Share News

EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది వడ్డీరేట్లపై కీలక నిర్ణయం..

ABN , Publish Date - Feb 10 , 2024 | 11:38 AM

ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ పై ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 2023-24 సంవత్సరానికి గానూ 8.25 శాతం వడ్డీ రేటు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది వడ్డీరేట్లపై కీలక నిర్ణయం..

ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ పై ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 2023-24 సంవత్సరానికి గానూ 8.25 శాతం వడ్డీ రేటు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. గత మూడేళ్లలో ఇదే ఎక్కువ శాతం వడ్డీరేటు కావడం విశేషం. 2021-22లో 8.10 శాతం ఉండగా 2022-23కు 8.15 శాతానికి పెంచింది. తాజాగా 2023-24 సంవత్సరానికి 8.25శాతం విధించింది. అపెక్స్ డెసిషన్ మేకింగ్ బాడీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

సీబీటీ నిర్ణయం తర్వాత 2023-24 ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంపునకు అనుమతి కోరుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపిస్తారు. ప్రభుత్వ ధృవీకరణ తర్వాత 2023-24 సంవత్సరానికి దాదాపు ఆరు కోట్ల మంది ఖాతాదారుల అకౌంట్లలో ఈపీఎఫ్ వడ్డీ రేటు జమ అవుతుంది. 2020 మార్చిలో ఈపీఎఫ్ఓ​ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 2018-19 కు అందించిన 8.65 శాతం నుంచి 2019-20 కు ఏడేళ్ల కనిష్ఠ స్థాయి 8.5 శాతానికి తగ్గించడం గమనార్హం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 10 , 2024 | 11:38 AM