Jimny Recall: ప్రముఖ కంపెనీ కార్లలో పెద్ద లోపం.. వెంటనే రీకాల్ చేసిన సంస్థ
ABN , Publish Date - Dec 07 , 2024 | 11:12 AM
ప్రముఖ కంపెనీ మారుతి సుజుకి తన కస్టమర్లకు కీలక అనౌన్స్‌మెంట్ చేసింది. ఇటివల మార్కెట్లోకి వచ్చిన జిమ్నీ SUVని రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఎందుకు రీకాల్ చేశారు, ఏంటి లోపం అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి (Maruti Suzuki) కస్టమర్లకు కీలక ప్రకటన చేసింది. ఈ సంస్థ బడ్జెట్ సెగ్మెంట్ నుంచి ప్రీమియం సెగ్మెంట్ వరకు అనేక కార్లను (cars) తయారు చేస్తుంది. అయితే ఇటివల మారుతి సుజుకి ఆఫ్ రోడర్ SUV జిమ్నీలో (Jimny Recall) ఒక లోపం ఏర్పడింది. దీంతో కంపెనీ వాటిని రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో మీ వద్ద కూడా జిమ్నీ ఉన్నట్లయితే వెంటనే తీసుకెళ్లండి మరి. అయితే ఈ SUVలో ఏ భాగంలో లోపం ఉందో ఇక్కడ తెలుసుకుందాం.
మారుతి జిమ్నీలో లోపం ఏంటి?
కారు ఫ్రంట్ యాక్సిల్‌లోని కింగ్ పిన్ అసెంబ్లీని భర్తీ చేయడానికి జిమ్నీని రీకాల్ చేశారు. బ్రేకింగ్ సమయంలో వైబ్రేషన్ గురించి అనేక ఫిర్యాదుల తర్వాత, మారుతి దీనిని గుర్తించింది. నివేదికల ప్రకారం జిమ్నీని గంటకు 80 కిమీ వేగంతో నడుపుతున్నప్పుడు బ్రేకులు వేసినప్పుడు వైబ్రేషన్ అనుభూతి వస్తుంది. ఇది స్టీరింగ్ వీల్ ద్వారా వస్తుందని చెబుతున్నారు. కానీ కారు వేగం గంటకు 60 కిమీకి చేరుకున్నప్పుడు వైబ్రేషన్ రావడం లేదు. దీంతో ఈ లోపభూయిష్ట భాగాన్ని కంపెనీ ఉచితంగా భర్తీ చేస్తుంది. దీని కోసం వినియోగదారుల నుంచి ఎటువంటి డబ్బు తీసుకోవడం లేదు. ఈ పని ఉచితంగా చేయబడుతుంది.
కానీ అమ్మకాల్లో మాత్రం
దీని భర్తీ కోసం కంపెనీ త్వరలో కస్టమర్లను సంప్రదిస్తుంది. ఇది జరగకపోతే దీని కోసం మారుతి సుజుకిని సంప్రదించాలని కూడా కస్టమర్‌లకు సూచించారు. మారుతి జిమ్నీ పతనానికి అధిక ధర ప్రధాన కారణంగా మారింది. జిమ్నీకి బదులుగా వినియోగదారులు ఎక్కువగా థార్‌ను ఇష్టపడుతున్నారు. అయితే ఈ ధరలో మార్కెట్లో చాలా గొప్ప SUVలు అందుబాటులో ఉన్నాయి. జిమ్నీని 4X2లో లాంచ్ చేసి, ధరను తగ్గించినట్లయితే, బహుశా దీని అమ్మకాలు మెరుగుపడే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. అయితే దీని ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
ధర, మైలేజీ
మారుతి జిమ్నీ ఎక్స్ షో రూమ్ ధర రూ. 12.74 లక్షల నుంచి రూ. 14.79 లక్షల వరకు ఉంది. జిమ్నీ పొడవు 3985mm, వెడల్పు 1645mm, ఎత్తు 1720mm, వీల్‌బేస్ 2590mm. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 210mm. జిమ్నీ 1.5 లీటర్ K సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 104.8 PS శక్తి, 134.2Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఐడిల్ స్టార్ట్/స్టాప్ బటన్ ఫీచర్‌తో అమర్చబడింది. ఇందులో ఈ SUV 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఇది ఒక లీటర్‌కు 16.94kmpl వరకు మైలేజీని అందిస్తుంది.
ఇవి కూడా చదవండి:
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Bitcoin Investment: ఇది కదా లక్కంటే.. అప్పటి 100 రూపాయల పెట్టుబడి, ఇప్పుడు 1.7 కోట్లు
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..
Read More Business News and Latest Telugu News