Stock Market: వచ్చే వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది.. నిఫ్టీ 25,500ను తాకుతుందా..
ABN , Publish Date - Aug 31 , 2024 | 05:54 PM
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం (ఆగస్టు 30)తో ముగిసిన వారంలో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు సరికొత్త రికార్డులను తాకాయి. ఇది సెన్సెక్స్-నిఫ్టీ కంటే తక్కువ పనితీరును కనబరిచింది. సెన్సెక్స్, నిఫ్టీ కూడా సరికొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అయితే వచ్చే వారం మార్కెట్ ఎలా ఉండబోతుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దేశీయ స్టాక్ మార్కెట్లు(stock market) శుక్రవారం(ఆగస్టు 30న) సరికొత్త గరిష్టాలతో ముగిశాయి. ఆగస్టు 30తో ముగిసిన వారంలో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు సరికొత్త రికార్డులను తాకాయి. ఇది సెన్సెక్స్-నిఫ్టీ కంటే తక్కువ పనితీరును కనబరిచింది. సెన్సెక్స్, నిఫ్టీ కూడా సరికొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచ సెంటిమెంట్ కారణంగా ర్యాలీ నడిచింది. అయితే వచ్చే సెప్టెంబర్ సమావేశంలో యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే సూచనలతోపాటు పలు అంశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే వారం స్టాక్ మార్కెట్ తీరు ఎలా ఉండబోతుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గత వారం
ఈ వారంలో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, బీఎస్ఈ లార్జ్‌క్యాప్, బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ వరుసగా 1.5 శాతం, 1.3 శాతం, 0.6 శాతం చొప్పున పెరిగాయి. ఈ క్రమంలో BSE సెన్సెక్స్ 82,637.03 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. 1.57 శాతం లేదా 1279.56 పాయింట్లు పెరిగి 82,365.77 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 ఇండెక్స్ కూడా 25,268.35 వద్ద కొత్త గరిష్టానికి చేరుకుంది. 412.75 పాయింట్లు లేదా 1.66 శాతం పెరిగి 25,235.9 వద్ద ముగిసింది. ఈ సమయంలోనే విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FIIs) రూ.19,139.76 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (DIIs) రూ.20,871.10 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు.
వచ్చే వారం మార్కెట్ ఎలా ?
నిఫ్టీ 25,000 పైన ఉన్నంత కాలం మార్కెట్ బలంగా ఉండే అవకాశం ఉందని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ నిపుణులు రూపక్ దే తెలిపారు. ఈ స్థాయి కంటే దిగువకు పడిపోవడం పెద్ద దిద్దుబాటుకు దారితీయవచ్చన్నారు. అంతేకాదు సమీప భవిష్యత్తులో నిఫ్టీ 25,500 స్థాయికి చేరే అవకాశం ఉందన్నారు.
రంగాల వారీగా
స్టాక్ మార్కెట్ తన బుల్లిష్ ట్రెండ్‌ను కొనసాగిస్తుందని ఆశిస్తున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నిపుణులు సిద్ధార్థ్ ఖేమ్కా తెలిపారు. వచ్చే వారంలో విడుదల చేయనున్న గ్లోబల్ మాక్రో డేటా దేశీయ ఈక్విటీలకు సూచనలను అందిస్తాయని తెలిపారు. నెలవారీ అమ్మకాల గణాంకాలను విడుదల చేయనున్న నేపథ్యంలో రంగాల వారీగా ప్రధాన దృష్టి ఆటోపైనే ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
మార్కెట్ ట్రెండ్
భారతీయ స్టాక్ మార్కెట్ ట్రెండ్ వచ్చే వారం సానుకూలంగా ఉంటుందని ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా అభిప్రాయపడ్డారు. నిఫ్టీ 25,000 పైన కొనసాగుతుందని, 25,300 వద్ద చిన్న అడ్డంకిని అధిగమించిన తర్వాత ఫ్రంట్‌లైన్ ఇండెక్స్ 25,550 నుంచి 25,600కి చేరుకోవచ్చన్నారు. నిఫ్టీకి 24,900 వద్ద కీలక మద్దతు ఉందని, 24,100 మార్క్ వద్ద సపోర్ట్ ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
ITR Refund: ఐటీఆర్ రీఫండ్ ఇంకా వాపసు రాలేదా.. అయితే ఇలా చేయండి
Telegram: మరికొన్ని రోజుల్లో టెలిగ్రామ్ యాప్ బ్యాన్?.. కారణాలివేనా..
Google Pay: గూగుల్ పే నుంచి కొత్తగా ఆరు ఫీచర్లు.. అవేంటంటే..
Vistara: ప్రయాణికులకు అలర్ట్.. ఈ విమాన టిక్కెట్స్ బుకింగ్ బంద్
Read More Business News and Latest Telugu News