Stock Markets: మోదీ 3.0 గెలుపు అంచనాలతో లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు
ABN , Publish Date - Jun 03 , 2024 | 09:13 AM
ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలో మూడోసారి ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన తర్వాత సోమవారం స్టాక్ మార్కెట్లు(Stock Markets) లాభాలతో ప్రారంభమయ్యాయి. మౌలిక సదుపాయాలు, క్యాపిటల్ గూడ్స్, తయారీ రంగ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
బెంగళూరు: ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలో మూడోసారి ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన తర్వాత సోమవారం స్టాక్ మార్కెట్లు(Stock Markets) లాభాలతో ప్రారంభమయ్యాయి. మౌలిక సదుపాయాలు, క్యాపిటల్ గూడ్స్, తయారీ రంగ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 7.05 గంటలకు నిఫ్టీ 23,353 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.
శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 22,530.70 వద్ద ఉంది. గత వారం నిఫ్టీ 50, S&P BSE సెన్సెక్స్ 2 శాతం చొప్పున పడిపోయాయి.శనివారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ 543 మంది సభ్యుల లోక్ సభలో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(NDA) మూడింట రెండు వంతుల మెజారిటీని పొందవచ్చని అంచనా వేశాయి.
ఎగ్జిట్ పోల్స్ మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అధికార బీజేపీ మళ్లీ గెలుస్తుందని మెజారిటీ సర్వేలు చెప్పాయని, ఎన్నికల ప్రభావం మార్కెట్లపై ఉంటుందని ఆనంద్ రాఠి షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్‌లో పెట్టుబడి సేవల ప్రాథమిక పరిశోధన హెడ్ నరేంద్ర సోలంకి అన్నారు.
మేలో 3 బిలియన్ డాలర్ల భారతీయ స్టాక్‌లను విక్రయించిన విదేశీ పెట్టుబడిదారులు మళ్లీ కొనుగోళ్లు పెంచవచ్చని అంచనా వేశారు. విదేశీ పెట్టుబడిదారులు శుక్రవారం 16.13 బిలియన్ రూపాయల(దాదాపు $193 మిలియన్లు) విలువైన షేర్లను, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు 21.14 బిలియన్ రూపాయల స్టాక్‌లను కొనుగోలు చేశారు.
కేంద్రంలో రాబోయే ప్రభుత్వం తయారీ, క్యాపెక్స్ , మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారిస్తుందని నిపుణులు చెబుతున్నారు. జనవరి-మార్చి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే 7.8 శాతం అధికంగా వృద్ధి చెందిందని తెలిపారు.
RBI: యూకే నుంచి 100 టన్నుల బంగారం వాపస్.. నిల్వలపై నిరంతర సమీక్ష చేయనున్న ఆర్బీఐ
For Latest News and Business News click here