Share News

Stock Markets: వారం మొదటిరోజే ఇలా జరిగిందా.. ఎన్ని లక్షల కోట్లు నష్టపోయారంటే

ABN , Publish Date - Oct 21 , 2024 | 03:55 PM

నేడు భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో క్లోజ్ అయ్యాయి. ఈ క్రమంలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ ఏకంగా 971 పాయింట్లను నష్టపోయింది. దీంతోపాటు మిగతా సూచీలు మొత్తం కూడా రెడ్‌లోనే ముగిశాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.

Stock Markets: వారం మొదటిరోజే ఇలా జరిగిందా.. ఎన్ని లక్షల కోట్లు నష్టపోయారంటే
Stock markets october 21st 2024

దేశీయ స్టాక్ మార్కెట్లు (stock markets) వారం మొదటిరోజైన సోమవారం (అక్టోబర్ 21న) భారీ నష్టాలతో ముగిశాయి. క్యూ2 ఎర్నింగ్స్ సీజన్‌లో ఇన్వెస్టర్లు అధిక స్థాయిలో లాభాలను బుక్ చేసుకోవడంతో సోమవారం భారత స్టాక్ మార్కెట్లు ఒత్తిడికి లోనయ్యాయి. ఈ క్రమంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్ ధరలో దాదాపు 3 శాతం పెరుగుదల ఉన్నప్పటికీ, బెంచ్‌మార్క్ సూచీలైన బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచీలు ప్రతికూలంగా ముగిశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 73.48 పాయింట్లు క్షీణించి 81,151.27 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 కూడా 73 పాయింట్ల నష్టాలతో 24,781 వద్ద ప్రతికూల జోన్‌లో ముగిసింది.


టాప్ 5 స్టాక్స్

మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 131 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 971 పాయింట్లు తగ్గింది. సెక్టార్లలో నిఫ్టీ మీడియా ఇండెక్స్ 2.8 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.7 శాతం, నిఫ్టీ ఐటీ 1.5 శాతం, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ 1.3 శాతం చొప్పున క్షీణించాయి. దీంతో మదుపర్లు దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలను నష్టపోయారు. ఈ క్రమంలో టాటా కంన్జ్యూమర్ ప్రొడక్ట్స్, కోటక్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ్, BPCL, ఇండస్ఇండ్ బ్యాంక్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉండగా, బజాజ్ ఆటో, HDFC బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, M&M, ఐషర్ మోటార్స్ సంస్థల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉన్నాయి.


కారణమిదేనా

ఈ నేపథ్యంలోనే అల్ట్రాటెక్ సిమెంట్ క్యూ2 లాభం 36% తగ్గి రూ.820 కోట్లకు పడిపోయింది. బిట్‌కాయిన్ $69K పైన ఎగబాకి, 3 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు Q2 ఆదాయాల తర్వాత 6% పడిపోయాయి. RBI సహ యూనిట్‌పై ఆంక్షలను ఎత్తివేయడంతో JM ఫిన్ షేర్లు 5% పెరిగాయి. క్యూ2 షో తర్వాత టెక్ మహీంద్రా షేర్లు 3% పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న మిశ్రమ సూచనల ప్రభావంతో మార్కెట్లు తిరోగమనం దిశగా వెళ్లాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభావం ప్రధానంగా IT స్టాక్‌లలో కనిపించింది. దీంతోపాటు ఊహించిన దాని కంటే బలహీనమైన త్రైమాసిక ఆదాయాలు రావడం కూడా మార్కెట్‌పై ప్రభావం చూపించాయి.


రియల్ ఎస్టేట్ ఢమాల్

NSE లిస్టెడ్ రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ PropEquity నివేదిక ప్రకారం భారతదేశంలోని టాప్ ముప్పై టైర్ II నగరాల్లో హౌసింగ్ అమ్మకాలు 2024 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 13 శాతం పడిపోయాయి. కొత్త లాంచ్‌లు 34 శాతం తగ్గాయని ప్రకటించారు. ఈ క్రమంలోనే హౌసింగ్ అమ్మకాలు 2024 క్యూ3లో 41,871 యూనిట్లకు పడిపోయాయి. గత ఏడాది ఇదే కాలంలో 47,985 యూనిట్లు ఉండగా, లాంచ్‌లు 2024 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 28,980 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే కాలంలో 43,748 యూనిట్లు నమోదయ్యాయి.


ఇవి కూడా చదవండి:

Muhurat Trading 2024: ఈసారి దీపావళి ముహూరత్ ట్రేడింగ్ ఎప్పుడంటే.. అక్టోబర్ 31 లేదా నవంబర్ 1..


Pension Plan: రోజూ రూ. 12 ఆదా చేస్తే.. 60 ఏళ్ల తర్వాత నెలకు ఎంత పెన్షన్ వస్తుందంటే..

Missed Call: మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ మిస్డ్ కాల్ ఇచ్చి ఇలా చెక్ చేసుకోండి..


Personal Finance: మహిళలకు గుడ్ న్యూస్.. రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు..



Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Oct 21 , 2024 | 05:00 PM