Share News

Budget 2024: బడ్జెట్ 2024లో వీటిపైనే ప్రధానంగా ఫోకస్.. సూచించిన మోదీ

ABN , Publish Date - Jul 14 , 2024 | 01:26 PM

మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయి కేంద్ర బడ్జెట్ 2024(Budget 2024)ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(nirmala sitharaman) ప్రవేశపెట్టనున్నారు. దీంతో సామాన్య ఉద్యోగులతో మొదలుకుని అనేక మంది ఈ బడ్జెట్ 2024లో ఎలాంటి ప్రకటనలు చేయబోతున్నారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Budget 2024: బడ్జెట్ 2024లో వీటిపైనే ప్రధానంగా ఫోకస్.. సూచించిన మోదీ
Budget 2024

మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయి కేంద్ర బడ్జెట్ 2024(Budget 2024)ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(nirmala sitharaman) ప్రవేశపెట్టనున్నారు. దీంతో సామాన్య ఉద్యోగులతో మొదలుకుని అనేక మంది ఈ బడ్జెట్ 2024లో ఎలాంటి ప్రకటనలు చేయబోతున్నారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వచ్చే బడ్జెట్‌లో ఉద్యోగాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, తయారీ రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిసింది. వీటిపై కొన్ని ప్రత్యేక ప్రకటనలు చేయవచ్చని అంటున్నారు.


modi.jpg

ఆర్థికవేత్తల సమావేశం

ఇప్పటికే కొత్త ప్రభుత్వం మొదటి పూర్తి కేంద్ర బడ్జెట్‌కు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆర్థికవేత్తల సమావేశం జరిగింది. ఈ భేటీలో ప్రధాని మోదీ కూడా పలు అంశాలపై చర్చించారు. అనేక కార్యక్రమాలు, పథకాలకు నిధులు గురించి కూడా ఆరా తీశారు. ఈ క్రమంలో గోల్డ్‌మన్ శాక్స్ ఆర్థికవేత్తల ప్రకారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొత్త ప్రభుత్వం ప్రధానంగా సంక్షేమ వ్యయం వైపు మొగ్గు చూపవచ్చని తెలిపారు. ఈ క్రమంలో ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగ కల్పనపై దృష్టి సారిస్తారని వెల్లడించారు.


2047 నాటికి

ప్రధాని మోదీ దాదాపు 20 మంది ఆర్థికవేత్తలు, నిపుణులతో ఐదు నిమిషాల పాటు మాట్లాడారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న లక్ష్యంతో పాటు ఉపాధి కల్పనను వేగవంతం చేయాలన్నదే ఈ సమావేశంలో ప్రధాన ఎజెండాగా చర్చించారు. ఈ చర్చలు ప్రధానంగా తయారీ, వ్యవసాయం, గ్రామీణ రంగాలలో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలని చెప్పినట్లు తెలుస్తోంది.


వ్యవసాయాభివృద్ధిపై ఆందోళన

స్తబ్దత, వేతనాల పోకడల నడుమ వినియోగ డిమాండ్ మందగించడం సహా పలు అంశాలపై చర్చించారు. ఇందులో ఆర్థికవేత్తలు వ్యవసాయ వృద్ధి గురించి ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేకపోవడం, ఉత్పత్తిని పెంచడానికి ముద్ర పథకం వంటి స్కీమ్స్ రుణాలు ఇచ్చినప్పటికీ రుణ వృద్ధి మందగించింది. తయారీ రంగం గురించి కూడా వివరంగా చర్చించినట్లు ఆయా వర్గాలు తెలిపాయి. భారతదేశం మరెన్నో వస్తువులను తయారు చేయాలని, అధిక ఆర్థిక వృద్ధి రేటును సాధించడంలో మాత్రమే కాకుండా ప్రపంచ సరఫరా గొలుసులలో చేరే వ్యూహాత్మక లక్ష్యాన్ని సాధించడంలో తయారీ ఎలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందనేది ఆలోచన చేయాలని సూచించినట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి:

Investment Plan: నెలకు రూ.16 వేలు కడితే కోటీశ్వరులవ్వొచ్చు.. ఎలాగంటే..?

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ర్యాలీలో కాల్పులు.. గాయాలతో ఆస్పత్రికి


Warranty vs Guarantee: మీకు వారంటీ, గ్యారెంటీ మధ్య తేడా తెలుసా.. లేదంటే నష్టపోతారు జాగ్రత్త..!


For Latest News and Business News click here

Updated Date - Jul 14 , 2024 | 01:51 PM