Stock Markets: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. టాప్ 5 లాభాల స్టాక్స్!
ABN , Publish Date - Jul 26 , 2024 | 10:43 AM
దేశీయ స్టాక్ మార్కెట్లు (stock markets) నేడు శుక్రవారం (జులై 27న) వారం చివరి ట్రేడింగ్ సెషన్‌లో సానుకూల ధోరణితో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 119 పాయింట్లు పెరిగి 80,158 వద్ద, నిఫ్టీ 50 కూడా 17 పాయింట్లు పెరిగి 24,423 పాయింట్లతో మొదలైంది. ఆ తర్వాత ఉదయం 10.30 గంటల సమయంలో సెన్సెక్స్(sensex) 507 పాయింట్లు లాభపడి 80,547 స్థాయిలో ఉండగా, నిఫ్టీ(nifty) 180 పాయింట్లు వృద్ధి చెంది 24,585కి చేరుకుంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు (stock markets) నేడు శుక్రవారం (జులై 27న) వారం చివరి ట్రేడింగ్ సెషన్‌లో సానుకూల ధోరణితో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 119 పాయింట్లు పెరిగి 80,158 వద్ద, నిఫ్టీ 50 కూడా 17 పాయింట్లు పెరిగి 24,423 పాయింట్లతో మొదలైంది. ఆ తర్వాత ఉదయం 10.30 గంటల సమయంలో సెన్సెక్స్(sensex) 507 పాయింట్లు లాభపడి 80,547 స్థాయిలో ఉండగా, నిఫ్టీ(nifty) 180 పాయింట్లు వృద్ధి చెంది 24,585కి చేరుకుంది.
దీంతోపాటు నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ కూడా 831 పాయింట్లు ఎగబాకి 57,581 స్థాయికి చేరింది. కానీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం లాభాలకు విరుద్ధంగా 140 పాయింట్లు నష్టపోయి 50,747 పరిధిలో ఉంది. ఈ క్రమంలో మిడ్ క్యాప్ ఇండెక్స్‌లో 0.66 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లో 0.45 శాతం పెరుగుదలకు దారితీసింది.
కారణమిదేనా..
ఈరోజు ఉదయం ఆసియా(asia)లో ట్రేడింగ్ నిలకడగా ప్రారంభమైంది. దీంతో ఇది పెట్టుబడిదారులకు మద్దతునిచ్చింది. ఆస్ట్రేలియా ASX200 ఇండెక్స్, దక్షిణ కొరియా Kospi ఇండెక్స్ రెండూ 0.87 శాతం లాభాలతో ట్రేడవుతున్నాయి. హాంకాంగ్ హ్యాంగ్ సెంగ్ ఇండెక్స్ 1.14 శాతం పెరుగగా, జపాన్ నిక్కీ ఇండెక్స్ 0.19 శాతం పెరిగింది. వాల్ స్ట్రీట్‌లో S&P 500 0.51 శాతం క్షీణించగా, నాస్‌డాక్ 0.93 శాతం క్షీణతను నమోదు చేసింది.
రెండో త్రైమాసికంలో US ఆర్థిక వ్యవస్థ 2.8 శాతం వృద్ధిని సాధించింది. ఇది ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉంది. ఈ పెరుగుదల ప్రభావం మార్కెట్‌పై కూడా కనిపించింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.2 శాతం లాభపడింది. ఈ సానుకూల ధోరణి సహా పలు అంశాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా లాభాల దిశగా కొనసాగుతున్నాయి.
టాప్ 5 స్టాక్స్
ఈ క్రమంలోనే ప్రస్తుతం భారతి ఎయిర్‌టెల్, దివిస్ ల్యాబ్స్, శ్రీరామ్ ఫైనాన్స్, LTIMindtree, ఇన్ఫోసిస్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉండగా, టెక్ మహీంద్రా, HDFC బ్యాంక్, TATA కంన్జూమర్స్, ONGC, నెస్లే సంస్థల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉన్నాయి. భారత స్టాక్ మార్కెట్ పతనం గురువారం కూడా కొనసాగింది. గ్లోబల్ మార్కెట్‌లో బలహీనమైన ట్రెండ్‌తో ఇన్వెస్టర్లు మెటల్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్‌లను విక్రయించారు. సెక్యూరిటీల లావాదేవీల పన్ను, స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను పెరుగుదల తర్వాత భారీగా విదేశీ నిధుల ప్రవాహం మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేసింది.
ఇవి కూడా చదవండి:
Gold and Silver Rates Today: మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. కొనుగోళ్ల కోసం క్యూ కడుతున్న జనాలు
Bank Holidays: ఆగస్టులో దాదాపు సగం రోజులు బ్యాంకులు బంద్.. కారణాలివే
టెక్ మహీంద్రా లాభంలో 23% వృద్ధి
Read More Business News and Latest Telugu News