GST Council: జీవిత, ఆరోగ్య బీమాపై పన్ను తగ్గింపు నిర్ణయంలో ట్విస్ట్.. ఈసారి కూడా..
ABN , Publish Date - Dec 21 , 2024 | 03:26 PM
జీవిత, ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియంలపై పన్ను రేటు తగ్గింపు అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈసారి కూడా నిర్ణయం తీసుకోలేదు. ఇందుకు సంబంధించి మరికొన్ని సాంకేతిక అంశాలను ప్రస్తావించాల్సి ఉందని జీఎస్టీ కౌన్సిల్ 55వ సమావేశంలో పేర్కొన్నారు.
జీఎస్టీ 55వ కౌన్సిల్ సమావేశం (GST Council 55th Meeting ) జైసల్మేర్‌లో జరుగుతోంది. దీనిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు ఈ భేటీకి హాజరయ్యారు. GST కౌన్సిల్ ఈ సమావేశం ప్రత్యేకంగా పరిగణించబడింది. ఎందుకంటే ఇందులో ప్రభుత్వం టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా, సీనియర్ సిటిజన్ల ఆరోగ్య బీమా ప్రీమియంపై GST రేట్లలో సడలింపు ఇస్తారని ఆశించారు. కానీ ప్రస్తుతం ఈ అంశంపై ఈ సమావేశంలో ఎలాంటివి చర్చించలేదు. తర్వాత GST కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది.
తదుపరి చర్చ
అయితే జీవిత, ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియంలపై పన్ను రేటు తగ్గింపు నిర్ణయాన్ని జీఎస్టీ కౌన్సిల్ శనివారం వాయిదా వేసింది. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. ఇందుకు సంబంధించి మరికొన్ని సాంకేతిక అంశాలను ప్రస్తావించాల్సి ఉందని జీఎస్టీ కౌన్సిల్ 55వ సమావేశంలో నిర్ణయించారు. దీనికి సంబంధించి తదుపరి చర్చ కోసం జీఓఎంకు బాధ్యతలు అప్పగించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్, రాష్ట్రాలకు చెందిన ఆమె సహచరుల సమక్షంలో ఈ నిర్ణయం తీసుకుంది. గ్రూప్, ఇండివిడ్యువల్, సీనియర్ సిటిజన్ పాలసీలపై పన్ను విధింపుపై నిర్ణయం తీసుకునేందుకు బీమాపై జీఓఎం మరోసారి సమావేశం కానుందని బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తెలిపారు.
జనవరిలో మరోసారి చర్చ
కొంతమంది సభ్యులు దీనిపై మరింత చర్చ అవసరమని చెప్పారని సామ్రాట్ చౌదరి అన్నారు. ఈ క్రమంలో దీనిపై తాము (GoM) జనవరిలో మళ్లీ చర్చిస్తామని వెల్లడించారు. కౌన్సిల్ చౌదరి అధ్యక్షతన బీమాపై మంత్రుల బృందాన్ని (GoM) ఏర్పాటు చేసింది. నవంబర్‌లో జరిగిన సమావేశంలో టర్మ్ జీవిత బీమా పాలసీల బీమా ప్రీమియంను GST నుంచి మినహాయించాలని అంగీకరించింది. దీంతోపాటు ఆరోగ్య బీమా రక్షణ కోసం సీనియర్ సిటిజన్లు చెల్లించే ప్రీమియంను పన్ను నుంచి మినహాయించాలని కూడా ప్రతిపాదించబడింది.
ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీ
సీనియర్ సిటిజన్లు కాకుండా ఇతర వ్యక్తులకు రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కోసం చెల్లించే ప్రీమియాన్ని జీఎస్టీ నుంచి మినహాయించే ప్రతిపాదన ఉంది. అయితే రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఆరోగ్య బీమా కవరేజీ ఉన్న పాలసీలకు చెల్లించే ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీ కొనసాగుతుంది. ఈ క్రమంలో వచ్చే నెలలో జరిగే భేటీలోనైనా ఈ బీమాలను జీఎస్టీ నుంచి మినహాయిస్తారా లేదా అనేది చూడాలి మరి. ఇప్పటికే అనేక రోజులుగా పలు రకాల బీమాల నుంచి జీఎస్టీ తొలగించాలని డిమాండ్లు వచ్చాయి.
ఇవి కూడా చదవండి:
Top Mutual Funds: గత ఐదేళ్లలో టాప్ 7 మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ ఇచ్చాయంటే..
Spherical Egg: ఒక కోడి గుడ్డు ధర రూ. 21 వేలు.. స్పెషల్ ఏంటో తెలుసా..
Choti Choti Savings: ఈ చిన్నారి పొదుపును చూస్తే షాక్ అవుతారు.. వైరల్ వీడియో
Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Read More Business News and Latest Telugu News