Stock Markets: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. క్షణాల్లోనే రూ. 8.6 లక్షల కోట్లు
ABN , Publish Date - Nov 25 , 2024 | 09:35 AM
భారత స్టాక్ మార్కెట్లు వారంలో మొదటిరోజైన నేడు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో సెన్సెక్స్, నిఫ్టీతోపాటు సూచీలు మొత్తం గ్రీన్‌లోనే ఉన్నాయి. అయితే ఏ మేరకు పెరిగాయనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశీయ స్టాక్ మార్కెట్ (stock market) సూచీలు నేడు (నవంబర్ 25న) భారీ లాభాలతో మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో బెంచ్‌మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలైన బీఎస్‌ఈ సెన్సెక్స్, నిఫ్టీ భారీగా ఎగబాకాయి. ఈ క్రమంలో ఉదయం 9.20 గంటల నాటికి సెన్సెక్స్ 1,227 పాయింట్లు లేదా 1.55 శాతం పెరిగి 80,344.78 స్థాయిలో ఉండగా, నిఫ్టీ 50 370 పాయింట్లు లేదా 1.55 శాతం పెరిగి 24,277 స్థాయిలో ట్రేడైంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 1028 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ కూడా 1013 పాయింట్లు పుంజుకుంది. దీంతో మదుపర్లు కొన్ని నిమిషాల్లోనే 8.6 లక్షల కోట్ల రూపాయలను దక్కించుకున్నారు.
టాప్ 5 స్టాక్స్
ఈ నేపథ్యంలో HDFC బ్యాంక్, రిలయన్స్, SBI, లార్సెన్, అదానీ ఎంటర్‌ప్రైస్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉండగా, JSW స్టీల్, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సంస్థల స్టాక్స్ టాప్ 3 నష్టా్ల్లో ఉన్నాయి. ఈ క్రమంలో నిఫ్టీ 50లో 50 స్టాక్స్‌లలో 49 గ్రీన్‌లోనే ట్రేడవుతున్నాయి. ఇదే సమయంలో శ్రీరామ్ ఫైనాన్స్ (4.51 శాతం పెరుగుదల), మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ ఎంటర్‌ప్రైజెస్, BEL, NTPC లాభాలు ముందున్నాయి. PSU బ్యాంక్ ఇండెక్స్ అత్యధికంగా లాభపడటంతో అన్ని రంగాల సూచీలు ఎక్కువగా ట్రేడవుతున్నాయి. OMC, రియాల్టీ, నిఫ్టీ బ్యాంక్ సూచీలు మూడూ 2 శాతం కంటే ఎక్కువగా ట్రేడయ్యాయి.
కారణమిదేనా..
దీంతో నిఫ్టీ స్మాల్‌క్యాప్ 1.83 శాతం, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 1.79 శాతం పెరిగింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని పార్టీల సంకీర్ణ విజయం, ప్రపంచ మార్కెట్లలో బలమైన సంకేతాలు సహా పలు అంశాల నేపథ్యంలో మార్కెట్లు పాజిటివ్ ధోరణుల్లో కొనసాగుతున్నాయి.
శుక్రవారం మార్కెట్
శుక్రవారం బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలైన బీఎస్‌ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 ఒక్కొక్కటి 2 శాతానికి పైగా పెరిగాయి. రెండు రంగాలలో కొనుగోళ్లు పెరిగాయి. దీంతో సెన్సెక్స్ 1,961.32 పాయింట్లు లేదా 2.54 శాతం పెరిగి 79,117.11 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 557.35 పాయింట్లు లేదా 2.39 శాతం పెరిగి 23,907.25 వద్ద ముగిసింది. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీలు వరుసగా 0.90 శాతం, 1.16 శాతం చొప్పున పెరిగాయి. 0.32 శాతం నష్టపోయిన నిఫ్టీ మీడియా ఇండెక్స్ మినహా అన్ని రంగాల సూచీలు కూడా గ్రీన్‌లో ముగిశాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఇతర రంగాల సూచీలను అధిగమించి 3.29 శాతం లాభంతో ముగిసింది. దీని తర్వాత నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ కూడా 3 శాతానికి పైగా పెరిగి లాభాల్లో పూర్తైంది.
ఇవి కూడా చదవండి:
Investment Tips: 20 ఏళ్లలో రూ. 5 కోట్లు సంపాదించాలంటే.. ఏ స్కీంలో పెట్టుబడి చేయాలి..
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Bank Holidays: వచ్చే నెలలో 17 రోజులు బ్యాంకులు బంద్.. కారణమిదే..
Aadit Palicha: చదువు, జాబ్ వదిలేసి స్టార్టప్ పెట్టాడు.. ఇప్పుడు రూ.4300 కోట్ల సంపదకు..
Read More Business News and Latest Telugu News