Stock market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..సెన్సెక్స్ 677 పాయింట్లు జంప్
ABN , Publish Date - May 16 , 2024 | 03:44 PM
దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock markets) గురువారం (మే 16న) భారీ లాభాలతో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్లలో ర్యాలీ తర్వాత గురువారం దేశీయ మార్కెట్లలో బలమైన ప్రారంభం మొదలై, సెన్సెక్స్ 677 పాయింట్లు, నిఫ్టీ 203 పాయింట్ల లాభంతో ముగిశాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock markets) గురువారం (మే 16న) భారీ లాభాలతో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్లలో ర్యాలీ తర్వాత గురువారం దేశీయ మార్కెట్లలో బలమైన ప్రారంభం మొదలై, సెన్సెక్స్ 677 పాయింట్లు, నిఫ్టీ 203 పాయింట్ల లాభంతో ముగిశాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ 73,633 స్థాయి వద్ద ఉండగా, నిప్టీ 22,403 పాయింట్ల పరిధిలో ఉంది. దీంతోపాటు బ్యాంక్ నిఫ్టీ కూడా 290 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 456 పాయింట్లు పుంజుకుంది.
ఈ క్రమంలో నిఫ్టీ 50లో టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఎల్‌టీఐఎండ్ ట్రీ, ఎం అండ్ ఎం, భారతీ ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా సంస్థల స్టాక్స్ టాప్ గెయినర్లుగా ఉండగా, మారుతీ సుజుకి, టాటా మోటార్స్, ఎస్‌బీఐ, బీపీసీఎల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్లు వెనుకబడి ఉన్నాయి.
అయితే అంతర్జాతీయంగా సానుకూల ధోరణులు ప్రారంభమైన తర్వాత, గురువారం నాటి ట్రేడింగ్‌లో కీలక ఐటీ స్టాక్స్ పుంజుకున్నాయి. మరోవైపు అమెరికా వినియోగదారు ద్రవ్యోల్బణ గణాంకాలు ఊహించిన దానికంటే తక్కువగా ఉండటంతో ప్రపంచ స్టాక్‌లలో పెరుగుదల కనిపించింది. దీంతోపాటు 2024లో రెండు వడ్డీ రేటు తగ్గింపులు కూడా సానుకూలంగా ఉంటాయని తెలియడంతో స్టాక్ మార్కెట్లో ఐటీ స్టాక్స్ పరుగులు తీశాయి.
ఇది కూడా చదవండి:
Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..ఈ మోసాల పట్ల జాగ్రత్త
SEBI: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు శుభవార్త.. ఆ రూల్స్ సడలించిన సెబీ
Read Latest Business News and Telugu News