Share News

Stock Market: స్టాక్ మార్కెట్ బూమ్.. మొదటిసారిగా 75000 దాటిన సెన్సెక్స్, నిఫ్టీ కూడా

ABN , Publish Date - Apr 09 , 2024 | 10:38 AM

భారత స్టాక్ మార్కెట్‌(Stock market)లో బుల్లిష్ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నేడు (ఏప్రిల్ 9న) సూచీలు మొత్తం గ్రీన్ ట్రేడ్ అవుతున్నాయి. దీంతో BSE సెన్సెక్స్(Sensex) తొలిసారిగా 75,000 మార్క్‌ను దాటేసింది. మరోవైపు నిఫ్టీ(Nifty) కూడా 22,700 స్థాయిని బద్దలు కొట్టి సరికొత్త గరిష్టానికి చేరుకుంది.

Stock Market: స్టాక్ మార్కెట్ బూమ్.. మొదటిసారిగా 75000 దాటిన సెన్సెక్స్, నిఫ్టీ కూడా
bse Sensex crossed 75000

భారత స్టాక్ మార్కెట్‌(Stock market)లో బుల్లిష్ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నేడు (ఏప్రిల్ 9న) సూచీలు మొత్తం గ్రీన్ ట్రేడ్ అవుతున్నాయి. దీంతో BSE సెన్సెక్స్(Sensex) తొలిసారిగా 75,000 మార్క్‌ను దాటేసింది. మరోవైపు నిఫ్టీ(Nifty) కూడా 22,700 స్థాయిని బద్దలు కొట్టి సరికొత్త గరిష్టానికి చేరుకుంది. ఈ క్రమంలో బీఎస్‌ఈ 30 షేర్ల సెన్సెక్స్ 381.78 పాయింట్లు పెరిగి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 75,124.28 పాయింట్లకు చేరుకోగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 99 పాయింట్లు పెరిగి 22,765.30 వద్ద రికార్డు స్థాయికి చేరుకుంది.


ఈ క్రమంలో సెన్సెక్స్ లిస్టెడ్ కంపెనీల్లో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టాటా మోటార్స్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, లార్సెన్ అండ్ టూబ్రో షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీలు 0.3 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేశాయి. నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌తో సహా అన్ని రంగాల్లో కొనుగోళ్లు జోరుగా సాగడంతో మార్కెట్ లాభాల్లో కొనసాగుతుంది.


BSE సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 16 పెరుగుదలతో ట్రేడవుతుండగా, 14 షేర్లు క్షీణతతో ట్రేడవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలోని 50 స్టాక్స్‌లో 28 స్టాక్‌లు లాభాల్లో ట్రేడవుతుండగా, 22 స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టీ బ్యాంక్ కూడా రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది. ప్రారంభ నిమిషాల్లోనే అది 48,800 దాటింది. ఆ తర్వాత అది 48,812 వద్ద కొత్త శిఖరాన్ని తాకింది. బ్యాంక్ నిఫ్టీలో ట్రేడింగ్ ఎక్కువగా కనిపించింది. దీనికి PSU బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకుల నుంచి మంచి సపోర్ట్ లభించింది. ఈ క్రమంలో BSE మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ 401.82 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. నిన్న ఇది మొదటిసారిగా BSE mcap 400 లక్షల కోట్ల రూపాయలను దాటింది.


ఇవి కూడా చదవండి:

Bike: మీ బైక్ పెట్రోల్ ఎక్కువ తాగుతుందా.. అయితే ఈ తప్పులు చేయకండి


Money Management: 7 మనీ మేనేజ్‌మెంట్ టిప్స్.. మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోండిలా

మరిన్ని బిజినెస్ వార్తల కోసం

Updated Date - Apr 09 , 2024 | 10:52 AM