Share News

Next Week IPOs: వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని వస్తున్నాయంటే..

ABN , Publish Date - Nov 10 , 2024 | 01:42 PM

స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు మళ్లీ గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే ఈసారి కూడా కీలక కంపెనీలు ఐపీఓకు వస్తున్నాయి. అయితే ఈసారి ఎన్ని కంపెనీలు వస్తున్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Next Week IPOs: వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని వస్తున్నాయంటే..
next week ipo updates

దేశీయ స్టాక్ మార్కెట్లో (stock markets) మళ్లీ ఐపీఓల వీక్ రానే వచ్చింది. నవంబర్ 11, 2024 నుంచి ప్రారంభమయ్యే ఈ వారంలో మూడు కొత్త IPOలు రాబోతున్నాయి. మెయిన్‌బోర్డ్ విభాగంలో జింకా లాజిస్టిక్స్ సొల్యూషన్స్ వస్తుంది. రూ.2,200 కోట్ల నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఐపీఓ నవంబర్ 11న ముగియనుంది. అంతేకాదు Swiggyతో సహా పలు కంపెనీలు కూడా ఈ వారం లిస్ట్ కానున్నాయి. అయితే ఆ కంపెనీల వివరాలు ఏంటి, ఏయే తేదీలలో వస్తున్నాయనే వివరాలను ఇక్కడ చుద్దాం.


ఈవారం (నవంబర్ 11) తర్వాత రానున్న కొత్త ఐపీఎలు

జింకా లాజిస్టిక్స్ సొల్యూషన్స్ IPO: ఈ పబ్లిక్ ఇష్యూ ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 259-273గా నిర్ణయించబడింది. ఈ IPO దాదాపు రూ. 1114.72 కోట్ల పరిమాణంతో రానుంది. నవంబర్ 13న సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడుతుంది. నవంబర్ 18న ముగుస్తుంది. నవంబర్ 21న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో షేర్ల లిస్టింగ్ జరగనుంది.

మంగళ్ కంప్యూషన్ IPO: రూ. 16.23 కోట్ల ఈ ఇష్యూ నవంబర్ 12న ప్రారంభమై, నవంబర్ 14న ముగుస్తుంది. నవంబర్ 20న బీఎస్‌ఈ ఎస్‌ఎంఈలో ఈ షేర్లు లిస్ట్ కానున్నాయి. దీని బిడ్డింగ్ ధర ఒక్కో షేరుకు రూ. 45. లాట్ పరిమాణం 3000 షేర్లు.


Onyx Biotec IPO: ఈ కంపెనీ పబ్లిక్ ఇష్యూ నవంబర్ 13న తెరవబడుతుంది. ఇందుకోసం ఒక్కో షేరు ధరను రూ. 58-61గా నిర్ణయించారు. లాట్ పరిమాణం 2,000 షేర్లు. ఐపీఓ పరిమాణం రూ. 29.34 కోట్లు. ఇష్యూ నవంబర్ 18న ముగుస్తుంది. ఈ షేర్ల లిస్టింగ్ నవంబర్ 21న NSE SMEలో జరుగుతుంది.

మరికొన్ని ఐపీఓలు కూడా..

నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఐపీఓ: రూ. 2,200 కోట్ల పబ్లిక్ ఇష్యూతో నవంబర్ 7న ప్రారంభమైంది. నవంబర్ 11న ముగుస్తుంది. నవంబర్ 14న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో షేర్ల లిస్టింగ్ జరగనుంది. IPOలో వేలం వేయడానికి ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.70-74గా నిర్ణయించబడింది.


నీలం లినెన్స్ గార్మెంట్స్ IPO: ఈ ఇష్యూ నవంబర్ 8న ప్రారంభించబడింది, నవంబర్ 12న ముగుస్తుంది. ఈ IPO పరిమాణం రూ. 13 కోట్లు. నవంబర్ 18న NSE SMEలో షేర్లు లిస్ట్ చేయబడతాయి. బిడ్డింగ్ కోసం ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 20-24. లాట్ పరిమాణం 6000 షేర్లు.

Swiggy IPO: బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో నవంబర్ 13, 2024న లిస్టింగ్ కానుంది.


ఇవి కూడా చదవండి:

Business Idea: ఈ పాల వ్యాపారం చేయండి.. నెలకు రూ. 5 లక్షలకుపైగా సంపాదించండి..


Personal Finance: కేవలం రూ. 1200తో కోటీశ్వరులవ్వండి.. అందుకు ఎన్నేళ్లు పడుతుందంటే..


Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..

Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Nov 10 , 2024 | 01:44 PM