Share News

Layoffs: ఎలాన్ మస్క్‌ కంపెనీలో ఉద్యోగాల కోత.. ఎంతంటే..?

ABN , Publish Date - Apr 15 , 2024 | 06:02 PM

ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ ఉద్యోగాల కోత విధించనుంది. ప్రపంచవ్యాప్తంగా 10 శాతం ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటన చేసింది. టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తోంది. గత కొద్దిరోజుల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ లేదు. దాంతో ఉద్యోగాల కోత తప్పడం లేదని టెస్లా కంపెనీ ఉద్యోగులకు తెలిపింది.

Layoffs: ఎలాన్ మస్క్‌ కంపెనీలో ఉద్యోగాల కోత.. ఎంతంటే..?
Elon Musk Company To Cut More Than 10% Of Its Global Workforce

ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా (Tesla) కంపెనీ ఉద్యోగాల కోత విధించనుంది. ప్రపంచవ్యాప్తంగా 10 శాతం ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటన చేసింది. టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తోంది. గత కొద్దిరోజుల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ లేదు. దాంతో ఉద్యోగాల కోత తప్పడం లేదని టెస్లా కంపెనీ ఉద్యోగులకు తెలిపింది. ఇప్పటికే ఉద్యోగులకు మెయిల్ చేసింది.

Stock Market: ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్.. భారీగా నష్టపోయిన దేశీయ సూచీలు!


తగ్గిన డిమాండ్

‘ఎలక్ట్రిక్ వాహనాలను డిమాండ్ తగ్గింది. కంపెనీలో కొన్ని చోట్ల అవసరానికి మించి ఉద్యోగులు ఉన్నారు. 10 శాతం ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నాం. వచ్చే త్రైమాసికంలో కంపెనీ అభివృద్ధిపై దృష్టి సారించాం. అదే సమయంలో వస్తు ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉంది. కంపెనీ ఖర్చులను తగ్గించుకోవాల్సి ఉంది. ఇదే అంశంపై సమీక్ష చేశాం. 10 శాతం ఉద్యోగులను తొలగించాలనే కఠిన నిర్ణయం తీసుకున్నాం. కంపెనీ మంచి కోసం డెసిషన్ తీసుకున్నాం. ఇది తప్పకుండా అమలు చేయాల్సిందే అని’ ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు.

Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్ చూసి భయపడుతున్నారా.. ఈ 5 మార్గాల ద్వారా ఈజీగా చెల్లించండి


14 వేల మంది తొలగింపు

ప్రస్తుతం టెస్లా కంపెనీలో లక్ష 40 వేల 473 మంది ఉద్యోగులు ఉన్నారు. ఆస్టిన్, బెర్లిన్ సరిహద్దులో టెస్లా ఎలక్ట్రిక్ కార్ల ప్లాంట్లు ఉన్నాయి. మస్క్ ప్రకటించినట్టు కంపెనీ మొత్తం సిబ్బందిలో 10 శాతం తీసివేస్తే 14 వేల మంది ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది. మూడేళ్ల క్రితం టెస్లా కంపెనీలో 2 లక్షల 80 వేల మంది ఉద్యోగుల వరకు ఉండేవారు. వివిధ కారణాలు చెప్పి విడతల వారీగా ఉద్యోగులను మస్క్ తొలగిస్తూ వస్తున్నారు. తాజాగా మరో 14 వేల మందిని ఇంటికి పంపిస్తామని ప్రకటన చేశారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం

Updated Date - Apr 15 , 2024 | 06:02 PM