Next Week Stock Market: వచ్చే వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది.. ట్రెండ్ కొనసాగుతుందా..
ABN , Publish Date - Sep 21 , 2024 | 01:41 PM
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం రికార్డు స్థాయి లాభాలతో ముగిశాయి. ఈ నేపథ్యంలో మదుపర్లు వచ్చే వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుందనే ఆసక్తితో ఉన్నారు. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్లో అదే పాజిటివ్ ట్రెండ్ కొనసాగుతుందా, లేదా లాభాల నుంచి నష్టాల వైపు దూసుకెళ్తుందా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
అగ్రరాజ్యం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు సహా పలు అంశాల కారణంగా భారత స్టాక్ మార్కెట్(stock market) వారంలో చివరి రోజైన సెప్టెంబర్ 20న రికార్డు స్థాయికి చేరింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 1380.24 పాయింట్ల జంప్‌తో 84,565.04 వద్ద ఆల్ టైమ్ హైకి చేరుకుంది. అదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) నిఫ్టీ కూడా 375.15 పాయింట్లు పుంజుకుని 25,686.90 సరికొత్త ఆల్‌టైమ్ గరిష్టానికి చేరింది. చివరి రోజు ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో లిస్టయిన 30 కంపెనీల్లో 26 కంపెనీల షేర్లు భారీ లాభాలను ఆర్జించాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలో 50 కంపెనీల్లో 44 షేర్లు లాభాల్లో ముగిశాయి. దీంతో మదుపర్లు శుక్రవారం ఒక్కరోజే 6 లక్షల కోట్లకుపైగా లాభాలను దక్కించుకున్నారు.
ఈ షేర్లలో
ఈ నేపథ్యంలో వచ్చే వారం కూడా భారత స్టాక్ మార్కెట్లో ఇదే ట్రెండ్ కొనసాగుతుందా, లేదా లాభాల నుంచి నష్టాల వైపు దూసుకెళ్తుందా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. దేశీయ స్టాక్ మార్కెట్ ప్రస్తుతం బుల్లిష్‌గా ఉన్న నేపథ్యంలో వచ్చే సోమవారం కొన్ని గంటలపాటు స్టాక్ ఇండెక్స్ 25,800పైన ఉంటే సెంటిమెంట్ మరింత మెరుగుపడవచ్చని ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా అభిప్రాయపడ్డారు. ఆ క్రమంలో 26,300 నుంచి 26,500 వరకు కొనసాగే ఛాన్స్ ఉందని బగాడియా అన్నారు. దీంతోపాటు కొనుగోలు చేయాల్సిన షేర్లలో భారతీ ఎయిర్‌టెల్, నెస్లే ఇండియా, అదానీ పోర్ట్స్ ఉన్నాయని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం..
బ్యాంక్ నిఫ్టీ
ఇక నిఫ్టీ రోజువారీ చార్ట్‌లో బుల్లిష్ ట్రెండ్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ధరల కదలిక తర్వాత పైకి బలమైన బ్రేక్‌అవుట్‌ను సూచిస్తుందన్నారు. ఆ క్రమంలో 25,500 -25,300 మధ్య సపోర్ట్ స్థాయి ఉన్నట్లు తెలిపారు. 26,000 నుంచి 26,250 పరిధిలో నిరోధం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
మూడు సెషన్ల నుంచి
మరోవైపు బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ప్రస్తుతం ఇది సానుకూల ధోరణిని కనబరుస్తోంది. గడిచిన మూడు సెషన్ల నుంచి బ్యాంక్ నిఫ్టీ పటిష్టంగా కొనసాగి గ్రీన్ క్యాండిల్‌ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో 54,000 నుంచి 54,500 మధ్య నిరోధం ఉంటుందని, 53,000 నుంచి 52,800 పరిధిలో సపోర్ట్ లభిస్తుందని అంచనాలున్నాయి. అయితే ఈ సూచీలు గ్లోబల్ మార్కెట్ల ట్రెండ్, దేశ ఆర్థిక నిర్ణయాలపై ఆధారపడి మారుతూ ఉంటాయనేది గమనించాలి.
గమనిక: ఈ సమాచారం ప్రకారం ఇలాగే స్టాక్ మార్కెట్ ఉంటుందని కాదు. ఆయా సమయం, నిర్ణయాలను బట్టి స్టాక్ మార్కెట్ ట్రెండ్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. కాబట్టి పెట్టుబడులు చేసే విషయంలో జాగ్రత్త వహించాలి.
ఇవి కూడా చదవండి:
Customers: జియో, ఎయిర్ టెల్, వీఐలకు షాకిచ్చిన కస్టమర్లు.. బీఎస్ఎన్ఎల్‌కు లాభం
iPhone 16: ఐఫోన్ 16కి విపరీతమైన క్రేజ్.. డే1 సేల్స్ ఎలా ఉన్నాయంటే..
Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే
Money Saving Plan: రిటైర్ మెంట్ వరకు రూ. 8 కోట్లు కావాలంటే.. నెలకు ఎంత సేవ్ చేయాలి..
Read MoreBusiness News and Latest Telugu News