Stock Markets: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. నిమిషాల్లోనే లక్షల కోట్లు సంపాదించిన మదుపర్లు
ABN , Publish Date - Dec 13 , 2024 | 04:16 PM
భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు, చివరకు భారీ లాభాల దిశగా దూసుకెళ్లాయి. ఈ క్రమంలో సెన్సెక్స్, నిఫ్టీ ఏ మేరకు పుంజుకుందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) వారాంతంలోని శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. ఈ క్రమంలో బీఎస్‌ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 శుక్రవారం క్షీణతతో ప్రారంభమై, భారీ లాభాలతో స్థిరపడ్డాయి. ఈ క్రమంలో 30 షేర్ల సెన్సెక్స్ ప్రారంభ పతనం నుంచి కోలుకుని 843.16 పాయింట్ల లాభంతో 82,133.12 వద్ద ముగిసింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ 82,192.61 వద్ద గరిష్ట స్థాయికి చేరుకోగా, 80,082.82 వద్ద కనిష్ట స్థాయికి చేరుకుంది. మరోవైపు నిఫ్టీ 50 కూడా 219.60 పాయింట్ల లాభంతో 24,768.30 వద్ద ముగిసింది. ఈ నేపథ్యంలో నిఫ్టీ గరిష్టంగా 24,792.30, కనిష్టంగా 24,180.80కి చేరింది. దీంతో మదుపర్లు కొన్ని గంటల్లోనే లక్షల కోట్ల రూపాయాలను దక్కించుకున్నారు.
టాప్ స్టాక్స్
ఈ నేపథ్యంలో శుక్రవారం ట్రేడింగ్ బుల్స్‌కు అనుకూలంగా కొనసాగింది. నిఫ్టీ 50 షేర్లలో 41 గ్రీన్‌లో ముగిశాయి. వీటిలో భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, అల్ట్రాటెక్ సిమెంట్ వంటి షేర్లు 4.44% వరకు పెరిగాయి. ఇదే సమయంలో శ్రీరామ్ ఫైనాన్స్, టాటా స్టీల్, హిందాల్కో, ఇండస్‌ఇండ్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ వంటి 9 స్టాక్‌లు 2.44 శాతం క్షీణతతో ముగిశాయి.
సెన్సెక్స్ 30 స్టాక్‌లలో 5 మాత్రమే క్షీణించాయి. టాటా స్టీల్ (1.26% తగ్గింది). ఇండస్ఇండ్ బ్యాంక్, JSW స్టీల్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్ సహా మిగిలిన షేర్లు లాభాల్లోకి చేరాయి. మరోవైపు భారతీ ఎయిర్‌టెల్ (3.96%), ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్‌సీఎల్ టెక్, అల్ట్రాటెక్ సిమెంట్ స్టాక్స్ అత్యధిక లాభాలను దక్కించుకున్నాయి.
ఉద్దీపన చర్యలు
అమెరికా రేటు తగ్గింపు, భారతి ఎయిర్‌టెల్ అద్భుతమైన పనితీరు ఆశల నేపథ్యంలో ఐటీ స్టాక్స్ భారీగా పుంజుకున్నాయి. 2025 కోసం జెఫరీస్ దాని అగ్ర ఆసియా ఎంపికలలో చేర్చిన తర్వాత ఇది 4% పెరిగింది. కానీ అన్ని రంగాలు మాత్రం ఆశావాదాన్ని పంచుకోలేదు. నిఫ్టీ మెటల్స్ ఇండెక్స్ 1.7% పడిపోయింది. ఇది బలమైన యూఎస్ డాలర్, అస్పష్టమైన చైనీస్ ఉద్దీపన చర్యలు సెంటిమెంట్‌పై ప్రభావం చూపడంతో ఇది రోజులో చెత్త-పనితీరు రంగంగా మారింది. అధిక వెయిటేజీ ఆర్థికాంశాలు 0.6% క్షీణించగా, IT స్టాక్స్ 0.5% పడిపోయాయి.
ఇవి కూడా చదవండి:
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Bitcoin Investment: ఇది కదా లక్కంటే.. అప్పటి 100 రూపాయల పెట్టుబడి, ఇప్పుడు 1.7 కోట్లు
Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..
Bima Sakhi Yojana 2024: మహిళలకు మంచి ఛాన్స్.. బీమా సఖీ యోజనతో రూ. 48 వేలు సంపాదించే అవకాశం..
Read More Business News and Latest Telugu News