Stock Markets: వారాంతంలో నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. టాప్ 5 లాసింగ్ స్టాక్స్
ABN , Publish Date - Aug 23 , 2024 | 10:20 AM
దేశీయ స్టాక్ మార్కెట్లు (stock markets) వారాంతంలో శుక్రవారం (ఆగస్టు 23న) ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. మొదట నష్టాలతో మొదలై, మళ్లీ లాభాల్లోకి వచ్చి ఉదయం 10.13 గంటల నాటికి సెన్సెక్స్ 78 పాయింట్లు కోల్పోయి 81,020 స్థాయిలో ఉండగా, నిఫ్టీ 10 పాయింట్లు తగ్గి 24,800 పరిధిలో ఉంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు (stock markets) వారాంతంలో శుక్రవారం (ఆగస్టు 23న) ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. మొదట నష్టాలతో మొదలై, మళ్లీ లాభాల్లోకి వచ్చి ఉదయం 10.13 గంటల నాటికి సెన్సెక్స్ 78 పాయింట్లు కోల్పోయి 81,020 స్థాయిలో ఉండగా, నిఫ్టీ 10 పాయింట్లు తగ్గి 24,800 పరిధిలో ఉంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 33 పాయింట్లు దిగువకు పయనించి 50,956 స్థాయిలో కొనసాగుతుంది. మరోవైపు నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 113 పాయింట్లు నష్టపోయి 58,731 స్థాయిలో కొనసాగుతుంది. అయితే అంతర్జాతీయంగా కొనసాగుతున్న ప్రతికూల ధోరణులు సహా పలు అంశాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
టాప్ 5 స్టాక్స్
ఈ నేపథ్యంలో గ్రాసిమ్, టైటాన్ కంపెనీ, LTIMindtree, విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉండగా, బజాజ్ ఆటో, కోల్ ఇండియా, అపోలో హాస్పిటల్, BPCL, హీరో మోటోకార్ప్ సంస్థల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్ల పతనంతో ఐటీ షేర్లలో బలహీనత నెలకొంది. ఈ సంవత్సరం ఫెడ్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వడ్డీ రేట్ల తగ్గింపు గురించి ఆగస్ట్ 22 నుంచి ఆగస్ట్ 24 మధ్య జాక్సన్ హోల్ సింపోజియంలో US ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ నిర్ణయంపై పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నైకా, అంబుజా
శుక్రవారం Nykaa మాతృ సంస్థ FSN ఈ కామర్స్ వెంచర్స్ షేర్లు BSEలో 4% పెరిగి రోజువారీ గరిష్ట స్థాయి రూ.218.75కి చేరుకున్నాయి. ఈ పెరుగుదల ప్రీ మార్కెట్ బ్లాక్ డీల్‌ను అనుసరించింది. దీనిలో పెట్టుబడిదారులు హరీందర్‌పాల్ సింగ్ బంగా, అతని భార్య ఇంద్ర బంగా కంపెనీలో 1.4% వాటాను విక్రయించారని తెలుస్తోంది. శుక్రవారం గౌతమ్ అదానీ గ్రూప్ అంబుజా సిమెంట్స్‌లో 2.8% వాటాను సుమారు రూ. 4,200 కోట్లకు ప్రీ మార్కెట్ బ్లాక్ డీల్‌లో విక్రయించింది. ఆ క్రమంలో షేరు 4 శాతం పెరిగి రూ.659.70కి చేరుకుంది.
అంతర్జాతీయంగా..
ఆసియా మార్కెట్లలో బెంచ్‌మార్క్ సూచీలు చాలా వరకు తగ్గాయి. ఈ క్రమంలో జపాన్‌కు చెందిన నిక్కీ 225 0.15 శాతం క్షీణించి 38,150 వద్ద ట్రేడవుతోంది. ఆస్ట్రేలియా ASX 200 దాదాపు 0.4 శాతం క్షీణించింది. హాంకాంగ్ HSI 0.34 శాతం తక్కువగా ఉంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 177.71 పాయింట్లు లేదా 0.43 శాతం క్షీణించి 40,712.78 వద్దకు చేరుకోగా, S&P 500 50.21 పాయింట్లు లేదా 0.89 శాతం నష్టపోయి 5,570.64 స్థాయికి చేరుకుంది. నాస్డాక్ కాంపోజిట్ 299 శాతం లేదా 3.6 పాయింట్లకు పైగా పడిపోయింది.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: సెప్టెంబర్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్నంటే.. గణేష్ చతుర్థి సహా..
Tourist Place: వీకెండ్ విజిట్‌కు బెస్ట్ ప్లేస్ .. ట్రేక్కింగ్, కాఫీ తోటలతోపాటు..
Multibagger Stock: ఒకప్పుడు ఈ స్టాక్ ధర రూ.1.80.. ఇప్పుడు రూ.357.. ఇన్వెస్టర్లకు కోట్లలో లాభం
Read More Business News and Latest Telugu News