Home Loan: హోమ్ లోన్ క్లోజ్ చేస్తున్నారా? ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి!
ABN , Publish Date - Aug 08 , 2024 | 10:18 PM
Home Loan: ప్రస్తుత కాలంలో చాలా మంది తమ సొంతింటి కలను, సొంత వాహనం కలను నెరవేర్చుకోవడానికి బ్యాంక్ లోన్స్‌పై ఆధారపడుతున్నారు. మరికొందరు పర్సనల్ లోన్స్ కూడా తీసుకుంటారు. చాలా మంది తమ సొంత గ్రామాలు వదిలి..
Home Loan: ప్రస్తుత కాలంలో చాలా మంది తమ సొంతింటి కలను, సొంత వాహనం కలను నెరవేర్చుకోవడానికి బ్యాంక్ లోన్స్‌పై ఆధారపడుతున్నారు. మరికొందరు పర్సనల్ లోన్స్ కూడా తీసుకుంటారు. చాలా మంది తమ సొంత గ్రామాలు వదిలి.. హైదరాబాద్ వచ్చి ఉద్యోగాలు చేసే వారు దాదాపుగా హోమ్ లోన్స్ తీసుకుని ఇంటిని కొనుగోలు చేస్తుంటారు. అర్హులైన వ్యక్తులకు బ్యాంకులు సైతం హోమ్ లోన్స్ ఇస్తుంటాయి. లోన్స్‌పై భారీగానే వడ్డీ కూడా వసూలు చేస్తుంటాయి. ఈ విషయం ఇలా ఉంచితే.. హోమ్ లోన్స్ తీసుకున్నవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. దానిపై అవగాహన లేకపోతే హోమ్ లోన్ తీసుకున్న వారు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. మరి ఇంపార్టెంట్ అంశం ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటే ముందుగా బ్యాంకులను సంప్రదించాలి. వారు అడిగిన వివరాలు, డాక్యూమెంట్స్ అన్నీ అందిస్తేనే హోమ్ లోన్ ఇస్తారు. ఇక లోన్ క్లోజ్ చేసే సమయంలో కూడా కొన్ని డాక్యూమెంట్స్ బ్యాంక్ వాళ్లు ఇస్తారు. అయితే, లోన్ కోసం డాక్యూమెంట్స్ ఇవ్వడమే తప్ప.. దానిని క్లోజ్ చేసేటప్పుడు ఏం డాక్యూమెంట్స్ తీసుకోవాలనేది చాలా మందికి తెలియదు. వాస్తవానికి లోన్ క్లోజ్ చేసేటప్పుడు రెండు డాక్యూమెంట్స్ బ్యాంక్ వాళ్లు ఇస్తారు. అవి తీసుకోకపోతే మీరే ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. మరి ఆ డాక్యూమెంట్స్ ఏంటో ఓసారి తెలుసుకుందాం.
ఫస్ట్ డాక్యూమెంట్..
మీరు హోమ్ లోన్ తీసుకుని.. అది ముగిసినట్లయితే.. లేదా పూర్తి మొత్తాన్ని చెల్లించి కోజ్ చేసినట్లయితే.. బ్యాంకు నుంచి NOC అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలి. ఇది మీరు రుణాన్ని పూర్తిగా తిరిగి చెల్లించారని, ఇప్పుడు మీరు బ్యాంకుకు ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదని ధృవీకరిస్తుంది. అందుకే హోమ్ లోన్ క్లోజ్ చేసిన తరువాత NOC తప్పకుండా తీసుకోవాలి.
అయితే, NOC తీసుకోగానే సరిపోదు.. అందులోని సమాచారాన్ని పక్కాగా చెక్ చేయాలి. లోన్ మూసివేసిన తేదీ, మీ పూర్తి పేరు, బ్యాంక్ అకౌంట్ నెంబర్. లోన్ వివరాలు, పూర్తి ఆస్తి వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఏమైనా తప్పులు ఉన్నట్లయితే వెంటనే బ్యాంకును సంప్రదించి సరైన NOC తీసుకోవాలి.
సెకండ్ డాక్యూమెంట్..
హోమ్ లోన్ క్లోజ్ చేసిన తరువాత రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ పొందాలి. వాస్తవానికి ఇది మీ ఆస్తిపై బ్యాంక్‌కు ఎటువంటి హక్కులు లేవని, ఆ ప్రాపర్టీ ఇక మీదేనని తెలిపే డాక్యూమెంట్. ఆస్తిని విక్రయించేటప్పుడు మీకు ఈ డాక్యూమెంట్ అవసరం. అందుకే.. తప్పనిసరిగా ఈ డాక్యూమెంట్ తీసుకోవాలి.