Share News

Insurance: ఇకపై సైబర్ స్కాంలకు కూడా ఇన్సూరెన్స్ .. రోజుకు ఎంతంటే..

ABN , Publish Date - Sep 15 , 2024 | 11:03 AM

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ మోసాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిరోజు అనేక మందిని బోల్తా కొట్టించి సైబర్ నేరగాళ్లు దోపిడీ చేస్తున్నారు. అయితే ఇలాంటి మోసాల బారిన పడిన కంపెనీలు లేదా వ్యక్తులకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తామని పలు సంస్థలు ప్రకటించాయి.

Insurance: ఇకపై సైబర్ స్కాంలకు కూడా ఇన్సూరెన్స్ .. రోజుకు ఎంతంటే..
Insurance for cyber fraud

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయాలన్నా, బ్యాంకింగ్ సేవలను పొందాలన్నా ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నారు. అయితే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు(cyber attacks) కూడా గతంలో కంటే తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజు అనేక మందిని బోల్తా కొట్టించి సైబర్ కేటుగాళ్లు దోపిడీ చేస్తున్నారు. నేటి కొత్త తరం సాంకేతికత 'జెనరేటివ్ AI' (GenAI) కారణంగా ఇది మరింత పెరుగుతందని టెక్ వర్గాలు అంటున్నాయి. దీని ద్వారా శబ్దాలు, వీడియోలు, చిత్రాలను సులువుగా రూపొందించడం ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని అంటున్నారు. అయితే ఇలాంటి మోసాల బారిన పడిన కంపెనీలు లేదా వ్యక్తులకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తామని పలు సంస్థలు ప్రకటించాయి.


సైబర్ మోసాల నుంచి

ఇన్సూరెన్స్ కంపెనీలు ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ కవర్‌లను సాచెట్‌ల(Sachet) పేరుతో అందిస్తున్నాయి. ఇవి పెరుగుతున్న సైబర్ మోసాల నుంచి రక్షించడానికి రూపొందించబడ్డాయి. వీటి కోసం రోజుకు కేవలం 3 రూపాయల ఖర్చుతో లభించే ఈ బీమా కవర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని తీసుకోవడం ద్వారా సైబర్ దోపిడీ, ఆన్‌లైన్ దోపిడీల నుంచి ఆయా వ్యక్తులు లేదా వ్యాపారాలను రక్షించుకోవచ్చు. మాల్వేర్, ransomware సైబర్ దాడులకు వ్యతిరేకంగా వ్యాపారాలు, వ్యక్తులను రక్షించడమే సైబర్ సాచెట్ ఇన్సూరెన్స్ పాలసీ లక్ష్యమని HDFC ERGO జనరల్ ఇన్సూరెన్స్ డైరెక్టర్ పార్థనిల్ ఘోష్ అన్నారు. మార్కెట్లో ఇలాంటి నష్టాలు పెరుగుతున్న నేపథఅయంలో ఆయా సైబర్ దాడులకు కవరేజ్ అందించబడుతుందని ICICI లొంబార్డ్‌ ప్రతినిధులు తెలిపారు.


గతంలో ఇలా..

2023లో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP)లో సైబర్ మోసానికి సంబంధించిన 17000 ఫిర్యాదులు అందాయి. వాటిలో 69 కోట్ల రూపాయల విలువైన సైబర్ మోసం జరిగింది. 2024లో ఆరు నెలల్లో 11 వేల సైబర్ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు అందగా, అందులో రూ.62 కోట్ల మోసం సహా అనేక కేసులు ఉన్నాయి. అయితే ఈ మోసం జరిగిన తర్వాత కేవలం 10 శాతం డబ్బు మాత్రమే తిరిగి వస్తోంది. 2024 సంవత్సరంలో జనవరి నుంచి జూన్ వరకు 11000 సైబర్ మోసం ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సైబర్ మోసం జరిగిన వెంటనే హెల్ప్‌లైన్ నంబర్ 1930కి ఫిర్యాదు చేయాలని అధికారులు చెబుతున్నారు. కానీ కొన్ని సందర్భాలలో కంప్లైంట్ చేసినా కూడా ఫలితం లేకుండా పోతుంది.


ఇవి కూడా చదవండి:

Rain Alert: వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు


Neeraj Chopra: నీరజ్ చోప్రాకు మళ్లీ షాక్.. డైమండ్ లీగ్ టైటిల్ కొంచెంలో మిస్

Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు

Read MoreBusiness News and Latest Telugu News

Updated Date - Sep 15 , 2024 | 11:06 AM