Saving Tips: రూ. 50 వేల నెల జీతంతో.. ఇలా కోటి ఈజీగా సంపాదించండి
ABN , Publish Date - Jun 17 , 2024 | 01:08 PM
సాధారణంగా ఎవరికైనా కూడా కోటిశ్వరులు కావాలని ఉంటుంది. అయితే అనేక మందికి వారి వారి పరిస్థితులు, ఖర్చులు సహా పలు అంశాల నేపథ్యంలో కోటీశ్వరులు కాలేకపోతారు. కానీ సరైన ప్రణాళికతో నెలకు 50 వేల జీతం(50 thousand monthly salary) వచ్చే ఉద్యోగులు సులభంగా కోటీశ్వరులు కావచ్చు. అది ఎలానో ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా ఎవరికైనా కూడా కోటిశ్వరులు కావాలని ఉంటుంది. అయితే అనేక మందికి వారి వారి పరిస్థితులు, ఖర్చులు సహా పలు అంశాల నేపథ్యంలో కోటీశ్వరులు కాలేకపోతారు. కానీ సరైన ప్రణాళికతో నెలకు 50 వేల జీతం(50 thousand monthly salary) వచ్చే ఉద్యోగులు సులభంగా కోటీశ్వరులు కావచ్చు. అయితే అందుకోసం ఏం చేయాలి, ప్రతి నెల ఎంత మొత్తంలో పెట్టుబడి(investment) పెట్టాలి, అందుకోసం ఎంత సమయం పడుతుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే అందుకోసం దీర్ఘకాలికంగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP)తో పొదుపు చేయాల్సి ఉంటుంది. వాటిలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. దీనిలో మీరు క్రమం తప్పకుండా కొద్ది మొత్తంలో పెట్టుబడి పెడితే మీరు దీర్ఘకాలంలో కావాల్సిన మొత్తాన్ని పొందవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో అనేక మ్యూచువల్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ ఈక్విటీ మ్యూచువల్ నుంచి వచ్చే రాబడులు సాధారణంగా డెట్ లేదా హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ కంటే ఎక్కువగా ఉంటాయి.
ఇక మీరు కోటి రూపాయలు పొందాలంటే ప్రతి నెల మీ 50 వేల జీతంలో 15% అంటే రూ.7500 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడిగా పెట్టాలి. ఆ విధంగా మీరు 23 సంవత్సరాలపాటు మొత్తం రూ. 20,70,000 చెల్లిస్తే, మీకు 12% వార్షిక రాబడి చొప్పున రూ. 1,10,47,930 మొత్తం లభిస్తుంది. అంటే మీకు రూ. 89,77,930 లక్షలు అదనంగా లభిస్తాయి. అంతేకాదు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంది. ఒక వేళ మీరు మీ జీతంలో 12% వార్షిక రాబడిని ఆర్జించే మ్యూచువల్ ఫండ్‌లో ప్రతి నెల రూ. 10,000 పెట్టుబడిగా పెడితే మీరు 21 ఏళ్లలోనే రూ. రూ.1,13,86,742 కోట్లను ఆర్జించవచ్చు.
గమనిక: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి అనేది రిస్కుతో కూడిన వ్యవహారం. దీనిలో రిస్క్, లాభం కూడా ఉంటుంది. కాబట్టి మీరు పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తప్పకుండా తీసుకుని పెట్టుబడులు చేస్తే మంచిది.
ఇది కూడా చదవండి:
Next Week Ipos: ఇన్వెస్టర్లకు పండుగే పండుగ.. ఈ వారం ఏకంగా 9 ఐపీఓలు
ITR Filing: కొత్త పన్ను రేటు వచ్చేసింది.. మినహాయింపులు, లాస్ట్ డేట్ తెలుసా
For Latest News and Business News click here