RBI: 97.82 శాతం రిటర్న్.. ఇంకా రూ.7 వేల కోట్లకుపైగా ప్రజల దగ్గరే
ABN , Publish Date - Jun 05 , 2024 | 10:32 AM
డినామినేషన్‌లో భాగంగా 97.82 శాతం రూ. 2 వేల నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి ప్రవేశించాయని, ఇంకా రూ. 7,755 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: డినామినేషన్‌లో భాగంగా 97.82 శాతం రూ. 2 వేల నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి ప్రవేశించాయని, ఇంకా రూ. 7,755 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వెల్లడించింది. మే 19, 2023న రూ. 2 వేల డినామినేషన్ నోట్లను చలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు RBI ప్రకటించింది. అప్పటి నుండి ఈ నోట్ల విలువ గణనీయంగా తగ్గింది.
మార్పిడి, డిపాజిట్ల కోసం..
2023 అక్టోబర్ 7 వరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంక్ బ్రాంచ్‌లలో రూ. 2 వేల నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి అవకాశం ఉంది. తదనంతరం మే 19, 2023 నుండి రిజర్వ్ బ్యాంక్ కి చెందిన19 ఇష్యూ కార్యాలయాలలో మార్పిడి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. అక్టోబరు 9 నుంచి ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలు పౌరులు, సంస్థల నుండి రూ.2 వేల నోట్లను స్వీకరించడం ప్రారంభించాయి. మరికొందరు పోస్ట్ ఆఫీస్ సేవలను ఉపయోగిస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాలు ఈ నోట్లను డిపాజిట్ చేయడానికి, మార్చుకోవడానికి సౌకర్యాలు కల్పిస్తున్నాయి. ఈ కార్యాలయాలు అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలలో ఉన్నాయి. 2016 నవంబర్‌లో అప్పటి వరకు ఉన్న రూ. వెయ్యి, రూ. 500 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తరువాత రూ. 2వేలు సహా మిగతా నోట్లుగా కొత్తవాటిని తీసుకొచ్చారు.
For Latest News and National News Click Here