Next Week IPOs: వచ్చే వారం ఐపీఓల పండుగ.. పెట్టుబడిదారులకు డబ్బే డబ్బు!
ABN , Publish Date - Sep 08 , 2024 | 06:55 PM
స్టాక్ మార్కెట్లో(stock market) ఐపీఓల వారం మళ్లీ రానే వచ్చింది. ఈసారి సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే వారంలో 13 కొత్త IPOలు రాబోతున్నాయి. ఈ జాబితాలో ప్రముఖ సంస్థ బజాజ్ గ్రూప్ కంపెనీ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌తోపాటు పలు కంపెనీలు ఉన్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
వచ్చే వారం స్టాక్ మార్కెట్లో(stock market) పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈసారి ఏకంగా 13 కంపెనీలు IPO మార్కెట్లోకి రాబోతున్నాయి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌తో సహా పలు కంపెనీలు IPOను ప్రారంభించబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీలు మొత్తం రూ.8,390 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నాయి. నాలుగు ప్రధాన IPOలు కాకుండా, తొమ్మిది SME విభాగంలో మొదటి పబ్లిక్ ఇష్యూను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీల వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ IPO: బజాజ్ గ్రూప్ కంపెనీ ఇష్యూ సెప్టెంబర్ 9న ప్రారంభమై, సెప్టెంబర్ 11న ముగుస్తుంది. రూ. 6,560 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఈ కంపెనీ షేర్లు సెప్టెంబరు 16న BSE, NSEలో లిస్ట్ చేయబడతాయి. ఒక్కో షేరు ధర రూ. 66-70గా నిర్ణయించారు. లాట్ సైజు 214 షేర్లు.
టోలిన్స్ టైర్స్ IPO: రూ. 230 కోట్ల పరిమాణంలోని ఈ IPO సెప్టెంబర్ 9న ప్రారంభమై, సెప్టెంబర్ 11న ముగుస్తుంది. ఈ షేర్లు సెప్టెంబరు 16న BSE, NSEలో లిస్ట్ చేయబడతాయి. ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 215-226. లాట్ పరిమాణం 66 షేర్లు.
క్రాస్ IPO: రూ. 500 కోట్ల ఈ ఇష్యూ సెప్టెంబర్ 9న తెరవబడుతుంది. సెప్టెంబర్ 11 వరకు కొనసాగుతుంది. ఈ షేర్లు సెప్టెంబరు 16న BSE, NSEలో లిస్ట్ చేయబడతాయి. ఒక్కో షేరుకు రూ.228-240. లాట్ పరిమాణం 62 షేర్లు.
పీఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్ ఐపీఓ: దీని నుంచి రూ.1,100 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఈ ఇష్యూ కూడా సెప్టెంబర్ 10న తెరవబడుతుంది. సెప్టెంబర్ 12న ముగుస్తుంది. ఈ షేర్లు సెప్టెంబర్ 17న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్టవుతాయి. ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 456-480. లాట్ పరిమాణం 31 షేర్లు.
గజానంద్ ఇంటర్నేషనల్ IPO: ఇది సెప్టెంబర్ 9న ప్రారంభమై, సెప్టెంబర్ 11న ముగుస్తుంది. రూ. 20.65 కోట్ల ఇష్యూకి బిడ్డింగ్ ధర ఒక్కో షేరుకు రూ. 36 కాగా, లాట్ పరిమాణం 3000 షేర్లు. ఈ కంపెనీ సెప్టెంబర్ 16న NSE SMEలో జాబితా చేయబడవచ్చు.
షేర్ సమాధాన్ IPO: రూ. 24.06 కోట్ల పబ్లిక్ ఇష్యూ సెప్టెంబర్ 9న ప్రారంభమవుతుంది, సెప్టెంబర్ 11న ముగుస్తుంది, ఈ షేర్లను సెప్టెంబర్ 16న BSE SMEలో లిస్ట్ చేయవచ్చు. బిడ్డింగ్ కోసం ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 70-74. లాట్ పరిమాణం 1600 షేర్లు.
శుభశ్రీ బయోఫ్యూయల్స్ ఎనర్జీ IPO: ఇది కూడా సెప్టెంబర్ 9న ప్రారంభమవుతుంది. సెప్టెంబరు 11న ముగుస్తుంది. ఒక్కో షేరు ధర రూ. 113-119. లాట్ పరిమాణం 1200. రూ. 16.56 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. షేర్ల లిస్టింగ్ సెప్టెంబర్ 16న NSE SMEలో జరుగుతుంది.
ఆదిత్య అల్ట్రా స్టీల్ IPO: ఇది కూడా సెప్టెంబర్ 9న తెరవబడుతుంది. ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 59-62. లాట్ పరిమాణం 2000 షేర్లు. 45.88 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. IPO సెప్టెంబర్ 11న ముగుస్తుంది. సెప్టెంబర్ 16న షేర్లు NSE SMEలో జాబితా చేయబడతాయి.
Trafiksol ITS టెక్నాలజీస్ IPO: ఈ ఇష్యూ సెప్టెంబర్ 10న ప్రారంభమై, సెప్టెంబర్ 12న ముగుస్తుంది. IPO పరిమాణం రూ. 44.87 కోట్లు. ఈ షేర్లు సెప్టెంబర్ 17న BSE SMEలో లిస్ట్ కానున్నాయి. ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 66-70. లాట్ పరిమాణం 2000 షేర్లు.
SPP పాలిమర్స్ ఐపీఓ: రూ. 24.49 కోట్ల ఈ ఇష్యూ సెప్టెంబర్ 10న తెరవబడుతుంది. సెప్టెంబర్ 12 వరకు ఇందులో పెట్టుబడులు పెట్టవచ్చు. సెప్టెంబర్ 17న ఎన్‌ఎస్‌ఈ ఎస్‌ఎంఈలో ఈ షేర్లు లిస్ట్ చేయబడతాయి. బిడ్డింగ్ ధర ఒక్కో షేరుకు రూ.59. లాట్ పరిమాణం 2000 షేర్లు.
ఇన్నోమెట్ అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ IPO: రూ. 34.24 కోట్ల ఇష్యూ సెప్టెంబర్ 11న ప్రారంభమై, సెప్టెంబర్ 13న ముగుస్తుంది. బిడ్డింగ్ ధర ఒక్కో షేరుకు రూ. 100. లాట్ పరిమాణం 1200 షేర్లు. షేర్ల లిస్టింగ్ సెప్టెంబర్ 18న NSE SMEలో జరుగుతుంది.
ఎక్సలెంట్ వైర్స్ అండ్ ప్యాకేజింగ్ IPO: ఇది కూడా సెప్టెంబర్ 11న తెరవబడుతుంది. సెప్టెంబర్ 13న ముగుస్తుంది. ఈ ఇష్యూ ద్వారా రూ.12.60 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ IPO ముగిసిన తర్వాత, షేర్లు సెప్టెంబర్ 19న NSE SMEలో జాబితా చేయబడతాయి. బిడ్డింగ్ ధర ఒక్కో షేరుకు రూ. 90. లాట్ పరిమాణం 1600 షేర్లు.
ఎన్విరోటెక్ సిస్టమ్స్ ఐపీఓ: రూ. 30.24 కోట్లతో ఐపీఓ సెప్టెంబర్ 13న ప్రారంభం కానుంది. ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 53-56. లాట్ పరిమాణం 2000 షేర్లు. సెప్టెంబరు 17 వరకు బిడ్లు దాఖలు చేయవచ్చు. ఈ షేర్లు సెప్టెంబర్ 20న NSE SMEలో లిస్ట్ చేయబడతాయి. మరోవైపు గతవారం మొదలైన పలు కంపెనీల ఐపీఓలు కూడా ఈ వారం ముగియనున్నాయి.
ఇవి కూడా చదవండి:
Money Saving Plan: రిటైర్ మెంట్ వరకు రూ. 8 కోట్లు కావాలంటే.. నెలకు ఎంత సేవ్ చేయాలి..
Stock Market: వచ్చే వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది.. క్షీణిస్తుందా, పెరుగుతుందా..
Money Saving Tips: రోజు రూ.250 సేవ్ చేయండి.. ఇలా రూ.2 కోట్లు సంపాదించండి..
Read MoreBusiness News and Latest Telugu News