Share News

Next Week IPOs: వచ్చే వారం ఏకంగా 11 కొత్త ఐపీఓలు.. వీటిలో కొన్ని..

ABN , Publish Date - Sep 22 , 2024 | 12:54 PM

దేశీయ స్టాక్ మార్కెట్లో సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభమయ్యే వారంలో 11 కొత్త ఐపీఓలు మొదలు కానున్నాయి. వీటిలో కొన్ని మెయిన్‌బోర్డ్ విభాగం నుంచి వస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే ప్రారంభించిన ఐదు IPOలలో డబ్బును పెట్టుబడి పెట్టడానికి కూడా అవకాశం ఉంది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Next Week IPOs: వచ్చే వారం ఏకంగా 11 కొత్త ఐపీఓలు.. వీటిలో కొన్ని..
Next week 11 new IPOs

దేశీయ స్టాక్ మార్కెట్లో(stock markets) మళ్లీ ఐపీఓల సీజన్ రానే వచ్చింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభమయ్యే వారంలో 11 కొత్త ఐపీఓలు మొదలు కానున్నాయి. వీటిలో కొన్ని మెయిన్‌బోర్డ్ విభాగం నుంచి వస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే ప్రారంభించిన ఐదు IPOలలో డబ్బును పెట్టుబడి పెట్టడానికి కూడా అవకాశం ఉంది. కంపెనీల లిస్టింగ్ విషయానికి వస్తే వచ్చే వారంలో 14 కంపెనీలు స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టనున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.


కొత్త IPOలు

మన్బా ఫైనాన్స్ IPO: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ పబ్లిక్ ఇష్యూ సెప్టెంబర్ 23న ప్రారంభం కానుంది. ఒక్కో షేరుకు రూ.114-120గా నిర్ణయించగా, లాట్ సైజ్ 125 షేర్లు, ఇష్యూ ముగింపు సెప్టెంబర్ 25న జరుగుతుంది. షేర్ల లిస్టింగ్ సెప్టెంబర్ 30న BSE, NSEలో జరుగుతుంది. రూ. 150.84 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది.

ర్యాపిడ్ వాల్వ్స్ ఐపీఓ: రూ. 30.41 కోట్ల ఈ ఇష్యూ సెప్టెంబర్ 23న ప్రారంభమై, సెప్టెంబర్ 25న ముగుస్తుంది. సెప్టెంబర్ 30న ఎన్‌ఎస్‌ఈ ఎస్‌ఎంఈలో ఈషేర్లు లిస్ట్ చేయబడతాయి. ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 210-222. లాట్ పరిమాణం 600 షేర్లు.


WOL 3D ఇండియా ఐపీఓ: ఇది కూడా సెప్టెంబర్ 23న తెరవబడుతుంది. సెప్టెంబర్ 25న ముగుస్తుంది. రూ. 25.56 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. సెప్టెంబర్ 30న ఎన్‌ఎస్‌ఈ ఎస్‌ఎంఈలో ఈ షేర్లు లిస్ట్ చేయబడతాయి. ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 142-150. లాట్ పరిమాణం 1000 షేర్లు.

థింకింగ్ హ్యాట్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సొల్యూషన్స్ IPO: రూ. 15.09 కోట్ల పరిమాణంతో ఈ IPO సెప్టెంబర్ 25న ప్రారంభమవుతుంది. ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 42-44. లాట్ పరిమాణం 3000 షేర్లు. ఇష్యూ ముగింపు సెప్టెంబర్ 27న జరుగుతుంది. షేర్లు అక్టోబర్ 3న NSE SMEలో లిస్ట్ చేయబడతాయి.

ఇవి కూడా చదవండి:

Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి


యునిలెక్స్ కలర్స్ అండ్ కెమికల్స్ IPO: ఈ ఇష్యూ కూడా సెప్టెంబర్ 25న తెరవబడి, 27న ముగుస్తుంది. షేర్లు అక్టోబర్ 3న NSE SMEలో లిస్ట్ చేయబడతాయి. రూ. 31.32 కోట్ల పరిమాణంతో వస్తున్న ఈ IPO ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 82-87. లాట్ పరిమాణం 1600 షేర్లు.

TechEra ఇంజనీరింగ్ IPO: రూ. 35.90 కోట్ల ఈ ఇష్యూ సెప్టెంబర్ 25న తెరవబడుతుంది. సెప్టెంబర్ 27 వరకు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. షేర్లు అక్టోబర్ 3న NSE SMEలో లిస్ట్ చేయబడతాయి. బిడ్డింగ్ కోసం ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 75-82. లాట్ పరిమాణం 1600 షేర్లు.


KRN హీట్ ఎక్స్ఛేంజర్ ఐపీఓ: ఇష్యూ సెప్టెంబర్ 25న ప్రారంభం కానుంది. రూ. 209-220 ప్రైస్ బ్యాండ్‌. లాట్ పరిమాణం 65 షేర్లు. IPO సెప్టెంబర్ 27న ముగుస్తుంది. ఈ ఐపీఓ నుంచి కంపెనీ రూ.341.95 కోట్లు సమీకరించాలనుకుంటోంది. షేర్ల లిస్టింగ్ అక్టోబర్ 3న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో జరుగుతుంది.

ఫోర్జ్ ఆటో ఇంటర్నేషనల్ ఐపీఓ: కంపెనీ రూ.31.10 కోట్లు సమీకరించాలనుకుంటోంది. ఈ ఇష్యూ సెప్టెంబర్ 26న ప్రారంభమై, సెప్టెంబర్ 30న ముగుస్తుంది. షేర్ల లిస్టింగ్ అక్టోబర్ 4న NSE SMEలో జరుగుతుంది. ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 102-108. లాట్ పరిమాణం 1200 షేర్లు.


సహస్ర ఎలక్ట్రానిక్స్ సొల్యూషన్స్ ఐపీఓ: రూ. 186.16 కోట్ల పరిమాణంలో SME ఇష్యూ సెప్టెంబర్ 26న ప్రారంభమై, సెప్టెంబర్ 30న ముగుస్తుంది. ఈ షేర్లు అక్టోబర్ 4న NSE SMEలో లిస్ట్ చేయబడతాయి. ఒక్కో షేరు ధర రూ. 269-283. లాట్ పరిమాణం 400 షేర్లు.

దివ్యధన్ రీసైక్లింగ్ ఇండస్ట్రీస్ IPO: ఇది సెప్టెంబర్ 26న తెరవబడుతుంది. రూ. 24.17 కోట్లు సాధించాలని కంపెనీ భావిస్తోంది. ఒక్కో షేరుకు ప్రైస్ బ్యాండ్ రూ. 60-64. లాట్ పరిమాణం 2000 షేర్లు. సెప్టెంబర్ 30న IPO ముగింపు ఉంటుంది. షేర్లు అక్టోబర్ 4న NSE SMEలో లిస్ట్ చేయబడతాయి.


సాజ్ హోటల్స్ IPO: ఇష్యూ సెప్టెంబర్ 27న ప్రారంభమై, అక్టోబర్ 1న ముగుస్తుంది. దీని పరిమాణం రూ.27.63 కోట్లు. పెట్టుబడిదారులు రూ. 65 ధరతో 2000 షేర్లు తీసుకోవచ్చు. షేర్లు అక్టోబర్ 7న NSE SMEలో లిస్ట్ చేయబడతాయి.

దీంతోపాటు ఇప్పటికే మొదలైన ఐపీఓలలో కూడా పెట్టుబడులు చేసుకోవచ్చు. వాటిలో కలానా ఇస్పాత్, Avi Ansh Textile, ఫీనిక్స్ ఓవర్సీస్, SD రిటైల్ సహా పలు IPOలు ఉన్నాయి.


ఇవి కూడా చదవండి:

Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం..

Customers: జియో, ఎయిర్ టెల్, వీఐలకు షాకిచ్చిన కస్టమర్లు.. బీఎస్ఎన్ఎల్‌కు లాభం

Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే

Read MoreBusiness News and Latest Telugu News

Updated Date - Sep 22 , 2024 | 12:57 PM