంలో కొనుగోలు చేయొచ్చు. స్మార్ట్ గోల్డ్‌ పథకం కింద వినియోగదారులు బంగారంపై తమ పెట్టుబడిని ఎప్పుడైనా నగదు, బంగారు నాణేలు, అభరణాల రూపంలో తీసుకోవచ్చు. ఈ స్కీమ్‌లో మీరు వేలు, లక్షల రూపాయాలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కేవలం రూ. 10 కే బంగారం కొనుగోలు చేయొచ్చు.


ఇలా బంగారం కొనుగోలు చేయండి..

జియో ఫైనాన్స్ యాప్ ద్వారా స్మార్ట్ గోల్డ్ స్కీమ్‌లో రెండు విధాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు. కస్టమర్లు తమ వద్దనున్న డబ్బు ఆధారంగా గోల్డ్ కొనుగోలు చేయొచ్చు. లేదంటే బంగారం బరువును బట్టి కూడా కొనుగోలు చేయొచ్చు. బరువు ఆధారంగా 0.5 గ్రాములు, 1 గ్రాము, 2 గ్రాములు, 5 గ్రాములు, 10 గ్రాములు చొప్పున డిజిటల్ గోల్డ్ ఉంటుంది. అంతేకాదు.. నేరుగా బంగారు నాణేలను కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. హోమ్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది.


Also Read:

క్షమాపణలు చెప్పిన ప్రధాని మోదీ.. అసలేమైందంటే..

బ్లూ ఫిల్మ్‌లో ఆఫర్ వచ్చింది.. యువకుడి తల్లి రియాక్షన్ ఇదే..

కోహ్లీతో కోల్డ్‌వార్.. ఇన్నేళ్లకు రివీల్

For More Business News and Telugu News..

Updated Date - Oct 29 , 2024 | 05:37 PM