NPCI: ఫిబ్రవరి 1 నుంచి IMPS కొత్త రూల్.. రూ. 5 లక్షల వరకు
ABN , Publish Date - Jan 29 , 2024 | 06:14 PM
దేశంలో ఫిబ్రవరి 1, 2024 నుంచి తక్షణ చెల్లింపు సేవల (IMPS) కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీంతో వినియోగదారులు కేవలం మొబైల్ నంబర్, వారి బ్యాంక్ పేరును ఉపయోగించి లావాదేవీని పూర్తి చేయవచ్చు.
దేశంలో ఫిబ్రవరి 1, 2024 నుంచి తక్షణ చెల్లింపు సేవల (IMPS) కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీంతో వినియోగదారులు కేవలం మొబైల్ నంబర్, వారి బ్యాంక్ పేరును ఉపయోగించి లావాదేవీని పూర్తి చేయవచ్చు. ఇది పేమెంట్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఖాతా నంబర్లు లేదా IFSC కోడ్ వంటి లబ్ధిదారుల వివరాలు సమర్పించకుండానే రూ.5 లక్షల వరకు బదిలీ చేయడానికి వినియోగదారులను అనుమతించే కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చదువు, జీతం వివరాలు మీకు తెలుసా?
ఇది బ్యాంక్, ఖాతాదారుల మధ్య నగదు బదిలీని మరింత సౌకర్యవంతంగా చేస్తుంది. ఈ కొత్త ఫండ్ ట్రాన్స్‌ఫర్ పద్ధతిని సులభతరం చేయడానికి అవసరమైన UI/UX మెరుగుదలలను చేపట్టాలని భావిస్తున్నారు. అక్టోబర్ 31, 2023 నాటి NPCI సర్క్యులర్, జనవరి 31, 2024లోపు ఈ మార్పులను పాటించాలని ఆదేశించింది. ఈ క్రమంలో కొత్త రూల్స్ ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అప్‌డేట్ చేయబడిన సిస్టమ్ యూజర్ ఫ్రెండ్లీగా ఉండనుంది. ఇది రియల్ టైమ్ పేమెంట్ సర్వీస్. రోజుకు 24 గంటలు, వారంలో ఏడు రోజులు పని చేస్తుంది.
ఈ సేవను నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అందిస్తోంది. దీని ద్వారా మీరు తక్షణమే డబ్బును బదిలీ చేయవచ్చు. IMPS ద్వారా రెండు రకాల చెల్లింపులు జరుగుతాయి. మొదటిది వ్యక్తి నుంచి ఖాతాకు. ఇందులో మీరు రిసీవర్ ఖాతా నంబర్, బ్యాంక్ పేరు మరియు IFSC కోడ్ ఇవ్వాలి. రెండవది వ్యక్తి నుంచి వ్యక్తి. దీనిలో మీరు రిసీవర్ యొక్క మొబైల్ నంబర్, మొబైల్ మనీ ఐడెంటిఫైయర్ (MMID)ని అందించాలి. MMID అనేది బ్యాంక్ జారీ చేసిన 7 అంకెల సంఖ్య, ఇది మొబైల్ బ్యాంకింగ్ యాక్సెస్ కోసం అందించబడుతుంది. కొత్త ఫీచర్‌లో మీరు MMID స్థానంలో ఫోన్ నంబర్, బ్యాంక్ పేరును అందించాలి. IMPS ద్వారా మీరు లబ్ధిదారుని జోడించకుండానే రూ. 5 లక్షల వరకు మొత్తాన్ని పంపవచ్చు.