Share News

Stock Market: లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు.. సరికొత్త గరిష్టాలకు సెన్సెక్స్, నిఫ్టీ

ABN , Publish Date - Sep 23 , 2024 | 10:22 AM

దేశీయ ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ సోమవారం లాభాలతో మొదలయ్యాయి. గరిష్ట స్థాయిలను తాకిన తర్వాత, ఇతర ఆసియా మార్కెట్లు కూడా లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. అయితే టాప్ స్టాక్స్ వంటి వివరాలను ఇక్కడ చుద్దాం.

Stock Market: లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు.. సరికొత్త గరిష్టాలకు సెన్సెక్స్, నిఫ్టీ
Stock market updates

దేశీయ స్టాక్ మార్కెట్లు (stock markets) నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ గత వారం రికార్డు స్థాయిల్లో ప్రారంభమై లాభాలను పొడిగించడంతో ఈరోజు(సెప్టెంబర్ 23న) కూడా భారత స్టాక్ మార్కెట్ సరికొత్త గరిష్టాలకు చేరుకుంది. ఈ క్రమంలో ఆటోమొబైల్, బ్యాంకింగ్ స్టాక్స్ బెంచ్‌మార్క్‌లలో ర్యాలీ కనిపించింది. సెన్సెక్స్ 84,843 వద్ద చారిత్రక మైలురాయిని చేరుకోగా, నిఫ్టీ 50 తాజా గరిష్ట స్థాయి 25,903ని తాకింది.

ఉదయం 10.15 గంటలకు సెన్సెక్స్ 290 పాయింట్లు పెరిగి 84,835 వద్ద, నిఫ్టీ 118 పాయింట్లు పెరిగి 25,908 స్థాయిలో ఉన్నాయి. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 165 పాయింట్లు లాభపడి 53955 వద్ద ఉండగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 352 పాయింట్లు వృద్ధి చెంది 60560 పరిధిలో ట్రేడైంది.


టాప్ స్టాక్స్

ఈ క్రమంలో ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, పవర్ గ్రిడ్, ఇన్ఫోసిస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లతో సహా బీఎస్‌ఈ సెన్సెక్స్‌లోని 30 స్టాక్స్‌లో ఆరు మాత్రమే రెడ్‌లో ట్రేడవుతుండగా, భారతీ ఎయిర్‌టేల్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్‌బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా స్టీల్ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. సెక్టోరల్ ఇండెక్స్‌లలో ఫార్మా టాప్ గెయినర్ (1.02 శాతం), నిఫ్టీ ఆటో (0.87 శాతం), రియల్టీ (0.85 శాతం)తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.


ఇతర మార్కెట్లు

జపాన్‌లోని మార్కెట్లకు సోమవారం పబ్లిక్ హాలిడే కాగా, ఆస్ట్రేలియా S&P/ASX 200 0.43 శాతం అధికంగా మొదలైంది. దక్షిణ కొరియా కోస్పి 0.15 శాతం పడిపోయింది. హాంగ్ కాంగ్ హ్యాంగ్ సెంగ్ ఇండెక్స్ ఫ్యూచర్స్ 18,199 వద్ద ఉన్నాయి. ఇది HSI చివరి ముగింపు 18,258.57 కంటే తక్కువగా ఉంది. చైనా CSI 300 ఫ్యూచర్లు 3,183.8 వద్ద ఉన్నాయి. ఇది వారి చివరి ముగింపు 3,201.05 కంటే తక్కువ. మరోవైపు వాల్ స్ట్రీట్ శుక్రవారం ఫ్లాట్‌గా ముగిసింది. ఆ క్రమంలో డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.09 శాతం పెరిగి 42,063.36 వద్ద ముగిసింది. S&P 500 0.19 శాతం క్షీణించి 5,702.55 స్థాయికి చేరుకుంది.


ఇవి కూడా చదవండి:

Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం..

Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Customers: జియో, ఎయిర్ టెల్, వీఐలకు షాకిచ్చిన కస్టమర్లు.. బీఎస్ఎన్ఎల్‌కు లాభం

Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే

Read MoreBusiness News and Latest Telugu News

Updated Date - Sep 23 , 2024 | 11:05 AM