Share News

Stock Market: వచ్చే వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది.. క్షీణిస్తుందా, పెరుగుతుందా..

ABN , Publish Date - Sep 07 , 2024 | 06:22 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) గత శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఈ నేపథ్యంలో మదుపర్ల దృష్టి మొత్తం వచ్చే సోమవారం మార్కెట్‌పై పడింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 9న మార్కెట్ క్షీణిత కొనసాగుతుందా లేదా రికవరీ ఉంటుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రేడ్ నిపుణులు ఏం చెప్పారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Stock Market: వచ్చే వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది.. క్షీణిస్తుందా, పెరుగుతుందా..
next week stock market

మదుపర్లు ఇప్పుడు వచ్చే వారం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే గత శుక్రవారం (సెప్టెంబర్ 6న) నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు ఒక శాతానికంటే ఎక్కువ నష్టపోయాయి. 25000-25100 మద్దతు కూడా పని చేయలేదు. దీంతో దాదాపు రూ.6 లక్షల కోట్ల మార్కెట్(stock market) క్యాప్ తుడిచిపెట్టుకుపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సెప్టెంబర్ 9న స్టాక్ మార్కెట్ నష్టాల్లోనే కొనసాగుతుందా లేదా రికవరీ అవుతుందా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


రికవరీ ఛాన్సుందా

బలహీనమైన గ్లోబల్ సిగ్నల్స్, రెగ్యులేటరీ సవాళ్లే మార్కెట్ క్షీణతకు కారణమని SAS ఆన్‌లైన్ CEO, వ్యవస్థాపకుడు శ్రేయ్ జైన్ అన్నారు. US ఉపాధి డేటా బయటకు రాకముందే, పెట్టుబడిదారులు రికార్డు స్థాయి ప్రాఫిట్ బుకింగ్‌ను ఎంచుకున్నారని వెల్లడించారు. ఈ క్రమంలో నిఫ్టీని పరిశీలిస్తే అది 20 రోజుల ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ (DEMA) కంటే దిగువకు వెళ్లిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇది మరింత క్షీణతను సూచిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 50 DEMA ప్రకారం 24,500 క్లిష్టమైన మద్దతు ఉందన్నారు. ఈ పరిణామాల దృష్ట్యా దూకుడు వ్యాపార వ్యూహాలను నివారించడం, ఇప్పటికే ఉన్న స్థానాలపై కఠినమైన స్టాప్ లాస్‌లను వర్తింపజేసుకోవడం మేలని తెలిపారు.


స్వల్ప కాలంలో

వచ్చే వారంలో మార్కెట్ అస్థిరత సూచిక INDIA VIXలో 12.97% జంప్ చేసిందని మెహతా ఇన్వెస్ట్‌మెంట్ ఇంటర్మీడియట్స్ లిమిటెడ్ AVP టెక్నికల్ అండ్ డెరివేటివ్స్ రీసెర్చ్ హృషికేశ్ యెడ్వే అన్నారు. ఈ నేపథ్యంలో రోజువారీ చార్ట్‌లో నిఫ్టీ 21 రోజుల ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ (DEMA) కంటే దిగువన ముగిసిందన్నారు. ఇది మరింత బలహీనతను సూచిస్తుందని తెలిపారు. ఈ క్రమంలో 24,480 వద్ద సపోర్ట్ ఉందన్నారు. స్వల్పకాలంలో మార్కెట్లో ఏదైనా బౌన్స్ ప్రాఫిట్ బుకింగ్‌కు అవకాశం ఉందని వెల్లడించారు.


గ్యాప్ డౌన్‌తో

ఇక బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడితే ఇది శుక్రవారం గ్యాప్-డౌన్‌తో ప్రారంభమైందన్నారు. ప్రతికూల ముగింపు 50,577 స్థాయిలో ఉంది. సాంకేతికంగా ఈ సూచిక రోజువారీ చార్ట్‌లో రెడ్ జోన్‌లో ఉందని పేర్కొన్నారు. ఇది భవిష్యత్తుకు ప్రతికూల సంకేతాలను కూడా ఇస్తుందని ట్రేడ్ నిపుణులు అన్నారు. ఈ క్రమంలో 50 రోజుల ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ (DEMA) 50,940 నిరోధకతను కలిగి ఉందని, 50,940 పరిధిలో ఏదైనా బౌన్స్‌ ప్రాఫిట్ బుకింగ్‌ ఛాన్స్ ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి:

BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కట్టడికి బీఎస్ఎన్ఎల్ పెద్ద ప్లాన్.. టాటా సపోర్ట్‌తో ఇక..


Money Saving Tips: రోజు రూ.250 సేవ్ చేయండి.. ఇలా రూ.2 కోట్లు సంపాదించండి..


Read MoreBusiness News and Latest Telugu News

Updated Date - Sep 07 , 2024 | 06:24 PM