Home Loans: ఈ హోమ్ లోన్స్ తీసుకునే వారికి షాకింగ్... ఆర్బీఐ కీలక నిర్ణయం
ABN , Publish Date - Aug 08 , 2024 | 05:20 PM
మీరు హోమ్ లోన్(home loan) తీసుకున్నారా. ఈ క్రమంలో మీ EMI చౌకగా మారడానికి RBI రెపో రేటును తగ్గిస్తుందని ఆశించారా. అయితే మీకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం (ఆగస్టు 8న) వరుసగా 9వ సారి రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. దీంతో గృహ రుణ ఈఎంఐ తగ్గుతుందని ఆశించిన వారికి షాక్ తగిలిందని చెప్పవచ్చు.
మీరు హోమ్ లోన్(home loan) తీసుకున్నారా. ఈ క్రమంలో మీ EMI చౌకగా మారడానికి RBI రెపో రేటును తగ్గిస్తుందని ఆశించారా. అయితే మీకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం (ఆగస్టు 8న) వరుసగా 9వ సారి రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. దీంతో గృహ రుణ ఈఎంఐ తగ్గుతుందని ఆశించిన వారికి షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్(shaktikanta das) హోమ్ లోన్ టాప్ అప్(home loan top up) చేసే వ్యక్తుల తీరుపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు.
బ్యాంకులు
ఈ క్రమంలో గృహ రుణాలను టాప్‌అప్(home loan top up) చేసుకోవాలనే దృక్పథం ప్రజల్లో(people) పెరిగిపోయిందని ఆర్‌బీఐ తెలిపింది. అలా తీసుకున్న వాటిని ప్రజలు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు చేస్తున్నట్లు చెప్పింది. ఇది క్రమంగా పెరుగుతున్న తరుణంలో ఇది ఆందోళన కలిగించే విషయమని ఆర్బీఐ హెచ్చరించింది. కాబట్టి బ్యాంకులు రుణాలు అందించే సంస్థలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ క్రమంలో హోమ్ లోన్ టాప్ అప్ వినియోగంపై కూడా దర్యాప్తు చేయాలని బ్యాంకులను గవర్నర్ శక్తికాంత దాస్ కోరారు.
నియమాలు పాటించడం లేదు
ఈ క్రమంలో గోల్డ్ లోన్ మాదిరిగానే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు కూడా వీటిని ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాయని గుర్తు చేశారు. ఆ క్రమంలో నిధుల వినియోగానికి సంబంధించిన నియంత్రణ నియమాలు పాటించడం లేదన్నారు. కొందరు వ్యక్తులు గృహ రుణం టాప్ అప్ సదుపాయాన్ని పదే పదే ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఇది డబ్బును ఉత్పాదకత లేకుండా ఉపయోగించుకునే అవకాశాన్ని పెంచుతుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు అలాంటి కేసులను సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
హోమ్ లోన్ టాప్ అప్ అంటే ఏంటి?
సాధారణంగా ఒక వ్యక్తి గృహ రుణం తీసుకున్నప్పుడు అతని ఆస్తి విలువకు సంబంధించి గరిష్ట రుణాన్ని తీసుకుంటాడు. దీని తరువాత కొన్నెళ్ల తర్వాత అతని ఆస్తి విలువ పెరిగి వ్యక్తి గృహ రుణంలో కొంత భాగాన్ని చెల్లించినప్పుడు అతను బ్యాంకుకు వెళ్లి మళ్లీ టాప్ అప్ రుణాన్ని తీసుకుంటాడు. హోమ్ లోన్ టాప్ అప్ చేసిన తర్వాత వారి EMIలో పెద్దగా తేడా ఉండదు. కానీ చౌక వడ్డీకే ఈ డబ్బు వారి లిక్విడిటీని పెంచుతుంది. నిబంధనల ప్రకారం హోమ్ లోన్ టాప్ అప్ మొత్తాన్ని ఆస్తి నిర్వహణకు లేదా దానిలో ఏవైనా మార్పులకు మాత్రమే ఉపయోగించాలి. కానీ నేటి కాలంలో దాని ఇతర ఉపయోగాలకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
ఆ మొత్తాన్ని స్టాక్ మార్కెట్‌లో
ఇటీవలి కాలంలో దేశంలో స్టాక్ మార్కెట్‌లో ప్రజల పెట్టుబడులు పెరిగాయి. ఈ క్రమంలో గృహ రుణం టాప్ అప్ మొత్తాన్ని వీటిలో పెడుతున్నారని RBI ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులను కట్టడిచేసేందుకు బడ్జెట్‌లో స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నుకు సంబంధించి మార్పులు చేశారు. స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్ వంటి ఈక్విటీ సంబంధిత సాధనాల్లో ప్రజలు పెట్టుబడులను పెంచడం వల్ల బ్యాంకుల డిపాజిట్లు తగ్గుతున్నాయని గవర్నర్ చెప్పారు. జూన్ నెల నాటికి దేశంలోని వాణిజ్య బ్యాంకుల డిపాజిట్ల వృద్ధి 10.64 శాతానికి తగ్గింది. అదే సమయంలో వాటికి వచ్చిన రుణాల డిమాండ్ 13.88 శాతం ఎక్కువగా ఉంది.
ఇవి కూడా చదవండి:
Business Idea: పెట్టుబడి లేకుండా వ్యాపారం.. ఏటా 50 లక్షలకుపైగా సంపాదించే ఛాన్స్!
Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్
Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..
Read More Business News and Latest Telugu News