Deadline: నేడే చివరి తేదీ...ఈ పనులు వెంటనే పూర్తి చేయండి
ABN , Publish Date - Mar 31 , 2024 | 06:55 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా కొన్ని గంటలు మాత్రమే(March 31st deadline) మిగిలి ఉంది. మీ ఆర్థిక లావాదేవీలు లేదా ఏదైనా చెల్లింపులు(payments) ఉంటే వెంటనే పూర్తి చేసుకోండి. ఎందుకంటే ఈ పనులు చేయకుంటే మీరు భవిష్యుత్తులో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా కొన్ని గంటలు మాత్రమే(March 31st deadline) మిగిలి ఉంది. మీ ఆర్థిక లావాదేవీలు లేదా ఏదైనా చెల్లింపులు(payments) ఉంటే వెంటనే పూర్తి చేసుకోండి. ఎందుకంటే ఈ పనులు పూర్తి చేయకుంటే మీరు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అయితే ఏంటి ఆ వివరాలు, వేటీ గడువు నేటితో (మార్చి 31) పూర్తికానుందనే ప్రధానమైన ఆర్థిక విషయాల(financial transactions) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎన్‌పీఎస్(NPS) ఖాతాదారులు ప్రతి ఆర్థిక సంవత్సరం తమ టైర్1 ఖాతా బ్లాక్ కాకుండా నివారించుకోవడానికి కనీసం రూ. 1,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నియంత్రణ NPS టైర్ 2 ఖాతాలకు వర్తించదు. దీంతోపాటు NPS టైర్ 1 ఖాతాదారులు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 CCD (1B) కింద రూ. 50,000 అదనపు పన్ను మినహాయింపును కూడా పొందవచ్చు.
మీరు అనేక రోజులుగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఖాతాను ఉపయోగించకుండా ఉన్నట్లైతే ఈ ఖాతాలో కనీసం వార్షిక సమయానికి రూ. 500 డిపాజిట్ చేయాలి. లేదంటే మీ ఖాతా డీయాక్టివేట్ అవుతుంది. మళ్లీ దీన్ని డియాక్టివేట్ చేసుకోవాలంటే రూ. 50 పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: జూన్ చివరి నాటికి స్మార్ట్ టీవీలు మరింత ప్రియం
సుకన్య సమృద్ధి యోజన (SSY) ఇది ఆడపిల్లల పొదుపు కోసం వచ్చిన పథకం. అయితే ఈ స్కీంలో మీరు ఇప్పటివరకు ఏం డిపాజిట్ చేయకుంటే ఉంటే ఈరోజే కనీసం రూ. 250 డిపాజిట్ చేయాలి. లేకపోతే మీ ఖాతా డియాక్టివేట్ అవుతుంది. మళ్లీ యాక్టివేట్ చేసుకోవడానికి ప్రతి డిఫాల్ట్ సంవత్సరానికి రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది.
ఫాస్టాగ్ KYC డెడ్‌లైన్ కూడా ఈరోజే ఉంది. మీరు ఫాస్టాగ్ వినియోగిస్తున్నట్లైతే KYC వివరాలను వెంటనే అప్‌డేట్ చేసుకోండి. అప్‌డేట్ చేయకపోతే ఏప్రిల్ 1 నుంచి FASTag పరికరం చెల్లుబాటు కాదు.
TDS ఫైలింగ్ సర్టిఫికేట్ పన్ను చెల్లింపుదారులు జనవరి 2024కి పన్ను మినహాయింపును పొందాలనుకునేవారు TDS ఫైలింగ్ సర్టిఫికేట్‌ను ఈరోజే సమర్పించాలి. సెక్షన్ 194-IA, 194-IB, 194-M కింద మినహాయింపు కోసం చలాన్ వివరాలను మార్చి 31లోపు దాఖలు చేయాలి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ అమృత్ కలాష్‌పై అధిక వడ్డీ రేటును కూడా ఈరోజే నిలిపివేస్తుంది. ఈ నేపథ్యంలో మీరు తీసుకోవాలని భావిస్తే ఈరోజే ఈ స్కీం కొనుగోలు చేయండి.
2023-24 ఆర్థిక సంవత్సరానికి తమ ఆదాయపు పన్ను (IT) మినహాయింపులను క్లెయిమ్ చేయడానికి పలు ఆర్థిక సాధనాల్లో పెట్టుబడి పెట్టాలనుకునే పన్ను చెల్లింపుదారులు మార్చి 31, 2024లోపు పెట్టుబడి పెట్టాలి. ఈ సాధనాలు ఆదాయపు పన్ను (IT) చట్టం, 1962లోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపును ప్రారంభించే ఆర్థిక సాధనాల్లో పెట్టుబడి పెట్టేందుకు పన్ను చెల్లింపుదారులను అనుమతిస్తుంది. వీటిలో PPF, NPS, బీమా ప్రీమియం, ELSS, పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ULIP, సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వంటివి ఉన్నాయి.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: చైనాకూ మేలు చేసేలా మన ఈవీ పాలసీ!?