Stock Market: వరుస నష్టాలకు బ్రేక్..భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ABN , Publish Date - May 31 , 2024 | 10:32 AM
గత రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. వారం చివరి ట్రేడింగ్ రోజైన నేడు (మే 31న) శుక్రవారం స్టాక్ మార్కెట్(stock market)లో జోరు కనిపించింది. శుక్రవారం బెంచ్‌మార్క్ సూచీలు అన్ని లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో BSE సెన్సెక్స్ ఉదయం 10.15 గంటలకు 226 పాయింట్ల లాభంతో 74,111.04 వద్ద ట్రేడైంది.
గత రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. వారం చివరి ట్రేడింగ్ రోజైన నేడు (మే 31న) స్టాక్ మార్కెట్(stock market)లో జోరు కనిపించింది. శుక్రవారం బెంచ్‌మార్క్ సూచీలు అన్ని లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో BSE సెన్సెక్స్ ఉదయం 10.15 గంటలకు 226 పాయింట్ల లాభంతో 74,111.04 వద్ద ట్రేడైంది. NSE నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 22,540.95 స్థాయికి చేరుకుంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 46 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 122 పాయింట్లు నష్టపోయింది.
నేటి నుంచి భారత స్టాక్ మార్కెట్లో(indian stock market) జూన్ సిరీస్ ప్రారంభం కానుంది. మరోవైపు ప్రపంచ మార్కెట్‌లోనూ ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందు మార్కెట్ మరోసారి పెరగవచ్చని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అదానీ ఎంటర్‌ప్రైస్, M&M, లార్సెన్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 గెయినర్లుగా ఉండగా, ఇన్ఫోసిస్, LTIMindtree, భారతి ఎయిర్‌టెల్, సిప్లా, TATA కన్జూమర్స్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 లూజర్‌లుగా నిలిచాయి.
మరోవైపు ఆసియా-పసిఫిక్(Asia–Pacific) ప్రాంతం అంతటా మార్కెట్లు కూడా పాజిటివ్ ధోరణిలోనే కొనసాగుతున్నాయి. 49.5కి పడిపోయిన తర్వాత షాంఘై కాంపోజిట్ 0.10 శాతం లాభపడింది. హాంగ్ సెంగ్ 1 శాతం కంటే ఎక్కువ, కోస్పి 0.72 శాతం, ASX 200 0.50 శాతం, నిక్కీ 0.36 శాతం పెరిగాయి. US మార్కెట్లు దిగువన ముగిశాయి. నాస్‌డాక్ 1.08 శాతం పతనం కాగా, డౌ జోన్స్, S&P 500 వరుసగా 0.86 శాతం, 0.60 శాతం పడిపోయాయి.
ఇది కూడా చదవండి:
Investment Plan: 10 ఏళ్లలో టాప్ 5 ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ వచ్చాయంటే
CIBIL Score: సిబిల్ స్కోర్ ఎక్కువ సార్లు చెక్ చేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు
Read Latest Business News and Telugu News