UPI Lite: బ్యాలెన్స్ లేకున్నా ఇలా ఫాస్ట్‌ట్యాగ్ చెల్లింపులు చేసుకోవచ్చు.. ఎలా అంటే..
ABN , Publish Date - Oct 05 , 2024 | 05:59 PM
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇటీవల NETC ఫాస్ట్‌ట్యాగ్, రూపే నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (NCMC) వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా వినియోగదారులు కార్డులో బ్యాలెన్స్ లేకున్నా ఆటోమేటిక్ టాప్ అప్‌ను అనుమతిస్తుంది.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) UPI లైట్ ఆటో టాప్ అప్ అనే కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ ద్వారా మీరు UPI లైట్ బ్యాలెన్స్ పరిమితి కంటే తక్కువగా ఉన్నప్పటికీ పేమెంట్స్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా మీ UPI చెల్లింపులను మరింత సౌకర్యవంతంగా, అవాంతరాలు లేకుండా చేస్తుంది. UPI లైట్ అనేది డిజిటల్ వాలెట్. దీని సహాయంతో వినియోగదారులు UPI పిన్ లేకుండా చిన్న లావాదేవీలు చేయవచ్చు. UPI లైట్‌ని ఉపయోగించడానికి మీ UPI లైట్ వాలెట్‌కి మీ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బును యాడ్ చేయాలి. చెల్లింపుల కోసం ముందుగా లోడ్ చేసిన మొత్తాన్ని ఉపయోగించుకోవాలి.
ఆటో టాప్ అప్ అంటే ఏంటి
ప్రస్తుతం మీ UPI బ్యాలెన్స్ అయిపోయినప్పుడు చెల్లింపులను కొనసాగించడానికి మీరు దాన్ని మీ బ్యాంక్ ఖాతా నుంచి మాన్యువల్‌గా రీలోడ్ చేయాలి. కానీ కొత్త ఆటో టాప్ అప్ ఫీచర్ ద్వారా బ్యాలెన్స్ నిర్దిష్ట స్థాయి కంటే తక్కువగా ఉన్నప్పుడు మీ UPI లైట్ వాలెట్‌ని ఆటోమేటిక్‌గా రీలోడ్ చేస్తుంది. దీని ద్వారా మీ చెల్లింపులను సులభతరం చేస్తుంది. Google Pay, PhonePe, Paytm, BHIM వంటి అనేక ప్రసిద్ధ UPI అప్లికేషన్‌లు తమ కస్టమర్‌ల కోసం UPI లైట్‌కి సపోర్ట్ చేస్తున్నాయి. దీనిలో ఒక్కో లావాదేవీకి రూ. 500 వరకు పరిమితి ఉంటుంది. మీరు మీ యూపీఐ లైట్ వాలెట్‌కు గరిష్టంగా రూ. 2000 వరకు యాడ్ చేసుకోవచ్చు.
ఎలా పని చేస్తుంది?
UPI లైట్ ఆటో టాప్ అప్ ఫీచర్ ద్వారా వినియోగదారులు కనీస బ్యాలెన్స్ మొత్తాన్ని మెయింటెన్ చేసుకోవచ్చు. ఆ క్రమంలో UPI లైట్ బ్యాలెన్స్ పేర్కొన్న మొత్తం కంటే తక్కువగా ఉన్నప్పుడు వినియోగదారుల లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతా నుంచి వాలెట్‌కి ఆటోమేటిక్‌గా కొంత బదిలీ చేయబడుతుంది. UPI లైట్ ఖాతా రోజుకు గరిష్టంగా 5 టాప్ అప్‌లను అనుమతిస్తుంది. ఈ క్రమంలో UPI లైట్‌లో ఆటో టాప్ అప్ ఫీచర్‌ను ప్రారంభించాలని NPCI ఇప్పటికే బ్యాంకులను ఆదేశించింది. ఈ ఫీచర్ అక్టోబర్ 31, 2024కి ముందే మొదలుకానుంది. నవంబర్ 1, 2024 నాటికి వినియోగదారులకు పూర్తిగదా యాక్సెస్ వస్తుందని చెబుతున్నారు.
లావాదేవీల పరంగా
సెప్టెంబర్ నెలలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) నెట్‌వర్క్ రోజువారీ లావాదేవీల వాల్యూమ్‌లలో గణనీయమైన పెరుగుదలను సాధించింది. రోజుకు 500 మిలియన్ల లావాదేవీలను అధిగమించింది. UPI ద్వారా నిర్వహించబడిన లావాదేవీల మొత్తం విలువ వరుసగా ఐదో నెల రూ.20 లక్షల కోట్లను అధిగమించింది. సెప్టెంబరులో సగటు రోజువారీ లావాదేవీ విలువ రూ. 68,800 కోట్లకు చేరుకుంది. గత నెల రూ. 66,475 కోట్లతో పోలిస్తే ఇది చెప్పుకోదగ్గ పెరుగుదల అని చెప్పవచ్చు. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే UPI లావాదేవీలు 31% గణనీయంగా పెరిగి రూ.20.64 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
ఇవి కూడా చదవండి:
IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి
Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు
IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన
Read More Business News and Latest Telugu News