IRCTC: శ్రీరామనవమి స్పెషల్.. వైష్ణో దేవి నవరాత్రి టూర్ ప్యాకేజీ
ABN , Publish Date - Apr 10 , 2024 | 07:05 PM
దేశవ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో శ్రీరామనవమి నవరాత్రి వేడుకలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి(sri rama navami) బుధవారం ఏప్రిల్ 17, 2024న జరగనుంది. ఈ క్రమంలో మీరు వైష్ణో దేవి ఆలయాన్ని(MATA VAISHNO DEVI temple) సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే, మీరు ఈ IRCTC టూర్ ప్యాకేజీని ఎంచుకోవచ్చు.
దేశవ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో శ్రీరామనవమి నవరాత్రి వేడుకలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి(sri rama navami) బుధవారం ఏప్రిల్ 17, 2024న జరగనుంది. ఈ క్రమంలో మీరు వైష్ణో దేవి ఆలయాన్ని(MATA VAISHNO DEVI temple) సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే, మీరు ఈ IRCTC టూర్ ప్యాకేజీని ఎంచుకోవచ్చు. రామనవమి రోజున వెళ్లి మాత వైష్ణో దర్శనం చేసుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌లోని వైష్ణో దేవి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల టూర్ ప్యాకేజీ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
IRCTC మాతా వైష్ణోదేవి టూర్ ప్యాకేజీ ఢిల్లీ(New Delhi Railway Station) నుంచి వందే భారత్ ఎక్స్ ప్రెస్(vande bharat express) ద్వారా ప్రారంభమవుతుంది. గురువారం నుంచి సోమవారం వరకు ఇది కొనసాగనుంది. IRCTC వైష్ణో దేవి రెండు రోజుల యాత్రను రూ.7.290కి అందిస్తోంది. మాతా వైష్ణో దేవి టూర్ ప్యాకేజీలో మీరు న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి థర్డ్ AC స్లీపర్ క్లాస్ టిక్కెట్‌ను పొందుతారు. ట్రిపుల్ ఆక్యుపెన్సీ కోసం ఒక్కో ప్రయాణికుడు రూ.7290 చెల్లించాల్సి ఉంటుంది. డబుల్ ఆక్యుపెన్సీ కోసం ఒక్కో ప్రయాణికుడు రూ.7660 చెల్లించాల్సి ఉంటుంది. సింగిల్ ఆక్యుపెన్సీకి ఒక్కో ప్రయాణికుడికి రూ.9135 పే చేయాలి. పిల్లల కోసం ప్రత్యేక చెల్లింపులు ఉంటాయి. IRCTC టూర్ ప్యాకేజీలో రూమ్ షేరింగ్ ప్రకారం ఛార్జీ భిన్నంగా ఉంటుంది.
ఈ ప్రయాణంలో భాగంగా మీరు ముందు రోజు కత్రాలో IRCTC అతిథి గృహానికి చేరుకుంటారు. అక్కడ ఫ్రెష్ అప్ అయిన తర్వాత, మీరు తర్వాత రోజు కత్రా నుంచి ఆలయం కోండపైకి ఎక్కడం ప్రారంభిస్తారు. అక్కడి నుంచి అదే రోజు మాతా వైష్ణో దేవి దర్శనం చేసుకున్న తర్వాత కిందికి వస్తారు. ఆ తర్వాత మీ రైలు సాయంత్రం 6 గంటలకు కత్రా నుంచి బయలుదేరుతుంది. అది మిమ్మల్ని తిరిగి ఢిల్లీకి తీసుకువెళుతుంది. మరింత సమాచారం కోసం మీరు IRCTC వెబ్‌సైట్ www.irctctourism.comను సందర్శించవచ్చు. ఈ టూర్ కోసం మీరు మొబైల్ లేదా ల్యాప్‌టాప్ నుంచి లేదా ఇంట్లో కూర్చొని టూర్ ప్యాకేజీలను బుక్ చేసుకోవచ్చు. మీరు కస్టమర్ కేర్ లేదా సమీపంలోని IRCTC కార్యాలయాన్ని కూడా సందర్శించవచ్చు.
ఇది కూడా చదవండి:
Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. ఎన్నికల తర్వాత..
EPFO: అమల్లోకి వచ్చిన ఈపీఎఫ్‌వో కొత్త రూల్స్.. ప్రయోజనాలు ఏంటంటే
మరిన్ని బిజినెస్ వార్తల కోసం