PM Modi: సక్సెస్‌కు ఇంటిపేరు అవసరం లేదు.. జొమాటో సీఈవోపై మోదీ ప్రశంసలు..
ABN , Publish Date - May 22 , 2024 | 12:01 PM
జొమాటో సీఈవో దీపిందర్ గోయల్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసించారు. ప్రస్తుత భారత దేశంలో ఇంటిపేరుకు ఎలాంటి ప్రాముఖ్యత లేదని.. కష్టపడే తత్వం ఉంటే విజయం సాధించవచ్చని.. ఇంటిపేరుతో విజయం దక్కదన్నారు.
జొమాటో సీఈవో దీపిందర్ గోయల్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసించారు. ప్రస్తుత భారత దేశంలో ఇంటిపేరుకు ఎలాంటి ప్రాముఖ్యత లేదని.. కష్టపడే తత్వం ఉంటే విజయం సాధించవచ్చని.. ఇంటిపేరుతో విజయం దక్కదన్నారు.జొమాటో కంపెనీ ప్రారంభం.. తన ఎదుగుదలకు సంబంధించి ఇటీవల దీపిందర్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించారు. తాను ఏ విధంగా ఎదిగాను.. ఎంత కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నది గోయల్ ఇటీవల ఓ కార్యక్రమంలో వివరించారు. దానికి సంబంధించిన వీడియోను కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్ పూరి ట్వీట్ చేయగా.. ఆ వీడియో మోదీ స్పందించారు. ఈ కార్యక్రమంలో ఎంతోమంది అంకుర పరిశ్రమలు స్థాపించి విజయం సాధించిన వ్యక్తులు పాల్గొన్నారు. వారందరు తమ జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనలను పంచుకోగా.. వారందరి వీడియోలపై మోదీ స్పందిస్తూ ట్వీట్స్ చేశారు.
PM Modi: 'ఇండి' కూటమి పాపాలతో దేశం పురోగమించ లేదు: మోదీ
దీపిందర్ వీడియోలో ఏముంది..
జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ మాట్లాడుతూ.. 2008లో జొమాటోను ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. స్టార్టప్ ప్రారంభించాలనే ఆలోచన వచ్చిన వెంటనే తన తండ్రితో చెప్పానని.. అప్పుడు వెంటనే ఆయన స్పందిస్తూ నీ తండ్రి స్థాయి ఏమిటో తెలుసా.. ఇంత చిన్న ఊరిలో మనం ఏమి చేయలేమని చెప్పారని.. అయితే ప్రభుత్వ సహకారంతో తన కల సాకారమైందని గోయల్ తన వీడియో పేర్కొన్నారు. 2008లో సంస్థ ప్రారంభిచినప్పటినుంచి ఇప్పటివరకు లక్షలాది మందికి ఉపాధి కల్పించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ వీడియోను కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి ఎక్స్‌లో ట్వీట్ చేయగా.. దానిపై ప్రధాని స్పందించారు.
ఇంటిపేరు అవసరం లేదంటూ..
విజయం అనేది వ్యక్తి ఇంటిపేర్లతో ముడిపడి ఉండదని.. గోయల్ ఎంతోమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రేరణగా నిలుస్తారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నేటి భారతదేశంలో ఒకరి ఇంటిపేరుకు పట్టింపు లేదని.. కష్టపడి పనిచేయడం ముఖ్యమన్నారు. గోయల్ ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకమని.. ఎంతోమంది యువకులు తమ కలలను సాకారం చేసుకోవడానికి దీపిందర్ గోయల్ ప్రేరణగా నిలుస్తారని మోదీ ప్రశంసించారు. అంకుర పరిశ్రమలను ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు.
Lok Sabha elections 2024: ఐదో దశలో తగ్గిన పోలింగ్ శాతం.. 2019తో పోలిస్తే తగ్గిందా, పెరిగిందా?
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Latest National News and Telugu News