Stock Market Updates: వారంతంలో స్టాక్ మార్కెట్ల దూకుడు..సెన్సెక్స్ 670 పాయింట్లు జంప్
ABN , Publish Date - Jan 12 , 2024 | 11:42 AM
దేశీయ స్టాక్ మార్కెట్లు వారంతంలో మంచి లాభాల్లో కొనసాగుతున్నాయి. ఐటీ కంపెనీల సానుకూల ఫలితాలతో శుక్రవారం స్టాక్ మార్కెట్లు అద్భుతమైన వృద్ధితో మొదలయ్యాయి. ఈ క్రమంలో మార్కెట్‌లోని ప్రధాన సూచీలు గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
దేశీయ స్టాక్ మార్కెట్లు వారంతంలో మంచి లాభాల్లో కొనసాగుతున్నాయి. ఐటీ కంపెనీల సానుకూల ఫలితాలతో శుక్రవారం స్టాక్ మార్కెట్లు అద్భుతమైన వృద్ధితో మొదలయ్యాయి. ఈ క్రమంలో మార్కెట్‌లోని ప్రధాన సూచీలు గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో BSE సెన్సెక్స్ ఉదయం 11.30 గంటలకు 675 పాయింట్ల లాభంతో 72390 స్థాయిని దాటింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 182 పాయింట్లు పెరిగి 21,829 స్థాయిల వద్ద ట్రేడవుతోంది. దీంతోపాటు బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు కూడా 274, 174 పాయింట్ల వృద్ధిలో ట్రేడ్ అవుతున్నాయి.
మూడవ త్రైమాసిక ఫలితాల తర్వాత సెన్సెక్స్ 30 ప్యాక్‌లో ఇన్ఫోసిస్, టిసిఎస్ వరుసగా 6 శాతం, 4 శాతం లాభాలతో టాప్ గెయినర్లుగా నిలిచాయి. విప్రో, టెక్ మహీంద్రా, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ కూడా 1-2 శాతం మధ్య వృద్ధి చెందాయి. మరోవైపు హిందుస్థాన్ యూనిలీవర్ 1 శాతం పడిపోయింది. నెస్లే, మహీంద్రా & మహీంద్రా, రిలయన్స్ ఇతర షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, ONGC, TCS టాప్ 5 లాభాల్లో కొనసాగుతుండగా..M&M, సిప్లా, బజాజ్ ఫిన్‌సర్వ్, దివిస్ ల్యాబ్స్, టైటాన్ కంపెనీ స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉన్నాయి.