Share News

Travel Insurance: ట్రావెల్ బీమా చేయించుకున్నారా.. దీని ప్రయోజనాలు ఏంటంటే..

ABN , Publish Date - Dec 11 , 2024 | 04:50 PM

మీకు ప్రయాణ బీమా గురించి తెలుసా. దీని ద్వారా మీరు అనేక ప్రయోజనాలను పొందుతారు. ఇందులో మీరు సామాను కోల్పోవడం, షెడ్యూల్‌ మార్పు సహా అనేక విషయాల నుంచి రక్షణ పొందుతారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

 Travel Insurance: ట్రావెల్ బీమా చేయించుకున్నారా.. దీని ప్రయోజనాలు ఏంటంటే..
Travel Insurance

సమయం పెరుగుతున్న కొద్దీ మన అవసరాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో జీవిత బీమా, ఆరోగ్య బీమా, టర్మ్ ఇన్సూరెన్స్ వంటి చాలా ముఖ్యమైన బీమాల తర్వాత ఇప్పుడు ప్రయాణ బీమా (Travel Insurance) కూడా అందులో చేరింది. అయితే దీని ప్రాముఖ్యత ఏంటి, ఎవరు తీసుకోవాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

మీరు ఏదైనా ట్రిప్‌ని ప్లాన్ చేయాలనుకుంటే ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. దీని ద్వారా మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేక రకాల రిస్క్‌ల నుంచి మీకు రక్షణ కల్పిస్తుంది. ప్రస్తుత కాలాన్ని పరిశీలిస్తే ప్రయాణ బీమా అనేది ఎంపిక చేసిన కొందరికే కాకుండా అనేక మందికి చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.


సామాను కోల్పోవడం

మీరు ప్రయాణ బీమాతో అనేక ప్రయోజనాలను పొందుతారు. ఇందులో మీరు సామాను కోల్పోవడం, వైద్య ఖర్చులు, షెడ్యూల్‌లో మార్పు, వ్యక్తిగత బాధ్యత మొదలైన అనేక విషయాల నుంచి రక్షణ పొందవచ్చు. చెక్ ఇన్ లగేజీ ప్రయాణ బీమా పరిధిలోకి వస్తుంది. ప్రయాణ సమయంలో మీ లగేజీ ఏదైనా పోతే మీరు ఈ సందర్భంలో దావా వేయవచ్చు.


వైద్య ఖర్చులు

మీ ప్రయాణంలో ఏదైనా ప్రమాదానికి గురైనట్లయితే, ప్రయాణ బీమా మీకు చాలా సహాయపడుతుంది. ఇందులో మీరు ప్రమాదం, తరలింపు, వైద్య ఖర్చులు మొదలైన వాటికి కవరేజ్ పొందుతారు. వివిధ పరిస్థితుల కారణంగా ప్రయాణంలో ఒకరికి ఇష్టం లేకపోయినా చాలాసార్లు ప్రోగ్రామ్ మార్చవలసి ఉంటుంది. అనారోగ్యం, ఫ్లైట్ క్యాన్సిలేషన్ లేదా హోటల్ బుకింగ్ క్యాన్సిలేషన్ కారణంగా మీ ప్లాన్‌లో ఏదైనా మార్పు ఉంటే, బీమా కంపెనీ దానిని భర్తీ చేస్తుంది.


వ్యక్తిగత బాధ్యత

ప్రయాణ సమయంలో బీమా చేయబడిన వ్యక్తి మూడో పక్షానికి ఏదైనా ఆర్థిక నష్టం సంభవిస్తే వారికి కూడా ప్రయాణ బీమా సహాయపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బీమా కంపెనీ మీకు జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తుంది. ప్రయాణ బీమాకు సంబంధించి వేర్వేరు కంపెనీలు, వేర్వేరు నిబంధనలు, షరతులను కలిగి ఉన్నాయి. ఈ క్రమంలో మీరు ఏ కంపెనీ నుంచి ప్రయాణ బీమా తీసుకున్నా కూడా పథకం గురించి మాత్రం ముందుగా పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి. ఇటివల కాలంలో అనేక సమయాలలో ఫ్లైట్స్ క్యాన్సిల్ కావడం, హోటల్స్ బుకింగ్స్ వంటి విషయాలలో ప్రయాణ బీమా ఎక్కువగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి:

Free Government Schemes: ఉచిత పథకాలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆర్థిక శాఖ.. కారణమిదే..

Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..

Bitcoin Investment: ఇది కదా లక్కంటే.. అప్పటి 100 రూపాయల పెట్టుబడి, ఇప్పుడు 1.7 కోట్లు

Bima Sakhi Yojana 2024: మహిళలకు మంచి ఛాన్స్.. బీమా సఖీ యోజనతో రూ. 48 వేలు సంపాదించే అవకాశం..


Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Dec 11 , 2024 | 04:51 PM