Stock Market: సెన్సెక్స్ 920 పాయింట్లు జంప్.. మరోవైపు నిఫ్టీ కూడా..
ABN , Publish Date - Jul 12 , 2024 | 11:34 AM
దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఉదయం స్వల్ప లాభాలతో మొదలై, తర్వాత క్రమంగా సరికొత్త గరిష్టాలకు చేరుకున్నాయి. ఈ క్రమంలో ఉదయం 11.15 గంటల నాటికి బీఎస్‌ఈ సెన్సెక్స్(sensex) 1.24 శాతం జంప్ చేసి 80,893.51 వద్ద సరికొత్త రికార్డు స్థాయిని తాకింది. మరోవైపు నిఫ్టీ(nifty) 50 కూడా 1.13 శాతం పెరిగి 24,592.20 వద్ద కొత్త గరిష్టాన్ని తాకింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఉదయం స్వల్ప లాభాలతో మొదలై, తర్వాత క్రమంగా సరికొత్త గరిష్టాలకు చేరుకున్నాయి. ఈ క్రమంలో ఉదయం 11.15 గంటల నాటికి బీఎస్‌ఈ సెన్సెక్స్(sensex) 1.24 శాతం జంప్ చేసి 80,893.51 వద్ద సరికొత్త రికార్డు స్థాయిని తాకింది. మరోవైపు నిఫ్టీ(nifty) 50 కూడా 1.13 శాతం పెరిగి 24,592.20 వద్ద కొత్త గరిష్టాన్ని చేరింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ కూడా 368 పాయింట్లు పెరిగి 52,369 స్థాయికి చేరుకోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 కూడా 189 పాయింట్లు లాభపడి 57,337 పరిధిలోకి చేరుకుంది. అయితే అంతర్జాతీయంగా నెలకొన్న అనుకూల ధోరణులు సహా పలు అంశాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
టాప్ 5
ఈ క్రమంలో ప్రస్తుతం TCS, LTIMindtree, విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా కంపెనీల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉండగా, దివిస్ ల్యాబ్స్, మారుతి సుజుకి, ఏషియన్ పెయింట్స్, అపోలో హాస్పిటల్, హిండాల్కో సంస్థల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టీ స్మాల్‌క్యాప్ 0.68 శాతం ఎగబాకగా, మిడ్‌క్యాప్ 0.38 శాతం లాభపడింది. రంగాల వారీగా చూస్తే, నిఫ్టీ ఐటీ 3.41 శాతం లాభంతో ముందుండగా, మీడియా 2.79 శాతం పుంజుకుంది.
TCS స్టాక్
ఈరోజు TCS స్టాక్ ధర దాదాపు 3 శాతం పెరిగి రూ. 4,033కి చేరుకుంది. దీంతో సెన్సెక్స్ 30 స్టాక్‌లలో టాప్ గెయినర్‌గా నిలిచింది. ఇన్ఫోసిస్ 1.5 శాతం పుంజుకుని రూ.1,680కి చేరింది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఓవర్‌నైట్ ట్రేడింగ్‌లో Infy ADR 2.7 శాతం పెరిగింది. మరోవైపు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో ఇంట్రాడే డీల్స్‌లో ఆజాద్ ఇంజనీరింగ్ షేర్లు 5 శాతంతో అప్పర్ సర్క్యూట్‌లో ఒక్కో షేరుకు రూ. 1,779.75 వద్ద లాక్ అయ్యాయి. జర్మనీలోని సిమెన్స్ ఎనర్జీ గ్లోబల్ GmbH & Co. KG నుంచి 5 ఏళ్ల పాటు ఆర్డర్‌ను పొందినట్లు కంపెనీ ప్రకటించిన తర్వాత షేర్ ధర ఒక్కసారిగా పెరిగింది.
ఇది కూడా చదవండి:
Anant-Radhika Wedding: అనంత్-రాధికల పెళ్లి ముహుర్తం ఎప్పుడు.. మొత్తం ఖర్చు ఎంతంటే..
Warranty vs Guarantee: మీకు వారంటీ, గ్యారెంటీ మధ్య తేడా తెలుసా.. లేదంటే నష్టపోతారు జాగ్రత్త..!
ఇంధన రంగంలో రూ.8.4 లక్షల కోట్ల పెట్టుబడి అవకాశాలు
For Latest News and Business News click here