Gold Price: ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?
ABN , Publish Date - Mar 06 , 2024 | 08:05 AM
బంగారం ధర మళ్లీ కాస్త పెరిగింది. అంతర్జాతీయ స్థాయిలో ధరలు, కేంద్ర బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులలతో బంగారం ధరలో మార్పు చేర్పులు ఉంటాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లనే తగ్గించే సూచనలు ఉన్నాయి. దీంతో బంగారంపై పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ రోజు హైదరాబాద్‌లో బంగారం ధర ఇలా ఉన్నాయి.
హైదరాబాద్: బంగారం (Gold) ధర మళ్లీ కాస్త పెరిగింది. అంతర్జాతీయ స్థాయిలో ధరలు, కేంద్ర బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులతో బంగారం(Gold) ధరలో మార్పు చేర్పులు ఉంటాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లనే తగ్గించే సూచనలు ఉన్నాయి. దీంతో బంగారంపై పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ రోజు హైదరాబాద్‌లో బంగారం (Gold) ధర ఎలా ఉందో తెలుసుకుందాం. పదండి.
హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర కాస్త పెరిగింది. 10 గ్రాముల బంగారం రూ.59,460కి చేరింది. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.64,860కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.59,600గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.760 పెరిగి రూ.65 వేలకు చేరింది.
వెండి ధర కూడా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.1200 పెరిగింది. దాంతో కిలో వెండి ధర రూ.78,200గా ఉంది. ఢిల్లీ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1100 పెరిగింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.74,700గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.