Share News

Union Budget 2024: బడ్జెట్‌కు ముందు సాంప్రదాయ హల్వా వేడుక.. నోళ్లను తీపి చేసిన ఆర్థిక మంత్రి

ABN , Publish Date - Jul 17 , 2024 | 07:17 AM

ప్రతి ఏటా బడ్జెట్‌ సమర్పించేందుకు ముందు సాంప్రదాయ హల్వా వేడుకను(Halwa ceremony) నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్(Union Budget 2024) సమర్పణకు ముందుగా హల్వా వేడుకను నిర్వహించారు.

Union Budget 2024: బడ్జెట్‌కు ముందు సాంప్రదాయ హల్వా వేడుక.. నోళ్లను తీపి చేసిన ఆర్థిక మంత్రి
Finance Minister Nirmala Sitharaman

ప్రతి ఏటా బడ్జెట్‌ సమర్పించేందుకు ముందు సాంప్రదాయ హల్వా వేడుకను(Halwa ceremony) నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్(Union Budget 2024) సమర్పణకు ముందుగా హల్వా వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) పాల్గొని బడ్జెట్ తయారీలో పాల్గొన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు, ఉద్యోగులకు తయారు చేసిన హల్వాను వడ్డించి నోరు తీపి చేశారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రెస్‌ని సందర్శించి సంబంధిత అధికారులను అభినందించి, బడ్జెట్ సన్నాహాలను సమీక్షించారు.


గత మూడు పూర్తి కేంద్ర బడ్జెట్‌లు, మధ్యంతర బడ్జెట్‌ల మాదిరిగానే, 2024-25 బడ్జెట్ కూడా పేపర్‌లెస్‌గా డిజిటల్ రూపంలో ఉంటుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. జులై 23న ఆర్థిక మంత్రి లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర బడ్జెట్ 2024-25 కోసం బడ్జెట్ తయారీ ప్రక్రియ చివరి దశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో సాంప్రదాయ హల్వా వేడుకతో ప్రారంభమైందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా ఈ మేరకు వెల్లడించింది.


ఈ వేడుకలో

వార్షిక ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్‌ను బడ్జెట్ అని పిలుస్తారు. గ్రాంట్ల డిమాండ్‌లు, ఫైనాన్స్ బిల్లులు మొదలైన వాటితో సహా అన్ని యూనియన్ బడ్జెట్ పత్రాలు ‘యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్’లో అందుబాటులో ఉంటాయి. సీతారామన్‌తో పాటు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్, ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి, ఇతర సీనియర్ అధికారులు ఈ వేడుకలో పాల్గొన్నారు.


హల్వా వేడుక అంటే ఏంటి?

హల్వా వేడుక(Halwa ceremony) అనేది ప్రతి సంవత్సరం బడ్జెట్ సమర్పణకు ముందు నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లోని 'బేస్‌మెంట్'లో నిర్వహించబడింది. ఇక్కడ ప్రింటింగ్ ప్రెస్ ఉంది. ఆర్థిక మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులు ఇందులో పాల్గొంటారు. వాస్తవానికి, 'హల్వా' వేడుక అనేది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ తయారీలో పాల్గొన్న ఆర్థిక మంత్రిత్వ శాఖలోని అధికారులు, ఉద్యోగులను 'విభజించే' ప్రక్రియ. అంటే వారు బయటి ప్రపంచం నుంచి పూర్తిగా ఒంటరిగా ఉంటారు. ఈ అధికారులు, ఉద్యోగులు పార్లమెంటులో బడ్జెట్‌ను సమర్పించే వరకు నార్త్ బ్లాక్‌లోని 'బేస్‌మెంట్'లోనే ఉంటారు. అక్కడ వారికి బయటి వ్యక్తులతో ఎలాంటి సంబంధం ఉండదు. లోక్‌సభలో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం పూర్తి చేసిన తర్వాత మాత్రమే వారు బయటకు వస్తారు.


ఇవి కూడా చదవండి:

Gold and Silver Rates Today: మరింత ఖరీదైన బంగారం, పడిపోయిన వెండి.. ఎంతకు చేరాయంటే..

హై రిస్క్‌ పెట్టుబడుల కోసం కొత్త అసెట్‌ క్లాస్‌

సీఏల కోసం ఏఐ సర్టిఫికెట్‌ కోర్సు

For Latest News and Business News click here

Updated Date - Jul 17 , 2024 | 07:20 AM