Stock Markets: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఒక్కరోజే రూ.38 లక్షల కోట్లు ఖతం
ABN , Publish Date - Jun 04 , 2024 | 03:53 PM
2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో (జూన్ 4) స్టాక్ మార్కెట్(stock market) సూచీలు భారీగా పతనమయ్యాయి. అంచనాలకు విరుద్ధంగా స్టాక్ మార్కెట్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ 50 సహా దాదాపు అన్ని సూచీలు నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. దీంతో ఒక్కరోజే మదుపర్లు పెద్ద ఎత్తున సంపదను కోల్పోయారు.
2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో (జూన్ 4) స్టాక్ మార్కెట్(stock market) సూచీలు భారీగా పతనమయ్యాయి. అంచనాలకు విరుద్ధంగా స్టాక్ మార్కెట్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ 50 సహా దాదాపు అన్ని సూచీలు నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 3906 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ 4051 పాయింట్లు, నిఫ్టీ 1379 పాయింట్లు పడిపోయాయి. మరోవైపు నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా 4202 పాయింట్లు కోల్పోయింది. ఎగ్జిట్ పోల్ అంచనాలు తప్పు అని రుజువు కావడంతో ఆ ప్రభావం స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపింది. బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో మార్కెట్‌లో నిరాశ ప్రతిబింభింది.
ఈ నేపథ్యంలో అదానీ పోర్ట్స్ (-21.18%), అదానీ ఎంటర్‌ప్రైజెస్ (-19.82%), ONGC (-17.72%), NTPC (-15.9%), SBI (-15.22%) కంపెనీల షేర్స్ టాప్ లూజర్స్‌గా ఉండగా, హిందుస్థాన్ యూనిలీవర్ (5.52%), బ్రిటానియా (2.91%), నెస్లే ఇండియా (2.64%), హీరో మోటోకార్ప్ (2.60%), టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ (1.04%) టాప్ గెయినర్లుగా నిలిచాయి. నేడు దేశవ్యాప్తంగా 543 స్థానాలకు జరిగిన ఓట్ల లెక్కింపు జరుగుతోంది.
సోమవారం మార్కెట్లు 3 శాతానికి పైగా లాభంతో ముగిశాయి. కానీ మంగళవారం మాత్రం 8 శాతానికి పైగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలో జూన్ 4న ఇంట్రాడే ట్రేడ్‌లో మదుపర్లు ఒక్కరోజే 38 లక్షల కోట్ల రూపాయలు కోల్పోయారు. దీంతో BSEలో జాబితా చేయబడిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ (mcap) విలువ రూ.388 లక్షల కోట్లకు చేరుకుంది. మునుపటి సెషన్ ముగింపులో దాదాపు రూ.426 లక్షల కోట్లుగా ఉండేది.
ఇది కూడా చదవండి:
Stock Market: ఎన్నికల ఫలితాల వేళ అప్రమత్తం.. సెన్సెక్స్ 3500 పాయింట్లు ఢమాల్!
CIBIL Score: సిబిల్ స్కోర్ ఎక్కువ సార్లు చెక్ చేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు
For Latest News and Business News click here