Onions: ఇక్కడ రూ. 35కే కిలో ఉల్లి.. ఎక్కడో తెలుసా..
ABN , Publish Date - Sep 05 , 2024 | 05:32 PM
ఉల్లి ధరలు పెరిగాయని ఇబ్బంది పడుతున్న మధ్య తరగతి ప్రజలకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ క్రమంలో ఉల్లి ధరలను నియంత్రించేందుకు మార్కెట్‌లో జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అందుకోసం ఏం చర్యలు తీసుకున్నారనేది ఇప్పుడు చుద్దాం.
గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా మళ్లీ ఉల్లి ధరలు(onions rates) పెరిగాయి. దీంతో మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఉల్లి ధరలను నియంత్రించేందుకు మార్కెట్‌లో జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఏం చేసిందనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ఎన్‌సీఆర్(delhi ncr) పరిధిలో కిలో ఉల్లిని రూ. 35కు రాయితీపై ఈ రోజు(సెప్టెంబర్ 5) నుంచి విక్రయిస్తుంది. ఈ ఉల్లిపాయల మొబైల్ వ్యాన్లు నేషనల్ కో ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NCCF) షాపుల నుంచి విక్రయిస్తున్నాయి.
38 ప్రదేశాలలో
వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రి ప్రహ్లాద్ జోషి(Pralhad Joshi) ఢిల్లీలోని కృషి భవన్(Pralhad Joshi) నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. NCUI కాంప్లెక్స్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్ మెట్రో స్టేషన్, నోయిడాలోని వివిధ ప్రదేశాలలో మొత్తం 38 ప్రదేశాలలో ఉల్లి విక్రయాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సామాన్యులు ఇక్కడికి వెళ్లి ఉల్లి కొనుగోలు చేయాలని సూచించారు. మార్కెట్లో పెరుగుతున్న ఉల్లి ధరలను నియంత్రించడం, దాని సరఫరాను మెరుగుపరచడమే ఈ కార్యక్రమం లక్ష్యం. ప్రస్తుతం ఢిల్లీలో ఉల్లి ధరలు కిలోకు రూ.60 పైనే ఉన్నాయి. ఈ క్రమంలో వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు, మధ్యవర్తుల అక్రమ లాభార్జనను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.
రైతుల నుంచి
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రైతుల నుంచి నేరుగా ఉల్లిపాయలను కొనుగోలు చేయడం ద్వారా NCCF తన స్టాక్‌ను సిద్ధం చేసింది. రైతుల నుంచి నేరుగా ఉల్లిని(onion) కొనుగోలు చేసి, గిట్టుబాటు ధరకు విక్రయించడం ద్వారా వినియోగదారులకు పెరుగుతున్న ధరల ప్రభావం నుంచి తగ్గుతుందని వెల్లడించారు. మరోవైపు ఉల్లితో పాటు టమాటా, బంగాళదుంప ధరలు కూడా చాలా కాలంగా పెరుగుతున్నాయి. జూన్‌లో ఈ కూరగాయల ధరలు 15 నుంచి 58 శాతం పెరిగాయి. అయితే ఈ పరిస్థితి తాత్కాలికమేనని, త్వరలోనే బంగాళదుంపలు మినహా ఇతర కూరగాయల ధరలను అదుపు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. గత నెలలో టమాటా టోకు ధర 65.70 శాతం, ఉల్లి 35.36 శాతం, బంగాళదుంప 17.57 శాతం పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరల విషయానికి వస్తే హైదరాబాద్(hyderabad), విజయవాడ(vijayawada)లో కిలో ఉల్లి రేటు రూ.80 పలుకుతోంది. హోల్ సేల్ విధానంలో రూ.60 చొప్పున సేల్ చేస్తున్నారు. అయితే ఈ ధరల నియంత్రణ విధానం తెలంగాణ, ఏపీలో అమలు చేస్తారో లేదో చూడాలి మరి.
ఇవి కూడా చదవండి:
BSNL: జియో, ఎయిర్‌టెల్ కట్టడికి బీఎస్ఎన్ఎల్ పెద్ద ప్లాన్.. టాటా సపోర్ట్‌తో ఇక..
Property Alert: భూమి కొనుగోలు చేస్తున్నారా.. ఈ డాక్యుమెంట్ల తనిఖీ తప్పనిసరి..
Money Saving Tips: రోజు రూ.250 సేవ్ చేయండి.. ఇలా రూ.2 కోట్లు సంపాదించండి..
Read More Business News and Latest Telugu News