Share News

Online Payments: ఈ నిజం మీకు తెలుసా? జేబులు ఖాళీ చేస్తున్న క్యాష్‌లెస్ పేమెంట్స్..

ABN , Publish Date - Jun 30 , 2024 | 05:55 PM

Cashless Payment: ప్రస్తుత టెక్ యుగంలో భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా నగదు రహిత చెల్లింపుల వినియోగం పెరిగింది. చాలా మంది ప్రజలు నగదును ఉపయోగించకుండా.. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, UPI మొదలైన వాటి ద్వారా ఎక్కువ చెల్లింపులు చేయడానికి ఇష్టపడుతున్నారు.

Online Payments: ఈ నిజం మీకు తెలుసా? జేబులు ఖాళీ చేస్తున్న క్యాష్‌లెస్ పేమెంట్స్..
Online Payments

Cashless Payment: ప్రస్తుత టెక్ యుగంలో భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా నగదు రహిత చెల్లింపుల వినియోగం పెరిగింది. చాలా మంది ప్రజలు నగదును ఉపయోగించకుండా.. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, UPI మొదలైన వాటి ద్వారా ఎక్కువ చెల్లింపులు చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే, ఇదే ప్రజల జేబులను చిల్లులు పెడుతుందని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. తాజాగా సర్వే ప్రకారం.. నగదుకు బదులుగా నగదు రహిత చెల్లింపుల మాధ్యమాన్ని ఎంచుకోవడం వల్ల ప్రజలు ఖర్చులు భారీగా పెరుగుతున్నాయట. మెల్‌బోర్న్ విశ్వవిద్యాలయం, అడిలైడ్ విశ్వవిద్యాలయాలకు చెందిన కొందరు నిపుణులు.. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నగదు రహిత లావాదేవీలపై తమ నివేదికను సిద్ధం చేశారు. 17 దేశాలకు చెందిన ప్రజల ఖర్చుల తీరును పరిశీలించారు.


అదుపు లేకుండా ఖర్చు..

సర్వే ప్రకారం.. ఇంతకు ముందు ప్రజలు తమ ఖర్చులను డైరీల్లో రాసుకుని.. లెక్కలు వేసుకునేవారు. కానీ, ప్రస్తుతం డిజిటల్ లావాదేవీల ట్రెండ్ పెరిగిపోవడంతో డైరీల్లో అకౌంట్స్ రాసుకునే అలవాటు తగ్గిపోయింది. అందుకే.. డబ్బు ఆదా చేసుకోవాలనుకునేవారు.. కార్డులు, ఆన్‌లైన్ పేమెంట్స్‌పై మాత్రమే ఆధారపడకుండా నగదును కూడా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. డిజిటల్ పేమెంట్స్‌కి బదులుగా నగదు ద్వారా చెల్లిస్తే వారు తమ ఖర్చులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయగలుగుతారు. ఇది మరింత డబ్బును ఆదా చేయడంలో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. నగుదును ఉపయోగించేటప్పుడు ప్రజలు తమ వద్ద ఉన్న నగదును లెక్కిస్తుంటారు. ఇది వారి ఖర్చులను ట్రాక్ చేయడానికి సహాయపడుతుందని సర్వే నివేదికలో పేర్కొన్నారు.


విలాస వస్తువులపై పెరిగిన ఖర్చు..

గత కొన్నేళ్లుగా ప్రజలు లగ్జరీ వస్తువులపై తమ ఖర్చును పెంచుకున్నారని కూడా ఈ నివేదిక వెల్లడించింది. ప్రస్తుత కాలంలో ప్రజలు విలాస వస్తువులపై ఖర్చు చేయడాన్ని స్టేటస్ సింబల్‌గా చూస్తున్నారు. దాదాపు చాలా మంది ప్రజలు నగదు రహిత లావాదేవీలకు అలవాటు పడ్డారని ఈ అధ్యయనం వెల్లడించింది. మొత్తంగా నగదు రహిత లావాదేవీలు ప్రజల్లో డబ్బు ఖర్చు చేసే అలవాట్లను పెంచాయని.. ఇది మానుకుంటే మేలని అధ్యయనం సూచించింది. క్యాష్‌లెస్ పేమెంట్స్ కారణంగా ముందు వెనుకా ఆలోచించకుండా డబ్బు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొంది.

For More Busines News and Telugu News..

Updated Date - Jun 30 , 2024 | 05:55 PM