Rolls Royce: దేశంలో అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ ఈవీ వచ్చేసింది..ధర ఏంతంటే
ABN , Publish Date - Jan 19 , 2024 | 05:00 PM
బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్(rolls royce) భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనం స్పెక్టర్ మోడల్‌ని ఈరోజు(జనవరి 19న) లాంచ్ చేసింది. అంతేకాదు దీని ధర దేశంలో ఇప్పటివరకు ప్రవేశపెట్టిన ఈవీ కార్లలో అత్యధికం( రూ.7.50 కోట్లు) కావడం విశేషం.

ఇక దీని ఫీచర్ల విషయానికి వస్తే స్పెక్టర్ 102kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 530కిమీల పరిధిని కలిగి ఉంటుంది. 195kW ఛార్జర్‌తో 34 నిమిషాల్లో బ్యాటరీని 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే 50kW DC ఛార్జర్‌కు 95 నిమిషాలు పడుతుంది. ఈ వాహనంలో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు అమర్చబడి ఉంటాయి. ఇవి 585hp, 900Nm శక్తిని ఉత్పత్తి చేస్తాయి.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: All Banks Half Day: అన్ని బ్యాంకులు జనవరి 22న హాఫ్ డే..తర్వాత మూడు రోజులు సెలవు!
2,890కిలోల స్పెక్టర్ ఈవీ 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేందుకు కేవలం 4.5 సెకన్ల సమయం పడుతుందని కంపెనీ పేర్కొంది. డిజైన్ గురించి చెప్పాలంటే ఈ కారు రెండు డోర్లతో వస్తుంది. రోల్స్ రాయిస్ కారు అయినందున ఈ మోడల్ కూడా ప్రకాశవంతమైన పాంథియోన్ గ్రిల్‌తో వస్తుంది. ఇది కాకుండా ఏరో డిజైన్ అల్లాయ్ వీల్స్, స్లోపింగ్ రూఫ్‌లైన్, నిలువు LED టెయిల్‌లైట్లు, చుట్టూ క్రోమ్ గార్నిష్ అందుబాటులో ఉన్నాయి.