Stock Markets: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. మదుపర్ల లక్షల కోట్లు ఆవిరి..
ABN , Publish Date - Dec 19 , 2024 | 02:57 PM
భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ఉన్నాయి. ఈ క్రమంలో ప్రధాన సూచీలు మొత్తం నష్టాల వైపే మొగ్గుచూపుతున్నాయి. ఈ క్రమంలో సూచీలు ఏ మేరకు నష్టపోయాయనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

దేశీయ స్టాక్ మార్కెట్లు (stock markets) గురువారం (డిసెంబర్ 19) భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. నేడు మార్కెట్‌లో విపరీతమైన ఒత్తిడి కనిపిస్తోంది. ఉదయం సెన్సెక్స్-నిఫ్టీ భారీ పతనంతో ప్రారంభమైంది. ఈ క్రమంలో మధ్యాహ్నం 2. 50 గంటలకు సెన్సెక్స్ 969 పాయింట్లు పతనమైంది, మరోవైపు నిఫ్టీ కూడా దాదాపు 247 పాయింట్లు పడిపోయి 23,944 స్థాయికి వచ్చింది. ఇంకోవైపు నిఫ్టీ బ్యాంక్ కూడా 660 పాయింట్లకు పైగా పడిపోయింది. నిప్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ కూడా 260 పాయింట్లకు పైగా పడిపోయింది. దీంతో మదుపర్లు కొన్ని నిమిషాల్లోనే లక్షల కోట్ల రూపాయలను నష్టపోయారు.
టాప్ 5 స్టాక్స్
ఈ క్రమంలో బజాజ్ ఫిన్‌సర్వ్, ఏషియన్ పెయింట్స్, JSW స్టీల్, ICICI బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉండగా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, BPCL, సన్ ఫార్మా, అపోలో హాస్పిటల్ సంస్థల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉన్నాయి. US ఫెడ్ వడ్డీ రేట్లలో కోత ప్రభావం భారతీయ స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ఈ క్రమంలో సెన్సెక్స్‌లో లిస్టయిన మొత్తం 30 కంపెనీల షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి. ఇన్ఫోసిస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు అత్యధికంగా పడిపోయాయి.
సెక్టార్ల వారీగా చూస్తే
ఇక సెక్టార్ల వారీగా చూస్తే ఫార్మా ఇండెక్స్ టాప్ గెయినర్‌గా ఉంది. 1.21 శాతం పైకి ఎగబాకింది. హెల్త్‌కేర్, ఆయిల్ & గ్యాస్ ఇండెక్స్‌లు తరువాత ఉన్నాయి. ఇక వెనుకబడిన వాటిలో ఐటి ఇండెక్స్ టాప్ డ్రాగ్‌గా ఉంది. ఇది 1.31 శాతం పడిపోయింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.40 శాతం, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.37 శాతం పతనమైంది. సెకండరీ మార్కెట్లు అణచివేయబడినప్పటికీ, ప్రైమరీ మార్కెట్లలో, ఇన్వెంటరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్ షేర్లు గురువారం బలమైన అరంగేట్రం చేశాయి. ఇష్యూ ధర రూ.1,329కి వ్యతిరేకంగా ఒక్కో షేరుకు 42.96 శాతం ప్రీమియంను ప్రతిబింబిస్తూ కంపెనీ షేర్లు రూ.1,900 వద్ద లిస్టయ్యాయి.
రికార్డ్ స్థాయికి..
భారతీయ మార్కెట్లో అత్యంత ఖరీదైన ఫార్మాస్యూటికల్ స్టాక్ అయిన అబోట్ ఇండియా షేర్లు 2.72 శాతం వరకు పెరిగి, డిసెంబర్ 19, 2024న BSEలో ఒక్కో షేరుకు రూ. 28,900 ఇంట్రాడే గరిష్ఠ స్థాయిని తాకాయి. ఇదే సమయంలో బలహీనమైన మార్కెట్‌లో భారీ వాల్యూమ్‌ల మధ్య గురువారం ఇంట్రా-డే ట్రేడ్‌లో ఆదిత్య బిర్లా మనీ షేర్లు బీఎస్‌ఈలో 17 శాతం పెరిగి రికార్డు స్థాయిలో రూ.289కి చేరుకున్నాయి. ఇప్పటివరకు డిసెంబర్ నెలలో ఈ ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ స్టాక్ 74 శాతం జూమ్ చేసింది.
ఇవి కూడా చదవండి:
Spherical Egg: ఒక కోడి గుడ్డు ధర రూ. 21 వేలు.. స్పెషల్ ఏంటో తెలుసా..
Choti Choti Savings: ఈ చిన్నారి పొదుపును చూస్తే షాక్ అవుతారు.. వైరల్ వీడియో
Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Top Mutual Funds: గత ఐదేళ్లలో టాప్ 7 మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ ఇచ్చాయంటే..
Read More Business News and Latest Telugu News