Zomato: పుంజుకున్న జొమాటో.. రూ.2 కోట్ల నుంచి రూ.253 కోట్లకు..
ABN , Publish Date - Aug 01 , 2024 | 04:17 PM
5 ఏళ్ల క్రితం మొదలైన ఓ కంపెనీ ఇప్పుడు వేల కోట్ల టర్నోవర్ దిశగా కొనసాగుతోంది. అదే ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో(Zomato). ఈ సంస్థ తాజాగా మొదటి త్రైమాసికంలో ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ 2024 త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ లాభం రూ.2 కోట్ల నుంచి రూ.253 కోట్లకు (YoY) చేరుకోవడం విశేషం.
15 ఏళ్ల క్రితం మొదలైన ఓ కంపెనీ ఇప్పుడు వేల కోట్ల టర్నోవర్ దిశగా కొనసాగుతోంది. అదే ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో(Zomato). ఈ సంస్థ తాజాగా మొదటి త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది. ఈ క్రమంలో కంపెనీ లాభాలు అద్భుతమైన వృద్ధిని కనబరుస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ 2024 త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ లాభం రూ.2 కోట్ల నుంచి రూ.253 కోట్లకు (YoY) చేరుకోవడం విశేషం. దీంతో ఈ సంస్థ ఆదాయం రూ.2416 కోట్ల నుంచి రూ.4,206 కోట్లకు (YoY) పెరిగింది.
షేర్ ధర కూడా..
ఫలితాలు వచ్చిన తర్వాత జొమాటో స్టాక్(stock price)లో అకస్మాత్తుగా పెరుగుదల కనిపించింది. ఈ నేపథ్యంలో షేరు ధర 2.75% పైగా పెరిగి, రూ.235 స్థాయికి చేరుకుంది. గత సంవత్సరంతో పోల్చితే ఈ ఆహార అగ్రిగేటర్ ఆదాయాలు గ్రీన్‌లో వస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇ-కామర్స్ రంగం అధిక ద్రవ్యోల్బణం, డిమాండ్ ఒత్తిడితో కొట్టుమిట్టాడుతున్న సమయంలో కూడా జొమాటో ఆదాయం సంవత్సరానికి 74 శాతం పెరిగి రూ.4,206 కోట్లకు చేరుకోవడం విశేషం. గత ఏడాది ఇదే త్రైమాసికంలో జొమాటో తొలిసారిగా రూ. 2 కోట్ల నికర లాభాన్ని మాత్రమే ఆర్జించి, రూ. 2,416 కోట్ల ఆదాయానికి చేరుకుంది. ఇప్పుడు ఆదాయం దాదాపు డబుల్ అయ్యింది.
ఫ్యూచర్లో..
ఈ నేపథ్యంలో ఈ కంపెనీ స్టాక్ ధర మొమెంటం బలంగా ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. స్టాక్ నిరంతరం కొత్త రికార్డులను తాకిందని గుర్తు చేశారు. ఈ క్రమంలో నిరంతర అప్‌ట్రెండ్ కొనసాగుతోందన్నారు. ఈ క్రమంలో 226 వద్ద స్టాప్‌లాస్‌ను ఉంచడం ద్వారా ఇది 245-255 లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉందన్నారు. అంతేకాదు రానున్న రెండు మూడేళ్లలో ఈ స్టాక్ ధర రూ.500 చేరుకోవచ్చని మార్కెట్ వర్గాలు అంటున్నారు.
బిలియనీర్ క్లబ్‌లో
మరోవైపు ఈ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ ఇటివల బిలియనీర్ క్లబ్‌లో చేరారు. జోమాటో షేర్లలో పెరుగుదల నేపథ్యంలో ఈ ఘనతను సాధించారు. జొమాటో షేర్‌హోల్డింగ్ ప్రకారం CEO దీపిందర్ గోయల్ కంపెనీలో 36,94,71,500 షేర్లను కలిగి ఉన్నారు. ఇది కంపెనీలో 4.26 శాతం వాటాకు సమానం. జొమాటో 2008లో FoodieBayగా బైన్ & కంపెనీలో పనిచేసిన దీపిందర్ గోయల్, పంకజ్ చద్దాచే స్థాపించబడింది. ఈ వెబ్‌సైట్ రెస్టారెంట్ లిస్టింగ్ అండ్ రికమండేషన్ పోర్టల్‌గా ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ కంపెనీకి Zomatoగా పేరు పెట్టారు. 2011లో Zomato అధికారికంగా ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించింది.
గమనిక: మాకు లభించిన సమాచారం ఆధారంగా ఈ కంపెనీ వృద్ధి, షేర్ల గురించి తెలపడం జరుగుతుంది. కానీ ఈ స్టాక్ కొనుగోలు చేయాలని మాత్రం సిఫారసు చేయడం లేదు.
ఇవి కూడా చదవండి:
Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..
ITR Filling: ఐటీఆర్ దాఖలుకు నేడే లాస్ట్ ఛాన్స్.. గడువు పెంచుతారా, క్లారిటీ
Read More Business News and Latest Telugu News