Free Apply for PAN Card 2.O: పాన్ కార్డ్ 2.O ని ఉచితంగా ఇలా అప్లై చేసుకోండి..
ABN , Publish Date - Dec 02 , 2024 | 06:00 PM
Free Apply for PAN Card 2.O: భారత ప్రభుత్వం పాన్ 2.O ప్రాజెక్టు ద్వారా కీలక అడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టు.. పన్ను చెల్లింపుదారుల గుర్తింపును సురక్షితమైన పద్ధతిలో నిర్వహించేందుకు ఆధునిక, సాంకేతిక విధానాన్ని కల్పిస్తుంది.
Free Apply for PAN Card 2.O: భారత ప్రభుత్వం పాన్ 2.O ప్రాజెక్టు ద్వారా కీలక అడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టు.. పన్ను చెల్లింపుదారుల గుర్తింపును సురక్షితమైన పద్ధతిలో నిర్వహించేందుకు ఆధునిక, సాంకేతిక విధానాన్ని కల్పిస్తుంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించిన ఈ అధునాతన పాన్ కార్డులు చాలా విశిష్టమైనవి, విభిన్నమైనవి. అవును, పాన్ 2.O కార్డులపై క్యూఆర్ కోడ్‌లు కూడా ఉంటాయి. ఈ క్యూఆర్ కోడ్‌ల ద్వారా ఆర్థికపరమైన కార్యకలాపాలు సునాయాసం అవుతాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రూ. 1,435 కోట్లతో ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ కార్యక్రమం ఆదాయపు పన్ను శాఖ కార్యకలాపాలను మరింత క్రమబద్ధీకరిస్తుంది.
అసలేంటీ పాన్ 2.O ప్రాజెక్టు..
PAN 2.O.. పన్ను చెల్లింపుదారుల రిజిస్ట్రేషన్ సేవలను మార్చే లక్ష్యంతో రీ-ఇంజనీరింగ్ చేసిన ఇ-గవర్నెన్స్ ప్రాజెక్టు. PAN(పర్మనెంట్ అకౌంట్ నెంబర్), TAN (పన్ను మినహాయింపు, కలెక్షన్ అకౌంట్ నెంబర్) వ్యవస్థలను ఏకీకృత ప్లాట్‌ఫామ్‌లోకి చేర్చడం ద్వారా.. డేటా భద్రతకు భరోసానివ్వడంతో పాటు సంబంధిత పనులను సులభతరం చేస్తుంది.
ఈ ప్రాజెక్టులోని కీలక అంశాలు..
QR కోడ్ ఇంటిగ్రేషన్ : త్వరిత యాక్సెస్, డేటా ప్రమాణీకరణ.
కేంద్రీకృత PAN డేటా వాల్ట్ : మొత్తం PAN డేటా సురక్షితంగా నిల్వ చేయబడుతుంది, నిర్వహించబడుతుంది.
పర్యావరణ అనుకూల విధానం : మాన్యువల్ లోపాలను తగ్గించడానికి, స్థిరమైన అభ్యాసాలకు సపోర్ట్ ఇవ్వడానికి పేపర్‌లెస్ ప్రాసెస్.
PAN 2.0 అప్‌గ్రేడ్ ప్రయోజనాలు:
వేగవంతమైన సేవలు : పాన్ కార్డు సేవలను మరింత సరళీకృత చేస్తుంంది.
భద్రత : పాన్ డేటా వాల్ట్ వినియోగదారు సమాచారాన్ని రక్షిస్తుంది.
కాస్ట్ ఆప్టిమైజేషన్ : కార్యకలాపాలను డిజిటలైజ్ చేయడం ద్వారా అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు తగ్గుతాయి.
వేగవంతంగా ఫిర్యాదుల పరిష్కారం : కేంద్రీకృత వ్యవస్థ సకాలంలో సమస్యలను పరిష్కరిస్తుంది.
PAN 2.O కి ఎవరు అర్హులు..
ఇప్పటికే ఉన్న పాన్ కార్డ్ హోల్డర్లందరూ పాన్ 2.0 అప్‌గ్రేడ్ కోసం ఆటోమేటిక్‌గా అర్హులు అవుతారు. మీకు ఇప్పటికే PAN ఉంటే.. మళ్లీ దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు. కొత్త పాన్ కోసం రిక్వెస్ట్ చేసుకోవచ్చు. కొత్త దరఖాస్తుదారులు చెల్లుబాటు అయ్యే గుర్తింపు, చిరునామా రుజువులను సమర్పించాలి. పన్ను చెల్లింపుదారులందరికీ PAN 2.0 ఉచితంగా అందించబడుతుంది.
ఆన్‌లైన్‌లో పాన్ 2.0 కోసం ఎలా దరఖాస్తు చేయాలి ?
PAN 2.0 కోసం దరఖాస్తు ప్రక్రియ వినియోగదారు స్నేహపూర్వకంగా, పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉండేలా రూపొందించబడింది.
ఇక్కడ దశల వారీగా అప్లికేషన్ ప్రాసెస్ ఇవ్వడం జరిగింది.
యూనిఫైడ్ పోర్టల్‌ని సందర్శించండి: ముందుగా ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ను ప్రారంభించాలి.
వ్యక్తిగత వివరాలను నమోదు చేయండి: మీ వ్యక్తిగత సమాచారంతో అవసరమైన సమాచారాన్ని ఫిల్ చేయాలి.
అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి: గుర్తింపు, చిరునామా, పుట్టిన తేదీలకు సంబంధించి ధృవీకరణ పత్రాలను స్కాన్ చేసి, ఆ కాపీలను అప్‌లోడ్ చేయాలి.
దరఖాస్తును సమర్పించండి: వివరాలను సమీక్షించి, అప్లికేషన్ ఫారమ్‌ను సబ్‌మిట్ చేయాలి.
PAN 2.0 కోసం ఏ డాక్యూమెంట్స్ కావాలి..
పాన్ 2.O కోసం దరఖాస్తుదారులు తప్పనిసరిగా నిర్దిష్ట పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
గుర్తింపు రుజువు: ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ అవసరం.
చిరునామా రుజువు: యుటిలిటీ బిల్లులు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు లేదా అద్దె ఒప్పందాలు.
పుట్టిన తేదీ రుజువు: జనన ధృవీకరణ పత్రం, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ లేదా పాస్‌పోర్ట్.
Also Read:
500 కోట్లు మిస్ చేసుకున్న బుమ్రా
వరద నీటిలో కొట్టుకు పోయిన బస్సులు, కార్లు..
For More Utility News and Telugu News..