Home » Srirama Navami
అయోధ్య రామ్ లల్లాలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. నేడు ఆలయంలో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. సూర్య భగవానుడు బాలరామునికి తన కిరణాలతో తిలకం దిద్దాడు.
పాలకుడు ఎప్పుడూ ప్రజలకు ఆదర్శనీయుడుగా ఉండాలని తన పాలన ద్వారా తెలియజేసిన సుగుణాభిరాముని చరిత్రను ఈ సందర్భంగా మననం చేసుకొందామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం భద్రాద్రి జిల్లాల్లో పర్యటించనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో సీతారామ కల్యాణం కోసం స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.
కడప: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం 9 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. ఈనెల 11న సీతారాముల కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పట్టువస్త్రాలు, ముత్యాలు సమర్పిస్తారు.
ధర్మబద్ధ జీవనానికి నిలువెత్తు నిర్వచనంగా, మనిషి ఇలా బ్రతకాలి, అని ఒక ఆదర్శవంత మైన జీవితాన్ని గడిపి, మానవ జన్మకున్న విశిష్ఠతను ఆవిష్కరించిన రామాయణ నాయకుడు, ధర్మమూర్తి శ్రీరామచంద్రమూర్తి. రామాయణం అనే మాటలోని ‘అయనం’ అంటే నడక అని అర్థం. రామాయణం అంటే ‘రాముని నడక’ అని అర్థం. అంటే ఆయన జీవించిన విధానం. పరిపూర్ణంగా మానవుడు ఎలా జీవించాలో అలా జీవించి చూపాడు శ్రీరాముడు.
Sitamma Gold Saree: సీతమ్మ వారికి బంగారు చీర సిద్ధమైంది. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రి సీతమ్మ కోసం సిరిసిల్ల నేతన్న గోల్డ్ చీరను నేశారు.
తమిళనాడులోని సముద్ర తీరంలో ఉన్న చారిత్రక పంబన్ బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకోవడంతో ఆ స్థానంలో అదే పేరుతో కొత్త పంబన్ బ్రిడ్జిని నిర్మించారు. ఆధునిక ఇంజనీరింగ్‌తో ప్రజలను, ప్రదేశాలను అనుసంధానిస్తూ వర్టికల్ లిఫ్ట్ విధానంలో భారత్‌తో నిర్మించి తొలి రైల్వే బ్రిడ్జి ఇదే కావడం విశేషం.
Andhrapradesh: ప్రజలందిరికీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత స్పందిస్తూ.. ‘‘తేత్రాయుగం నాటి రామరాజ్యం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం. అంటే దానికి కారణం... ప్రజల మనోభావాలకు అనుగుణంగా సాగిన శ్రీరాముని పాలన. పాలకులు తన కుటుంబం కంటే ప్రజల ఆనందమే ముఖ్యమని భావించాలని రామకథ చెబుతుంది’’ అని చంద్రబాబు అన్నారు.
Telangana: భద్రాద్రిలో శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. భద్రాచల పుణ్యక్షేత్రంలో శ్రీసీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. మూహూర్త సమయాన సీతమ్మ మెడలో రామయ్య పుస్తె కట్టడంతో కళ్యాణ క్రతువు పూర్తైంది. మిథులా స్టేడియంలోని మండపంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. ఉదయం రామాలయంలో మూలవరులకు మొదట కళ్యాణం జరిగింది. ఆపై ఉత్సవమూర్తులను ఆలయం నుంచి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా మిథులా కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు.
Bhadrachalam Ram Navami LIVE: భద్రాచల క్షేత్రంలో(Bhadrachalam) మహా కమనీయ ఘట్టం.. రాములోరు, సీతమ్మ కళ్యాణమే! ఆ శుభ ముహూర్తం వచ్చేసింది. ఇవాళే సీతారాముల కళ్యాణం(Seetharamula Kalyanam)! శీరామ నవమి(Ram Navaami 2024) సందర్భంగా ఈ మహాద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు భద్రాచలానికి చేరుకున్నారు. లోక్‌సభ ఎన్నికల కోడ్ ఉండటంతో కళ్యాణ మహోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భద్రాచలం వెళ్లడం..