Share News

Stock Markets: బడ్జెట్ వేళ స్టాక్ మార్కెట్లకు నష్టాలు..కారణమిదేనా?

ABN , Publish Date - Feb 01 , 2024 | 04:09 PM

బడ్జెట్ రోజున దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలలో విపరీతమైన ఒడిదొడుకులు కనిపించాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ, ప్రధాన సూచీలు చివరికి నష్టాల్లో ముగిశాయి.

Stock Markets: బడ్జెట్ వేళ స్టాక్ మార్కెట్లకు నష్టాలు..కారణమిదేనా?

బడ్జెట్ రోజున దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలలో విపరీతమైన ఒడిదొడుకులు కనిపించాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ, ప్రధాన సూచీలు చివరికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 106 పాయింట్లు క్షీణించి 71,645కు పడిపోయింది. నిఫ్టీ కూడా 28 పాయింట్లు నష్టపోయి 21,697 వద్ద ముగిసింది. కానీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం 191 పాయింట్లు వృద్ధి చెందింది.

మీడియా, ఫార్మా, రియల్టీ, హెల్త్‌కేర్ రంగాలలో మార్కెట్‌లో అతిపెద్ద క్షీణత కనిపించింది. ఇక ప్రభుత్వ బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ, ఆటో రంగాల్లో కొనుగోళ్లు జరిగాయి. అంతకుముందు బుధవారం సెన్సెక్స్ 612 పాయింట్లు నష్టపోయి 71,752 వద్ద ముగిసింది.


ఈ క్రమంలో గోద్రెజ్ కన్స్యూమర్, మారుతీ సుజుకి, పీఎన్బీ, కంటైనర్ కార్ప్, కెనరా బ్యాంక్ సంస్థల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉండగా...ఇండియా సిమెంట్స్, అరబిందో ఫార్మా, వోల్టాస్, జూబిలెంట్ ఫుడ్, ఎస్కార్ట్స్ కుబోటా సంస్థల స్టాక్స్ టాప్ 5 లూజర్స్‌గా నిలిచాయి.

మరోవైపు మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సామాన్య ప్రజలు ఆశించిన ప్రకటనలు లభించలేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీంతోపాటు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఈ బడ్జెట్ ఉందని పలువురు నేతలు విమర్శించారు. అయితే బడ్జెట్ వేళ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకోవడం పట్ల పలువురు ఇది ఆశాజనక బడ్జెట్ కాదని కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - Feb 01 , 2024 | 04:09 PM