Onion Prices: సామాన్యులకు గుడ్ న్యూస్.. ఉల్లి ధర ఎంత తగ్గిందో తెలుసా..
ABN , Publish Date - Nov 09 , 2024 | 01:51 PM
మధ్యతరగతి ప్రజలకు మంచివార్త వచ్చింది. గతంలో 100 రూపాయలకుపైగా ఉన్న ఉల్లి ధరలు ఇప్పుడు రూ. 50 లోపు చేరుకున్నాయి. అంతేకాదు మరికొన్ని చోట్ల అయితే కిలోకు రూ. 18కే సేల్ చేస్తున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
దేశంలో సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన ఉల్లి ధరలకు (onion prices) ఇప్పుడు బ్రేక్ పడింది. దేశంలోని అతిపెద్ద ఉల్లి మార్కెట్ అయిన మహారాష్ట్రలోని లాసల్‌గావ్‌లో ఉల్లి ధరలు నవంబర్ 4న కిలోకు రూ.47.70 ఉండగా, ఇప్పుడు అవి కాస్తా రూ. 21కి చేరుకున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో అయితే 20 రూపాయల కంటే తక్కువగా హోల్ సేల్ విధానంలో అమ్ముతుండటం విశేషం. నాసిక్ మండి నుంచి ఎర్ర ఉల్లిపాయలు ప్రధాన మార్కెట్‌లలోకి ప్రవేశించిన నేపథ్యంలో ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతేకాదు మరికొన్ని రోజుల్లో ఇంకా తగ్గుతాయని చెబుతున్నారు.
ఇంకొన్ని రోజుల్లో
దీంతోపాటు అల్వార్ నుంచి కొత్తగా పండించిన ఉల్లి ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌తో సహా కీలకమైన ఈశాన్య నగరాలకు చేరుకుంటున్నాయి. ఇది బహిరంగ మార్కెట్‌లలో ధరలను మరింత తగ్గిస్తుందని భావిస్తున్నారు. మరోవైపు ఢిల్లీ, ముంబై, లక్నో వంటి నగరాల్లో మాత్రం ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ. 40-60 పలుకుతోంది. ఈ ధరలు మరికొన్ని రోజుల్లో తగ్గాయని మార్కెట్ వర్గాలు అంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా ఉల్లి ధరలు తగ్గాయి. కిలోకు రూ. 20 లోపు పలుకుతోంది. ఇంకొన్ని చోట్ల 60 రూపాయలకు నాలుగు కేజీలు సేల్ చేస్తున్నారు. ఈ ధరలు ఆయా ప్రాంతాలను బట్టి మారుతుంటాయి.
ధరలు పెరిగినా కూడా..
మార్కెట్‌లో ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఎన్‌సీసీఎఫ్, నాఫెడ్ వంటి సహకార సంఘాలు మాత్రం పలు ప్రాంతాల్లో తక్కువ ధరకు ఉల్లిని పంపిణీ చేస్తున్నాయి. ఉదాహరణకు ఎన్‌సీసీఎఫ్, మొబైల్ వ్యాన్‌ల ద్వారా ఉల్లిపాయలను కిలోకు రూ. 25 చొప్పున విక్రయిస్తున్నాయి. అందుబాటులో ఉన్న నిల్వలను ఉపయోగించుకుంటుంది.
ఆహార పంపిణీ శాఖ
గత సంవత్సరం NCCF 2.9 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను సేకరించింది. నిర్దిష్ట కోటా లేకుండా ఈ సంవత్సరం ప్రభుత్వ డిమాండ్లను తీర్చడానికి సిద్ధంగా ఉంది. మార్కెట్ రేట్లను స్థిరీకరించడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా ఆహార పంపిణీ శాఖ కార్యక్రమాలను అమలు చేస్తోంది. అందులో భాగంగానే రాయితీలు ఇచ్చి పప్పులు, బియ్యం, ఉల్లి వంటి నిత్యావసర వస్తువులను వినియోగదారులకు చేరవేస్తున్నారు.
టమోటా ధరలు కూడా..
గతంలో ద్రవ్యోల్బణం సహా పంట ఉత్పత్తి కొరత కారణంగా ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఆ క్రమంలో పలు ప్రాంతాల్లో కిలోకు రూ.70 నుంచి రూ. 120 వరకు పలికాయి. ఇప్పుడు ఈ ధరలు ఒక్కసారిగా తగ్గడంతో వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు మరికొన్ని రోజుల్లో టమోటా ధరలు కూడా తగ్గుతాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
ఇవి కూడా చదవండి:
Personal Finance: రూ. 2 కోట్లు సంపాదించాలంటే రోజు ఎంత పొదుపు చేయాలి..
PPF Account: ఉపయోగించని మీ పీపీఎఫ్ ఖాతాను ఇలా యాక్టివేట్ చేసుకోండి..
Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..
Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..
Read More Business News and Latest Telugu News